📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : Officials – తురకపాలెంకు కదిలిన అధికార యంత్రాంగం

Author Icon By Shravan
Updated: September 5, 2025 • 12:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుంటూరు Officials : గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మరణాలకు దారితీసిన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి కారణాల నమోదుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర పాండియన్ తెలిపారు. గురువారం గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో గత రెండు నెలలలో 20 మరణాలకు దారితీసిన కారణాలను పరిశీలించడానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర పాండియన్ జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మితో కలసి గ్రామంలో పర్యటించారు. తొలుత గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను పరిశీలించి అక్కడ బాధితులకు అందిస్తున్న వైద్య సేవలను, పరీక్షల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. (Public Health) అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర పాండియన్ మీడి యా వారితో మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని శాఖల నుండి మెకాని జంను ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి రోజు సమీక్షించడం జరుగుతుందన్నారు. ఇది ఒకే గ్రామంలో జరగడం వలన దినపత్రికలల్లో, టీవీ న్యూస్ ఛానెల్స్ లో ప్రసారం అవుతున్నందున ఇందుకు గల కారణాలను తెలుసుకోవడానికి నిపుణుల బృందాన్ని రెండు రోజుల క్రితం ఏర్పాటు చేయడం జరిగిం దని, బృందం ప్రాథమిక నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. నివేదిక ప్రకారం నిర్ణయానికి రావడం సాధ్యపడదని, మెలైడియోసిస్ అని, ఆల్కహాల్ అని చెపుతున్నారని, రక్త నమూనాల పరీక్షల నివేదిక అనంతరం కారణాలను విశ్లేషించడం జరుగుతుందన్నారు. త్రాగుడు అలవాటు ఉన్నవారు 9 మంది చనిపోయారని చెపుతున్నారని, కేవలం త్రాగుడు వలనే చనిపోయారని చెప్పడం సరికాదన్నారు. గ్రామం గురించి సామాజిక మాధ్యమాల్లో ఆసత్య ప్రసారం చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు పరిస్తితి అదుపులోనే వుందని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతున్నదన్నారు. 12 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరి నుండి బ్లడ్, యూరిన్ శాంపిల్స్ తీసుకుని 45 పారామీ టర్స్ క్రింద టెస్ట్ చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు.

శాంపిల్స్, టెస్టులు & మానిటరింగ్

ఎవరికైనా జ్వరం వుంటే బ్లడ్ కల్చర్ చేస్తున్నామని, ఇప్పటి వరకు 32 మందికి బ్లడ్ కల్చర్ కి శాంపిల్స్ సేకరించడం జరిగిందన్నారు. జ్వరం వున్నవారు మెడికల్ క్యాంపుకు వచ్చి రక్తనమూనాలు అందించాలని, రాలేని వారు తెలియజేస్తే వైద్య బృందం ఇంటికి వెళ్ళి రక్త సేకరణ చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు కోసం 14 మందితో ల్యాబ్ టెక్నీషియన్స్ తో బృందాన్ని నియమించడం జరిగిందన్నారు. కల్చర్ టెస్ట్పర్ట్కు 72 గంటలు పడుతుందన్నారు. రిపోర్ట్స్ వచ్చిన తరువాత ఎటువంటి యాక్షన్ ప్లాన్ రూపొం దించాలో నిర్ణయం తీసుకొని అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పని లేద ని జిల్లా కలెక్టర్ చెప్పినట్లు ప్రతి నెల సాధారణ డెత్రెట్ వుండన్నారు. జూలై, ఆగష్టు మాసాలలో ఎక్కువ మంది చనిపోయి నందున అందుకు గలకారణాలను విశ్లేషించడం జరుగు తున్నదన్నారు. రెండు మూడు రోజులలో కారణాలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. చనిపోయిన బాధిత కుటుంబ సభ్యులు ఆడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర పాండియన్ బదులిస్తూ ప్రభుత్వం నుండి చనిపోయిన వారి మెడికల్ బిల్ల్స్ తీసుకుని సీయంఆర్ఎఫ్ ద్వారా చెల్లించడం జరుగుతుందన్నారు.

Officials – తురకపాలెంకు కదిలిన అధికార యంత్రాంగం

జిల్లా స్థాయి సర్వే, బహుళ శాఖల విశ్లేషణ & మార్గనిర్దేశం

జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి మాట్లాడుతూ తురకపాలెం గ్రామంలో గత రెండు నెలలుగా మరణాలు ఎక్కువగా వున్నాయని ప్రభుత్వం మెడికల్ టీం ను పంపి గ్రామంలో ఎంత మంది చనిపోయారు, ఏ వ్యాధి కారణంతో చనిపోయారు, ఏఏ ఆసుపత్రులలో చికిత్స తీసుకున్నారు తదితర అంశాలపై నివేదిక తీసుకోవడం జరిగిందన్నారు. (Investigation) జనాభా ప్రాతిపదికన సంభవించే సహజ మరణాల కన్నా జూలై, ఆగష్టు మాసాలలో ఎక్కువ మరణాలు సంభవించినందున ఇందుకు గల కారణాల అన్వేషణ కోసం జీజీహెచ్ గుంటూరు మెడికల్ కళాశాల నుండి డాక్టర్స్ ను నియమించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 14 టీములను జనరల్ మెడిసిన్ బయోకెమిస్ట్రీ పాథాలజీ మైక్రో బయోలాజీ, తదితర ఆరు విభాగాల నుండి బృందాలను నియమించడం జరిగిందన్నారు. వీరితో పాటు రెగ్యులర్ మెడికల్ స్టాఫ్ ఆశా వర్కార్లను కూడా నియమించడం జరిగిందన్నారు. ఈ టీములన్ని ఈ నెల రెండవ తేదీ నుండి గ్రామంలో ఇంటింటికి మరియు మెడికల్ క్యాంప్ వద్ద సర్వే చేపట్టడం జరుగుతున్నదన్నారు. గ్రామంలో 870 గృహాలు వున్నాయని, ఇప్పటి వరకు 400 గృహాలను సర్వే చేయడం జరిగిందని మిగిలిన గృహాలను రెండు రోజులలో సర్వే పూర్తి చేయడం జరుగుతుందన్నారు. మరణాలు ఇక్కడే ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయో మల్టీ డిపార్ట్మెంట్ ఎనాలసిస్ చేపట్టడం జరుగుతున్నదన్నారు. వాటర్ శాంపిల్స్ టెస్టింగ్ ఇవ్వడం జరిగిందని కెమికల్ ఎనాలసిస్ రిపోర్ట్ సాధారణంగానే వుందన్నారు. బ్యాక్టీరియ లాజికల్ రిపోర్ట్ అందవలసి వుందన్నారు. సాయిల్ టెస్ట్ కూడా చేపట్టడం జరిగిందన్నారు. మరణాలకు గల కారణాలు తెలియాలంటే మూడు రోజులు సమయం పడుతుందన్నారు. మూఢనమ్మకాలపై ప్రజల్లో వున్న భయాలను పోగొట్టేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. క్వారీ నుండి ఏర్పడే పొల్యూషన్ ను అధ్యయనం చేయడానికి టీమును ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. చనిపోయిన వారికి సంబంధించి మెడికల్ బిల్స్ చెల్లింపుకు సీయంఆర్ఎఫ్ కు పంపడం జరుగుతుందన్నారు. సోషల్ మీడియా, పత్రికలలో ప్రజలను భయాందోళనకు గురి చేసే విధంగా నిరాధార వార్తలు వ్యాప్తి చేయకుండా వుండాలని కోరుతున్నానన్నారు. ఈ పర్యటన కార్యక్రమంలో ఆర్ డి. ఓ కె.శ్రీనివాస రావు, జెడ్ పీ సీఈఓ జ్యోతిబసు, డియం అండ్ హెచ్ ఓ డా. విజయలక్ష్మి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా. శ్రావణ్ బాబు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
తురకపాలెంలోని మరణాల కారణాలపై సమగ్ర అధ్యయనం చేయాలి-మంత్రి శ్రీ సత్యకుమార్
తురకపాలెంలోని మరణాలకు దారితీసిన కారణాలను సమగ్రంగా పరిశీలించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.

తురకపాలెంలో ఏ పరీక్షలు చేస్తున్నరు?
12 ఏళ్లకు పైబడిన వారందరి నుండి బ్లడ్, యూరిన్ శాంపిల్స్ తీసుకుని 45 పారామీటర్లపై పరీక్షలు చేస్తున్నారు. జ్వరం ఉన్నవారికి బ్లడ్ కల్చర్ కూడా చేస్తున్నారు.

నివేదికలు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది?
కల్చర్ టెస్ట్ రిపోర్టులు వచ్చిన తర్వాత కారణాలను విశ్లేషించి, తగిన యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలు చేస్తారు. అలాగే బాధితుల మెడికల్ బిల్లులను సీయంఆర్ఎఫ్ ద్వారా చెల్లించేందుకు చర్యలు చేపడతారు.

Read hindi news : hindi.vaartha.com

Read also :

https://vaartha.com/elections-local-elections-3-months-in-advance/news/politics/541480/

Andhra Pradesh Administration AP Flood Relief Breaking News in Telugu Disaster Management AP Government Officials Visit Latest News in Telugu Relief Operations Telugu News Today Turakapalem Officials

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.