📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : Operation Swarna : స్వర్ణముఖి నది రక్షణకు తుడ భారీ చర్యలు

Author Icon By Shravan
Updated: September 2, 2025 • 2:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Operation Swarna : తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మహానగరం తరహాలో తిరుపతిజిల్లాలో ప్రధానమైన ‘స్వర్ణముఖినది’ ప్రక్షాళనకు ఆపరేషన్ స్వర్ణ చేపడు తున్నామని తిరుపతి పట్టణా భివృద్ధి (Development) సం స్థ(తుడ) చైర్మన్ సి. దివాకర్రెడ్డి సంచలన నిర్ణయం వెల్లడించారు. తిరుపతి రూరల్ తొండవాడ నుండి శ్రీకాళహస్తి వరకు పవిత్రస్వర్ణముఖి నది పరిరక్షణకు కొత్త జిఒ తీసుకు వచ్చామన్నారు. ఆపరేషన్ స్వర్ణ తో నదికి పూర్వవైభవం తీసుకువ స్తామని తెలిపారు. 130కిలోమీటర్లు పొడవున్న స్వర్ణముఖి వెంబడి గత వైసిపి హయాంలో భారీగా ఆక్రమణలు జరిగాయని వ్యాఖ్యానించారు. నదికి ఇరువైపులా భూములు కబ్జాచేసి అమ్మే శారని ఆరోపించారు. వంకలు, చెరువులను తప్పుడు పత్రాలు సృష్టించి దోచుకున్నారన్నారు. గత వైసిపి పాలకమండలి ఐదేళ్ళలో తుడ నిధులు 270కోట్లు రూపాయలు ఎంపిడిఒ ఖాతాలకు మళ్ళించి దోచుకున్నారని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ స్వర్ణ’ పేరుతో చేపడుతున్నప్రక్షాళన అభివృద్ధిపై, తుడ చైర్మన్ గా వందరోజుల పరిపాలనపై సోమవారం ఉదయం చైర్మన్ సి.దివాకర్ రెడ్డి కార్యాలయంలో మీడియాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై, గత తుడ పాలకమండలి దోపిడీ, అక్రమాలపై వ్యాఖ్యలు చేశారు. తుడ చైర్మన్ గా వందరోజుల్లో అనేక సంస్క రణలు చేపట్టానన్నారు. ఎన్నోఏళ్ళుగా పరిష్కారం కాని తిరుపతి రూరల్ శెట్టిపల్లి భూములకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు.

ఆపరేషన్ స్వర్ణ: స్వర్ణముఖి నది ప్రక్షాళనకు భారీ ప్రణాళికలు

అక్కడ ప్లాట్ యజమానులకు 50-50 నిష్పత్తిలో, రైతులకు 30-70 నిష్పత్తిలో పంపకాలు జరుగుతాయన్నారు. తుడ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దాదాపు 850మంది పంచాయతి కార్యదర్శులకు, మండల ఎంపిడిఒలకు తుడ లేఔట్స్ అప్రూవల్ భవనాలు అనుమతులపై శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని సగర్వంగా తెలిపారు. ఇప్పుడు ఆపరేషన్ స్వర్ణ పేరుతో నదిని ప్రక్షాళన చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. ఈ సతా కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారాచంద్ర బాబునాయుడు, రాష్ట్రమంత్రి నారాలోకేశ్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ సహకారం అందించడం సంతోషకరమన్నారు. రెండు పుణ్యక్షేత్ర పట్టణాల మధ్య ఉన్న పవిత్రస్వర్ణముఖినది పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత వైసిపి నేతలు స్వర్ణముఖి బఫర్ జోన్ కూడా పట్టించుకోకుండా కబ్జాచేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా నదిని అభివృద్ధిచేయడానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ ప్రణాళికలతో డ్రోన్ల ద్వారా నదిపై సమగ్ర సర్వేచేసి నదికి ఇరువైపులా అక్రమకట్టడాలు, కబ్జాలను తొలగిస్తామని, ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని దివాకర్రెడ్డి స్పష్టం చేశారు. నది బఫర్ జోన్లో స్థలాలు విక్రయించనవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

Operation – హైడ్రా తరహాలో ఆపరేషన్ స్వర్ణ

తుడలో అవినీతి బహిర్గతం: స్వర్ణముఖి రక్షణకు భారీ చర్యలు

గత వైసిపి నేతల పాపంతోనే స్వర్ణముఖికి కష్టాలు వచ్చాయన్నారు. తుడ, నగరపాలిక, ఇరిగేషన్శాఖల అధికారులతో కమిటీ వేసి ఆక్రమణలను తొలగిస్తామని తుడ ఛైర్మన్ ప్రకటన చేశారు. తుడ నిధులతో 40కోట్ల రూపాయలతో తుమ్మలగుంటలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టారని, ఆ నిధులు పూర్తిగా వ్యర్థం అయ్యాయన్నారు. గత ఐదేళ్ళలోతుడలో జరిగిన నిధుల అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తయిందని, ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మద్యం స్కామ్లో తుడ వాహనాలు వినియోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

తుడలో కుంభకోణాల బహిర్గతం, తిరుపతి అభివృద్ధికి నూతన ప్రణాళికలు

తుడలో జిరాక్స్ కాఫీల వద్దనుండి విమాన టిక్కెట్లు, వాహనాలు వినియోగం అంతా కుంభకోణమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం తుడను నాశనం చేసిందని, ఒక్కపైసా కూడా నిధులు లేదన్నారు. ప్రభుత్వం (Government) నుండి నిధులు ఆశించకుండా తుడ స్వయంప్రతిపత్తిగా నిధుల సమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నామని, తిరుపతి నగరంలో స్టార్ హోటళ్ళ నిర్మాణాలకు అనుమతులిచ్చామని దివాకర్రెడ్డి చెప్పారు. తిరు పతిలో పెట్టుబడులు పెట్టమని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. సూరప్పకశంలో తుడ ప్లాట్ల ధరలు తగ్గించి అమ్మకానికి వేలం నిర్వ హిస్తున్నామని చైర్మన్ చెప్పారు. తుడను రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధిచేసేందుకు కృషి చేస్తున్నట్లు దివాకర్రెడ్డి తెలిపారు.

ఆపరేషన్ స్వర్ణ అంటే ఏమిటి?
ఆపరేషన్ స్వర్ణ అనేది తిరుపతి జిల్లాలోని పవిత్ర స్వర్ణముఖి నది ప్రక్షాళన కోసం రూపొందించిన భారీ ప్రాజెక్టు. ఈ ప్రణాళిక ద్వారా నది వెంబడి ఉన్న అక్రమ కట్టడాలు, ఆక్రమణలను తొలగించి నదిని పూర్వ వైభవానికి తీసుకురావడం లక్ష్యం. 

స్వర్ణముఖి నది రక్షణ కోసం ఏ చర్యలు తీసుకుంటున్నారు?
తుడ చైర్మన్ సి.దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి ఆక్రమణలను తొలగించడం, బఫర్ జోన్‌ను కాపాడడం, క్రిమినల్ కేసులు నమోదు చేయడం వంటి కఠిన చర్యలు చేపడుతున్నారు. 

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/pawan-ozzies-new-poster-hits-on-the-occasion-of-his-birthday/cinema/actor/539849/

Breaking News in Telugu Hyderabad News India News Operation Hydra Operation Swarna police operation Telangana updates Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.