📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

old age: ముదిమిలోనూ ఊరట!

Author Icon By Sudha
Updated: December 25, 2025 • 5:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వృద్ధాప్య వేగాన్ని వ్యాయామం ద్వారా తగ్గించు కోవచ్చునంటే ఓస్ ఇంతేనా!? అని అనిపిస్తుం ది. అలా అనడమే తప్ప రోజూ ఓ అరగంట వ్యాయామం చేద్దామంటే అసలు తీరికే చిక్కదు. ప్రతి ఒక్కరు తమ జీవనశైలిని ఎప్పటికప్పుడు ఒత్తిడి, నిద్ర లేమి, ఊబకాయాల దుష్ప్రభావాల నుంచి బయటపడే స్థాయిలోకి మార్చుకోవాలంటే కాస్త కష్టమే మరి! అలా మార్చుకోకపోతే ఆరోగ్య రీత్యా ఎన్నో ఇబ్బందులు ఎదు ర్కోవాల్సి వస్తుందని ‘న్యూ సైంటిస్ట్’ అనే శాస్త్ర విజ్ఞాన ఆంగ్ల పత్రిక ఒక అధ్యయన వ్యాసంలో ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధాప్య (old age)ఛాయలు తమ సహజ పెరుగుదలతో నిమిత్తం లేకుండా ముందస్తుగానే హెచ్చరించే పరిస్థితి కనపడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, వేడిమి, ఊబకాయం, హృద్రోగాలు, కేన్సర్ మను షుల సహజవయసుపై ప్రభావం చూపుతున్నాయన్న విషయం విదితమే. వాటి తీవ్రత తెలుసుకోకపోతే ముందస్తు మరణాలు సంభవించే అవకాశం లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా గతంలో కంటే వేగంగా వృద్ధాప్యం (old age)తరుముకొస్తున్నట్లు వస్తున్న తాజా అధ్యయనాలు కొంత భయపెట్టేవే. అయితే ఇలాంటి ప్రమాదాన్ని తగ్గించుకోగల అవకాశాలపై శాస్త్రవేత్తల పరిశోధనలు సత్ఫలితాలనిస్తు న్నాయి.|ఒకనాడు వృద్ధాప్యలో వచ్చే వ్యాధులు ఇప్పుడు అంతకన్నా చిన్న వయసులోనే సంక్ర మిస్తున్నాయని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో తాజాగా జరిగిన అధ్యయ నంలో తేలింది. 1965కి ముందుజన్మించిన వ్యక్తులలో, ఇటీవలి దశాబ్దాలలో పుట్టిన వారిలో కంటే నిదానంగా వృద్ధాప్యపు ఛాయలు కనిపి స్తున్నాయి. 1965 తర్వాత జన్మించిన వారు ఎక్కువ ప్రభావానికి లోనవుతున్నారని, వీరికే వార్ధక్య లక్షణాలు కనపడుతున్నాయని గుర్తించింది. వృద్ధాప్యం, వృద్ధాప్య బాధలు, వ్యాధుల లక్షణాలు, సంక్ర మిస్తున్న వ్యాధులపై జరిగిన అధ్యయనంలో ఎన్నో విష యాలను శాస్త్రజ్ఞులు గుర్తించారు. 2016లో ఊబకాయంపై అధ్యయనం చేస్తున్న స్పెయిన్ వైద్య పరిశోధకులబృందం గుర్తించింది. ఊబకాయ జీవ సంబంధమైన ప్రభావాలు వృద్ధాప్యాన్ని ముందే తెస్తున్నాయని చెప్పారు. ఊబకాయం వల్ల కొవ్వు కణాలు పెరిగే పరిస్థితులు, ఆ తర్వాత అవి కరిగే అంశాల్ని పరిశీలించి చూస్తే వ్యాయామం వల్లకలిగే ప్రయోజనాలు తెలుస్తాయి. సామర్థ్యం క్షీణించటం, జీవ క్రియల్లో చురుకుదనం తగ్గటం, వాతం మూలంగా కండ రాలు, ఎముకలు, గుండె నాళాల వ్యవస్థ సహా శరీరం లోని అనేక అవయవాల పనితీరు సన్నగిల్లటం ఇందుకు కారణమని పరిశోధకుల శాస్త్రీయ అంచనా. నిరుడు వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధన శాలలలో శీఘ్ర వృద్ధాప్యాలను గమనించేందుకు 1లక్ష 50వేల మంది రక్త నమూనాలను ప్రదర్శించారు. ఆ నమూనాలన్నీ 37 నుంచి 54 ఏళ్ల వయసు వారివే. ఆ పరిశోధనలో 1965 తర్వాత జన్మించిన వారిలో 17శాతం వృద్ధాప్య ఛాయలు ఎక్కు వ వేగవంతంగా ఉన్నట్లు తేలింది. వారిలో ముందుగానే ఊపిరితిత్తులు, జీర్ణావయవ, గర్భాశయ, పేగు క్యాన్సర్లు వచ్చే సంకేతాలు కనిపించాయి. నడి వయస్కు లు కేవలం ఊబకాయం వల్లనే వృద్ధాప్యానికి చేరువవుతు న్నారని నిర్ణయించారు. వరల్డ్ఒ బేసిటీ ఫెడరేషన్ డేటా ప్రకారం 519ఏళ్ల వారిలో ఊబకాయం రేట్లు 1975 – 2022మధ్య సుమారు 1000 శాతం వరకు పెరిగాయి. జీవనశైలిలో మార్పులు చేసుకోవటం ద్వారా ఊబకాయా న్ని, వృద్ధాప్య వేగాన్ని తగ్గించుకోవచ్చని శాస్త్రజ్ఞులు సూచి స్తున్నారు. వయోవేగాన్ని గుర్తించి వారు అంత వేగంగా ఎందుకు వృద్ధాప్యంలోకి జారుకుంటున్నారో తెలుసుకు నేందుకు ‘ఏపి జెనెటిక్ పరీక్ష చేస్తారు. తద్వారా ఆ వ్యక్తి డీఎన్ఏలో మార్పులను గమనించి వారి వృద్ధాప్యవేగాన్ని అంచనా వేస్తారు. దానిని బట్టి కూడా పలు జాగ్రత్తలు తీసుకునే వీలుంది. ఇది రోజువారీ ప్రక్రియ కాదు. కనుక తరచు పరీక్షలు చేసుకోవడం సాధ్యంకాదు. ఊబకాయు లందరూ సాధారణంగా తీసుకునే జాగ్రత్తలే తీసుకుంటే అనారోగ్యం పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. జీవనశైలి తేడా లతో కొంతమంది వారి వాస్తవ వయసు కంటే 10 ఏళ్లు ఎక్కువగాలేదా 10ఏళ్లు తక్కువగా కనిపి స్తున్నారు. ఆరోగ్య కరమైన ఆహారం, లేదా బరువు తగ్గించే మందుల ద్వారా ఊబకాయాన్ని నివారించటం ద్వారా వయసు మీద పడే వేగాన్ని తగ్గించవచ్చు. ముందస్తు వార్ధక్యానికి కేవలం ఊబకాయం, ఒత్తిడి, కాలుష్యం కాదు. వాతావరణ మార్పులూ దోహదపడుతున్నాయి. శరీరంలోని అవయ వాలు సతాయించకుండా ఉంటే శతాధిక వత్సరాలు బతి కేయడం అలాంటి పరిస్థితి చక్కని వ్యాయామం ద్వారానే సాధ్యమని చెప్పిన మాటలను నమ్మడం తప్పని సరి. ప్రపంచంలోనే అమెరికాలో ఉన్న కెన్ని నికోలే 115 ఏళ్లు బతికింది. జపాన్కు చెందిన మి స్వాజుకి 117 ఏళ్లు. ఇప్పటికీ బతికేఉంది. ఇవి నిదర్శ నాలు కాదనగలమా! ఈ ఏడాది ఆరంభంలో సదరన్ కాలిఫోర్నియా విశ్వ విద్యాలయంలో 50 ఏళ్ళు పైబడిన 3,686 మంది వివరాలను పరిశోధించారు. వాతావర ణంలోని అధిక స్థాయిలకు గురైన వ్యక్తులు మరింత వేగంగా వృద్ధాప్యానికి చేరువవుతున్నారని, ఉష్ణోగ్రతలో ప్రతి 10శాతం పెరుగుదల వారి వయసును 1.4 నెలలు పెంచుతోందని కనుగొన్నారు. గత ఆగస్టులో హాంకాంగ్ విశ్వవిద్యాలయం లో జరిగిన మరో అధ్యయనంలో 25 వేల మంది వయోజనుల డేటా పరిశీలన చేసి వారి శారీరక, మాన సిక ఆరోగ్య పరిస్థితులను బట్టి స్థిరమైన వ్యాయామమే మేలని నిర్ణయించారు. వృద్ధాప్య వేగాన్ని వ్యాయామం ద్వారా తగ్గించుకోగలగడం శుభకరం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

BreakingNews comfort in old age Elderly Care healthy ageing latest news Old Age senior citizens Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.