हिन्दी | Epaper
రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Orderly system : ‘ఆర్డర్లీ’ వ్యవస్థకు మంగళం ఎప్పుడు?

Sudha

రాజ్యాలు అంతరించినా, రాజులు పోయినా, ఆ అవశేషాలు ఎంతోకొంత ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అంతకం తకు పెరిగిపోతున్న విఐపి సంస్కృతి అటుసాధారణ ప్రజలతోపాటు, ఇటు అధికార వర్గాలను కూడా ఇబ్బం దులకు గురి చేస్తున్నాయి. వాహనాలకు ఎర్ర బుగ్గ, నీలిబుగ్గ పెట్టుకోడానికి వీలు కల్పించే నిబంధనలు రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆబుగ్గ సంస్కృతికిమంగ ళం పాడినట్లేనని, ఆవాహనాలు కనుమరుగు అవుతాయని అందరూ భావించారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు, కొన్ని పోలీసు వాహనాలు లాంటి వాటికి మాత్రమే నీలిదీపాన్ని వాడేం దుకు మినహాయింపు ఇచ్చారు. ఎర్ర, నీలిదీపాలు తొల గింపునకు వీలుగా కేంద్రం మోటారు వాహనాల నిబం ధనల 1989కి సవరణ చేస్తున్నట్లు అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఉన్నత స్థాయిలో ఉన్న కొందరు వ్యక్తులు వాడే వాహనాలపై ఈ బుగ్గలు ఏర్పర్చ డానికి వీలు లేదని, సైరన్లు కూడా రద్దుచేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి ఆనాడే ప్రకటించారు. ఈ వాహనాలపై ప్రత్యేక దీపాలను ఎప్పుడో తొలగించా ల్సి ఉందని, ప్రధాని మోడీ కూడా అభిప్రాయపడ్డారు. 2017 మే ఒకటో తేదీ నుండి అమలు అవుతున్నట్లు చెప్తు న్నా ఇప్పటికీ కొందరు విఐపిలు, ఆ సంస్కృతిని కొనసాగి స్తూనే ఉన్నాయి. కొందరు సీనియర్ అధికారులు కూడా సైరన్ మోగిస్తున్నారు. ఇంకా ఇది పూర్తిగా సమిసిపోలేద నే చెప్పొచ్చు. బుగ్గకార్లే కాదు వెట్టిచాకిరికి అద్దంపడుతూ ఆర్డర్లీవ్యవస్థ కూడా నేటికీ ప్రజస్వామ్యంలో కొనసాగు తుండడం దురదృష్టకరం. ప్రధానంగా పోలీసు శాఖలో దశాబ్దాల తరబడి సాగుతున్న ఈ వెట్టిచాకిరిని అంతమొం దించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నాలు చేస్తున్నా అది ఏదో ఒకరూపంలో కొనసాగుతూనే ఉన్నది. ఆర్డర్లీ వ్యవస్థ (Orderly system)అన్నా, మరో పేరుతో పిలిచినా బ్రిటిష్ కాలం నుండే మొదలైన ఈ దుస్సంప్రదాయాన్ని స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా పారద్రోలలేకపోతున్నారు. గతంలో ఈ విషయం ఎన్నోసార్లు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పాలకుల దృష్టికి వచ్చింది. 1979లో ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఈ వ్యవస్థను రద్దుచేస్తూ సెప్టెంబరు 19వ తేదీన జీవో నెం. 612 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యామ్నాయంగా అప్పటివరకు ఈ ఆర్డర్లీ వ్యవ స్థను ఉపయోగించుకుంటున్న అధికారులకు కాంపెన్సెటరీ అలవెన్సు కింద రూ.120నుంచి రూ.250 వరకు అద నంగా చెల్లించాలని ఆదేశించారు. అయితే ఒకటి, రెండు నెలలు తాత్కాలికంగా ఈ వ్యవస్థ ఆగిపోయినా ఆతర్వాత యధా తథంగా కొనసాగింది. అటు ప్రభుత్వం ఇచ్చేకాంపె న్సె టరీ అలవెన్సు తీసుకుంటూనే మరొకపక్క ఆర్డర్లీని నియమించుకోవడంతో అటు డబ్బుపోతున్నది, ఇటు వ్యవస్థను నియంత్రించలేకపోతున్నామనే భావనతో 1988 అక్టోబరు 31న కాంపెన్సెటరీ అలవెన్సును నిలిపివేస్తూ ఉత్తర్వును జారీచేశారు. అలవెన్సు రద్దు కావడంతో తిరిగి వారిని నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. దీంతో ఈవ్యవస్థవల్ల ముఖ్యంగా హోంగార్డులు, మరికొం దరు కానిస్టేబుల్స్ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మళ్లీ ఇదే విషయం ఆనాటి ముఖ్యమంత్రి రాజ శేఖర్ దృష్టికిరావడంతో ఆయన తీవ్రంగా స్పందించి రద్దు కు చర్యలుతీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలా ఎన్ని సార్లుపాలకులు పదేపదే ప్రకటించినా అధికారులను హెచ్చ రించినా ఆర్డర్లీ వ్యవస్థ (Orderly system)మాత్రం దూరం కాలేదు. అప్పుడప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు తాము తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నామని ఆర్డర్లీగా పని చేస్తున్న వారు తమ గోడు వెల్లబోసుకున్నప్పుడు విచారణ చేసి పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చి చర్యలు తీసుకున్నట్లు చెప్పి ఆ తర్వాత మరచిపోతున్నారు. గతంలో అంత చదువుకున్న వారు హోంగార్లు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు రావడానికి పెద్దగా ఇష్టపడేవారుకాదు. ప్రసుత్తం నిరుద్యోగ రక్కసి ప్రబలిపోయింది. జీవనాధారం లేక మరో దిక్కులేక అదే పదివేలు అనుకుంటూ హోంగార్డు ఉద్యోగాలకు సైతం డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ చదివినవారు క్యూకడుతున్నారు. ఇటు వంటి వారితో ఇంటి పనులు చేయించడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించాలి. కొందరు కానిస్టే
బుల్స్ కూడా ఆర్డర్లీగానే మగ్గిపోతున్నారు. వేలాది రూపా యలు ప్రజా ధనం వెచ్చించి నెలలతరబడి శిక్షణలు ఇచ్చి శాంతిభద్రతలను కాపాడాల్సిన చేతులతో ఇంటి పనులు చేయించడం అత్యంత దురదృష్టకరం, బాధాకరం. ఇక భద్రతకోసం ఇచ్చిన సిబ్బందిని కూడా కొందరు రాజకీయ నేతలు, మరికొందరు అధికారులు వ్యక్తిగత పనులకువాడుకోవడం జరుగుతున్నది. అసలు బాడీగార్డు అనేది ఒక స్టేటస్ సింబల్గా మారిపోయింది. రక్షణకోసం పెట్టిన ఈ కానిస్టేబుల్స్ ఏళ్లతరబడి ఒకేచోట ఉండడం, తూపాకివాడేకపద్ధతులు, విధానాలు మరిచిపోయి అటెండర్లుగా కొనసా గుతున్నారు. మొత్తం మీద ప్రభుత్వం జీతాలు ఇస్తూ వారితో ఆర్డర్లీ పేరుతోనో, రక్షణ పేరుతోనో వ్యక్తిగత పనులు చేయించుకునే సంప్రదాయం రానురాను పెరిగి పోతున్నది. ఆర్డర్లీ అని పేరు అన్నిశాఖల్లో లేకపోయినా, ఏ రూపంలో ఉన్నా కూకటివేళ్లతో పెరికివేయాలి. వారూ ప్రభుత్వ ఉద్యోగులు, సాటి మానవులు అన్న విషయాన్ని ఎప్పుడూవిస్మరించకూడదు. అందరిలాగే వారికి ఆత్మగౌర వం ఉంటుంది. దానికి భంగం వాటిల్లకుండా చూడాల్సిన
బాధ్యత పాలకుల కనీస కర్తవ్యం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురు

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురు

విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుకు ప్రభుత్వం 250 కోట్లు విడుదల!

విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుకు ప్రభుత్వం 250 కోట్లు విడుదల!

నెల్లూరు ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం

నెల్లూరు ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం

రాజమండ్రి కల్తీ పాలు షాక్, బాధితుల ఆరోగ్యం ఆందోళనకరం

రాజమండ్రి కల్తీ పాలు షాక్, బాధితుల ఆరోగ్యం ఆందోళనకరం

ఈ నెల 4న విశాఖ, అల్లూరి జిల్లాలల్లో జగన్‌ పర్యటన

ఈ నెల 4న విశాఖ, అల్లూరి జిల్లాలల్లో జగన్‌ పర్యటన

ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం

మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం

ఏపీ గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

ఏపీ గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

కుప్పంలో గంజాయి స్వాధీనం 20 లక్షల సరుకుతో 8 మంది అరెస్ట్

కుప్పంలో గంజాయి స్వాధీనం 20 లక్షల సరుకుతో 8 మంది అరెస్ట్

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు.

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు.

📢 For Advertisement Booking: 98481 12870