ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తైన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) క్యాబినెట్ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది కాలంలో ప్రభుత్వం ప్రజలకు అందించిన సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, మంత్రుల పని తీరుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఏడాది పాలన (1 Year Rule ) బాగుందని అభిప్రాయపడ్డ చంద్రబాబు, ఇకపై మరింత వేగంగా పనిచేయాలని మంత్రులను ఉత్సాహపరిచారు.
ఇది ప్రజాస్వామ్యానికి హానికరం
ఇకపోతే రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని, నేరస్థులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం దురదృష్టకరమని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు రాజకీయ నాయకులు నేరస్థులను కలవాలంటే భయపడేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్యానికి హానికరమని స్పష్టం చేశారు. మంత్రులంతా చట్టబద్ధంగా, నిబద్ధతతో పనిచేయాలని, ప్రజల విశ్వాసాన్ని గెలవాలన్నారు.
గ్రామాలు, పట్టణాల్లో ప్రజలతో మమేకం
చివరగా, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వాటిని వేగంగా పరిష్కరించడం మంత్రుల ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలతో మమేకం కావడం ద్వారా వారి అభిప్రాయాలను తెలుసుకుని పాలనను మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వ విధానాలు ప్రజలకు చేరాలంటే మంత్రులు సజీవంగా పనిచేయాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సేవకుడిగా వ్యవహరించాలనే చంద్రబాబు ధోరణిని మంత్రులు గుర్తుంచుకోవాలని స్పష్టంగా తెలిపారు.
Read Also : Mirjalaguda: అర్ధరాత్రి బుల్డోజర్ లతో 16 షాపుల కూల్చివేత