సాక్షి ఛానల్ డిబేట్‌లో జర్నలిస్ట్ కృష్ణంరాజు (Journalist Krishnam Raju) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అమరావతి మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన అసభ్య వ్యాఖ్యలు తీవ్ర నిరసనలకి దారితీశాయి. అమరావతిని “వేశ్యల నగరం”గా అభివర్ణించిన ఆయన మాటలు తక్షణమే విపక్షాల దృష్టిని ఆకర్షించాయి.కృష్ణంరాజు వ్యాఖ్యలపై ప్రజలు, నాయకులు ఆగ్రహంతో విరుచుకుపడుతున్నారు. సాక్షి ఛానెల్ పై కూడా విమర్శలు పెరిగాయి. మహిళల గౌరవాన్ని తక్కువ చేయడం సరైన పని కాదంటూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు.ఈ వ్యవహారాన్ని జాతీయ మహిళా కమిషన్ స్వయంగా (సుమోటోగా) విచారిస్తోంది. కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. కృష్ణంరాజు వ్యాఖ్యలపై తీసుకున్న చర్యలపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరారు.
లోకేష్ స్పందన – కమిషన్‌ను అభినందించిన ట్వీట్
ఈ చర్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్పందించారు. మహిళల పరువు దెబ్బతీయడం నేరం అని స్పష్టం చేశారు. మహిళా రైతులను వేశ్యలుగా పరిగణించడం లాంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సినవని తెలిపారు. జాతీయ మహిళా కమిషన్ వేగంగా స్పందించడాన్ని ఆయన అభినందించారు.లోకేష్ ట్వీట్‌లో స్పష్టం చేశారు – మేమంతా అమరావతి మహిళా రైతుల వెనుక ఉన్నాం. వారికి న్యాయం జరగాలి. ఈ ప్రకటనతో పట్ల మహిళల అభిమానం మరియు మద్దతు వ్యక్తమైంది.
మహిళా రైతుల పోరాటం పట్ల అవమానకర వ్యాఖ్య
అమరావతి ఉద్యమంలో మహిళా రైతులు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అలాంటి వారిని అభాసుపాలుచేసే వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు మాత్రమే కాక నేరం కూడా. మీడియా వేదికగా వచ్చిన కథనాల ఆధారంగా మహిళా కమిషన్ విచారణ ప్రారంభించింది.
Read Also : Jai Shankar : పాక్‌కు జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్