📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

Online scams: ఆన్లైన్ మోసాలతో జర జాగ్రత్త!

Author Icon By Sudha
Updated: January 22, 2026 • 4:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సోషల్ మీడియాను వేదికగా చేసుకోని వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైం జాబ్, ఫిషింగ్, ఫేక్ కస్టమర్ కేర్, ఆన్లైన్,(Online scams) బెట్టింగ్ గేమ్స్, లోన్ యాప్ లు, జబ్, వీసా, గిఫ్ట్, లాటరీలంటూ మోసాలు, ఓఎల్ఎక్స్, క్విక్కర్, ఇతర మార్కెటింగ్ కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్, మ్యాట్రిమోనల్ లాంటి రకరకాల పేర్లతో సైబర్ నేరాలు చోటుచేసు కుంటూ డేటా చౌర్యానికి పాల్పడుతు న్నాయి. ఆశకుపోయి కొంచెం ఆదామరిస్తేచాలు ఉన్నది పోగొట్టుకుని, అప్పులపాలై చిక్కుల్లో పడాల్సిందే. మొన్నీమధ్య వాట్సాప్లలో ఒక మెసేజ్ చక్కర్లు కొట్టడం అందరికీ తెలిసిందే. కంగ్రాట్యూలే ఎన్స్ మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు. క్లయిమ్ చేసుకోండని మెసేజ్ దర్శనమివ్వడం, దానిని తాకగానే మరో పది గ్రూపు లకు పంపాలని, అలా చేసినవారి ఫోన్లలో వాట్సాప్ హ్యాక్ అయ్యి ఆ నంబర్ నుండి కాంటాక్ట్ నంబర్లకు మెసేజస్ వెళ్ళడం జరిగింది. వర్క్ ఫ్రమ్హమ్ జాబులంటూ నెల జీతాన్ని అడ్వాన్స్ గా ఇచ్చి, రిజిస్ట్రేషన్ ఖర్చులను ముందు గానే జమచేయాలంటూ కండిషన్ పెడుతూ, తీరా చేశాక తీసుకోని ఉడాయించడం జరుగుతుంది. డబ్బులు ఇన్వెస్ట్మెం ట్ చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదిం చవచ్చని మోసపూరిత మాటలు చెబుతూ, మొదట్లో నమ్మ కం కలిగాక పెద్దమొత్తం వసూలుచేసి వారిని ఇబ్బందులకు గురిచేయడం, కేవలం బెట్టింగ్ కోసమే వివిధరకాల ఆటలు ఆడిస్తూ, క్షణక్షణానికి బెట్టింగ్స్ పెట్టి డబ్బులు కాజేయడం, పిల్లలను రకరకాల ఆటలకు అలవాటుపడేలా చేసి తర్వాత వారినుండి అధికమొత్తంలో డబ్బులు కాజేయడం తరుచుగా జరుగుతూనే ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు అభివృద్ధి చెందడంతో చౌకగా ఇంటర్నెట్ అందరికి అందు బాటులోకి వచ్చి ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తూనే, ఏం జరు గుతుందో, ఎలా జరుగుతుందో, చివరికి ఏమోతుందోనన్న అనుమానం కలిగిస్తూ సగటు మానవున్ని కలవర పెడుతుం దనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

Read Also: http://Shiva Sena: ముంబై లోనే ఒప్పందాలు.. దావోస్ వరకు అవసరం లేదు

Online scams

డిజిటల్ నిరక్ష్యరాస్యులెందరో

ప్రస్తుతం మనుషులు పేపర్కరెన్సీ లేకుండా లావాదేవీలు జరుపుతున్నారు. అన్ని రకాల బ్యాంకులు వారి బ్యాంకులకు సంబంధించి ప్రత్యేక యాప్లను డెవెలప్డ్చేసి తమ కస్టమర్లకు అందుబాటులో తెచ్చి, ఫోన్ పే, గూగుల్ పే, పేటియం, ఆన్లైన్ పేమెంట్లకు యాక్సెస్ ఇవ్వడంతో, సాంకేతిక పరిజ్ఞానమునుపయోగించు కొని కొందరు సులభంగా
డిజిటల్ నేరాలకు పాల్పడటం జరుగుతుంది. ఎవరైనా తమ ఫోన్లోకి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోని ఉపయోగించాలంటే తన వ్యక్తిగత వివరాలను ఇవ్వాల్సివుంటుంది. అంటే తనకు తెలియకుండానే తన సమాచారం ఇతరులకు చేరుతుంది. ఇలా షరతులు, దేశంలో ఇలాంటి విషయాలు తెలియకుండా ఇంటర్నెట్ వినియోగిస్తూ లావాదేవీలు జరుపుతూ మోసపోతున్నవారు అధిక సంఖ్యలోనే ఉన్నారు. సర్వేఆధారంగా వన్టైం పాస్వర్డ్ను తమకు తెలియకుండా ఇతరులతో పంచుకున్న వారు 26శాతం వున్నారంటేనే అవగతమవుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోని నేరాలకు దిగుతున్న సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాలను ఎంచుకోని వ్యక్తుల బ్యాంకు ఖాతా నంబర్, పాస్వర్డ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఓటిపిని పొంది డబ్బులను కాజేస్తున్నారు. మరీ ముఖ్యమైన ఆసక్తికర విష యమేమిటంటే తాము మోసపోయిన విషయాన్నీ అంగీ కరిస్తున్నవారుఅధికసంఖ్యలో వున్నారంటే దేశంలో సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్న డిజిటల్ నిరక్ష్యరాస్యులెందరో తెలియకనే తెలుస్తుంది. ఇక్కడగమనించాల్సిన విషయమే మిటంటే డిజిటల్ నిరక్ష్యరాస్యుడు అంటే చదువురానివాడు కాదు. చదువొచ్చినా సాంకేతిక పరిజ్ఞానంలోని లొసుగులు తెలియవనివారని అర్ధం. ఎంతో చదువు చదివి వివిధరకాల ఉద్యోగాలు చేస్తున్నవారు సైతం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినవారున్నారంటే ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఉద్యోగి నెలజీతం బ్యాంకుల ద్వారానే తీసుకునే పరిస్థితి, వ్యవసాయ దారులు క్రాప్లోన్స్, ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే డబ్బును బ్యాంకుల ద్వారా నే తీసుకోవాలి. అలాగే మహిళామండలి సభ్యులు ప్రతినెల వారు కొంతసొమ్మును బ్యాంకులలో జమచేసుకోవడం, నెల సరి వాయిదాపద్ధతిలో కట్టి తేర్పడానికి అప్పులుగా తీసుకో వడం అందరికి తెలిసినదే. అంటే ఇప్పుడు దేశంలో బ్యాం కులలో అకౌంట్ లేకుండా ఉన్నవారెవరైనా ఉన్నారంటే ఏదో చిన్నపిల్లలు మాత్రమే వుంటారు.

Online scams

క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్

ఏ బ్యాంకులోనైనా ఖాతా తెరవాలంటే తమ ఆధార్ కార్డు, పాన్ కార్డు సమ ర్పించాల్సిందే. ఎటిఎం కార్డు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు పొందాలంటే ఆధార్ తప్పనిసరి అయిపొయింది. సాంకేతిక విద్యనభ్యసించిన కొందరు తమ జ్ఞానాని ఉపయోగించి సుల భంగా డబ్బులు సంపాదించాలని వివిధరకాల సైట్లనుప యోగించి అవతలివ్యక్తుల సమాచారాలను తెలుసుకొని మోసాలకుపాల్పడుతున్నారు. దేశంలో రోజురోజుకు అభివృద్ధిలో భాగంగా పరిణితి చెందుతూ నూతన సాంకేతిక తను పరిచయం చేస్తున్నా, అంతేవేగంతో నేరగాళ్లు సైతం వారి ఆలోచనలతో కొత్త కొత్త ఆవిషరణలు గావించి సైబర్ నేర గాళ్లకు ఒడిగడుతున్నారని చెప్పవచ్చు. అందుకే దేశంలోఇన్ఫ ర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవడం, ఆన్లైన్ మోసాలు,(Online scams) హ్యాకింగ్, డేటా దొంగతనం వంటి ఫిర్యాదులను స్వీకరించి, సైబర్దాడుల నుండి ప్రజలను, సంస్థలను రక్షిం చడానికి అవగాహన కల్పిస్తూ, భద్రతా చర్యలను సూచించడం జరుగుతుంది. అలాగే ఐపి అడ్రస్లు, ఇతరసాంకేతిక ఆధా రాల సహాయంతో సైబర్ నేరస్తులను ట్రాక్చేసి పట్టుకోవ డం, నేరాలకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను సేకరించి, విశ్లేషించి శిక్షపడేలా చేస్తుంది. కావున ఎవరైనా ఏదైనాసైబర్ నేరానికి గురైతే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు లేదా 1930 హెల్ప్ లైన్ నంబర్కు కాల్చేసి ఫిర్యాదుచేయవచ్చు. ప్రభుత్వంసైతం నేరాలపై వివిధ సర్వేల ఫలితాలను పరిశీలించి, సైబర్ నేర గాళ్ల ముప్పునుండి తప్పించుటకు, సాంకేతిక నిపుణలతో చర్చించి, ఇలాంటి నేరాలకు ఎవరు పాల్పడినా వెంటనేగుర్తిం చి, వారికి కఠినమైన శిక్షలు వేసేవిధంగా కృషి చేయాలి.
-డాక్టర్ పోలం సైదులు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

BreakingNews Cyber Crime Digital Fraud Internet Awareness latest news Online safety Online Scams Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.