Offensive language : అభ్యంతరకర భాషతో రాజకీయ విలువలు పతనం!

Read Time:  1 min
Offensive language
Offensive language
FONT SIZE
GET APP

డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో గతంలో ఎప్పుడు లేని విధంగా రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు రాజకీయ ఆరోపణలూ, ప్రత్యారోపణలు చేసుకుంటున్న సందర్భాల్లో విధానాలపై విమ ర్శలకు తిలోదకాలొదిలి వ్యక్తిత్వ హననమే ప్రధానంగా ప్రదర్శి స్తున్న హావభావాలు, ఉచ్చరిస్తున్న భాషను వివిధ టెలివిజన్ ఛానెళ్ల లో చూడడానికి, వినడానికి, అదేవిధంగా పత్రికల్లో చదవడానికి ప్రజలు అయిష్టాన్ని ప్రదర్శించడమే కాదు, అసహ్యించు కుంటున్నారని చెప్పక తప్పదు. దశాబ్దాల తరబడి ప్రజా జీవితంలో ఉన్న నేతలు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తూ దశాబ్దాల పాటు అధికారాన్ని అను భవించిన నేతలు, అదే క్రమంలో నేడు కూడా అధి కారం లో కొనసాగుతున్న నేతలు, మరోవైపు ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో ఏవో కారణాల నేపథ్యంలో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోలేక అధికారానికి దూరమైన నేతలు పరస్పరం ఒకరినొకరు దూషించుకుంటూ దుర్భాష లాడు కుంటున్న వైనంతో ప్రజా జీవితంలో రాజకీయ నాయకులు వాడుతున్న భాష పట్ల మెజారిటీ ప్రజలు ఆందోళన చెందు తున్న మాట వాస్తవం. అధికారంలోవున్న వారైనా, అధికారానికి దూరమైన వారైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభీషతోనే రాజ్యాంగబద్ధంగా ఎన్నికై ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్న వారే కాబట్టి ఒకరు మరొకరిని ఉద్దేశించి మాట్లాడే సందర్భాల్లో ఉచ్ఛరిస్తున్నభాష (Offensive language) ఆ నేతలనేకాకుండా వారిని తమ ప్రతినిధులుగా ఎన్నుకున్న ప్రజలను సైతం గాయపరుస్తుందనే లాజిక్ని ఎలా మరిచిపోతున్నారో అర్థం కావడం లేదు. రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ సామ్రా జ్య వాదులను మన దేశం నుండి తరిమి కొట్టే క్రమంలో స్వాతంత్ర్య ఉద్యమ నాయకులు సైతం విదేశీ పాలకులను ఈ తరహా దుర్భాష లాడలేదు.

Read Also : http://MRK Panneerselvam: హిందీపై మంత్రి షాకింగ్ కామెంట్స్

Offensive language
Offensive language

అసహ్యించుకునే భాష

నిజానికి చరిత్రలో సభ్య సమాజం చదవడానికి, వినడానికి, చూడడానికి, అసహ్యించుకునే భాషతో (Offensive language) ప్రపంచంలో ఎవ్వరూ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోలేదు. అదే విధంగా ప్రజల హృదయాలను గెలు చుకునే పాలనా విధానాలతో తప్ప కేవలం విపక్ష పార్టీల నేతలను దుర్భాష లాడడం ద్వారా ఏ అధికార పార్టీ తన అధికార పీఠాన్ని సుస్థిరం చేసుకున్న దాఖలాలూ చరిత్రలో లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలోనూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలకు నీళ్లూ, నిధులూ, ఉద్యోగాలూ, ఉపాధి కల్పన పరంగా, రాజకీయ అధికార పరంగా అన్యాయం జరుగుతుందంటూ ఆనాటి పాలకులు అవలంబించిన పాలనా విధానాలను ఉచ్ఛస్వరంతో ప్రశ్నించారే తప్ప రాజకీయ నాయకుల వ్యక్తిత్వ హననం చేసే భాషను ఎవరూ ఉపయోగించలేదు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిన సందర్భం లో తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలీయం చేసే క్రమంలో ఉద్యమ నేతలు అప్పుడప్పుడూ, సందర్భోచితంగా తెలంగాణ మాండలికంలో కొన్ని పరుష పదాలను ఉపయోగిస్తూ ఉద్యమ ఉధృతిని పెంచిన మాట నిజమేయైనా ఆ మాటలు ఏనాడూ నైతిక విలువల సరిహద్దులు దాటలేదనే సత్యాన్ని జీర్ణించుకోక తప్పదు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయి రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా ఆవిర్భవించిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రంలో, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల నేతలు ఆయా రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కవసరమైన ప్రణాళికలను రచించి ముందుకు సాగడానికి కంకణ బద్ధులు కావాలని ఆయా రాష్ట్రాల ప్రజలు కోరుకున్నారు. అందుకోసం రాజ్యాంగ నిబంధనలననుసరించి చట్ట సభల లోపలా, బయట కూడా ప్రతిపక్ష పార్టీలు ప్రజల పక్షాన నిలిచి పాలక ప్రభుత్వ పాలనా విధానాలలో లోపా లను ఎత్తి చూపుతూ ప్రతిపక్షంగా తన నిబద్ధతను ఋజువు చేసుకోవాలనేది కూడా ప్రజల ఆకాంక్షయేనని చెప్పక తప్ప దు.

వ్యక్తిత్వ హననానికి

ఐతే రెండు రాష్ట్రాలలోనూ ఆయా రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికవసరమైన పాలనా విధానాలను అమలు పరుస్తూ ముందుకు సాగుతున్నామని పాలక పక్షాలు, అదేమీ లేదు విధ్వంసానికి ఊపిరులూదుతున్నారని విపక్షాలు తమ సొంత మీడియా ఏజెన్సీలతో పాటు, సోషల్ మీడియా వేదికల ద్వారా ఆరోపణలూ, ప్రత్యారోపణలు చేసుకుంటున్న క్రమం లో విధానాలపై విమర్శల పర్వంలో నైతిక విలువల లక్ష్మణ రేఖను దాటి పరస్పరం వ్యక్తిత్వ హననానికి పూనుకుంటున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. ఈ కారణంతోనే గతంలో పొరుగు రాష్ట్రంలో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి క్రియాశీల రాజకీయాలతో సంబంధమే లేని తన కుటుంబ సభ్యురాలి పై ఆనాడు అధికార పక్ష నాయకుడూ, ఆయన మంత్రివర్గ సహచరులూ చేసిన వ్యక్తిత్వహననం చేస్తూ చేసిన ఆరో పణలకు వ్యధతో కన్నీళ్లు పెట్టుకుని మొత్తం అసెంబ్లీ సమా వేశాలకు దూరంగా ఉన్న వైనం బహిరంగ రహస్యమే. చట్టసభలలోనే ఇలాంటి దురదృష్టకర పరిస్థితులు కొనసాగుతు న్న నేపథ్యంలో ఇక ప్రజా జీవనంలో ఒకరిపై మరొకరు చేసుకుంటున్న వ్యక్తిగత ఆరోపణలు, ప్రత్యారోపణల్లో రోత లు, బూతులతో కూడిన భాష ఏస్థాయిలో కంపరం పుట్టి స్తుందో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. ఈ నేపథ్యం లోనే నిన్నటికి నిన్న పొరుగు రాష్ట్రంలో ఓ మాజీ మంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రినీ, ఆయన రాజకీయ పార్టీని దుర్భాష లాడినాడనే కారణంతో ఆయనపై బి.యన్.యస్ ని సంబంధిత సెక్షన్ల ప్రకారం అభియోగాల్ని నమోదు చేసి అరెస్ట్ చేసిన వైనం తెలిసినదే. అంతటితో ఆగకుండా అధికారపార్టీకి సంబంధించిన శ్రేణులు దుర్భాషలాడిన నేతపై, ఆయన ఆస్తులపై భౌతిక దాడులకు ప్రయత్నించిన వైనాన్నినిరసిస్తూ ప్రతిపక్ష పార్టీల శ్రేణులు సైతం భౌతిక దాడులకు పాల్పడే ప్రయత్నం చేస్తే అది సామాజిక విచ్చిత్తికి దోహదం చేసే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకుల నిశ్చితాభిప్రాయం. ఈ తరహా దుర్భాషల పర్వం గతంలోనూ కొనసాగిందనీ, దానికి ప్రతిక్రియగా రెడ్ బుక్ ఓపెన్ చేసి తగు చర్యలను తీసుకుంటు న్నామంటున్న ప్రస్తుత పాలకులు మళ్లీ అధికారాన్ని కోల్పోతే రాబోయే కాలంలో మరో బుక్ ఓపెన్ కాక తప్పదేమో? ఈ బుక్కుల అమలుని పర్యవేక్షించే పోలీసుశాఖపై సైతం దు ర్భాషలు, బెదిరింపులు పెచ్చు మీరుతుండడం రాజ్యాంగ విరుద్ధమే. ఇలా బుక్కుల పరంపరను కొనసాగించకుండా అన్ని రాజకీయ పార్టీల నేతలు రాజ్యాంగ పుస్తకానికి అను గుణంగా వ్యవహరిస్తే ఏ బుక్కుల అవసరం రాదు గదా ననే బుద్ధిజీవులు అభిప్రాయాన్ని గౌరవించాల్సిందే.

Offensive language
Offensive language

చిటపటలు రాజుకోవడం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన 2014వ సంవత్సరం నుండి 2024 డిసెంబర్ వరకు రాష్ట్రంలో అధికారమార్పిడి జరిగేవరకు రాష్ట్రంలో విపక్ష మనేది నామమాత్రంగా మిగిలి పోయిన వైనం బహిరంగ రహస్యమే. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో అధికార, విపక్షాలకు చెందిన రాజకీయనాయకుల మధ్య పెద్దగా ఆరోపణలూ, ప్రత్యారోపణలు చోటు చేసుకో లేదనే సత్యం జీర్ణించుకోకతప్పదు. నిజానికి 2024 డిసెం బర్లో రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుండే రాజకీయ ఆరోపణలూ, ప్రత్యారోపణల చిటపటలు రాజుకోవడం ప్రారంభమైంది. తొమ్మిదేళ్ల పైచిలుకు పాలన లో తెలంగాణను తాము ఎంతో అభివృద్ధి చేసామని గత పాలకులు, లేదు లేదు గత
పాలకులే మిగులు రాష్ట్రంగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ప్రస్తుత పాలకులు చట్ట సభల లోపలా బయట ఎలుగెత్తుతున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య రాజకీయ ఆరోపణలూ, ప్రత్యారోపణలూ వెల్లువెత్తుతున్న క్రమంలో ఉపయోగిస్తున్న భాష అత్యంత అభ్యంతర కరంగా మారుతున్న వైనం దురదృష్టకరమే. గతంలో ఎప్పు డూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ పార్టీల నేతల మధ్య కనపడని విద్వేషాలు, ఫలితంగా వారి నోటివెంట వస్తున్న దుర్భాషలు రాజకీయ పార్టీల నేతలపై సామాన్య ప్రజలకు సైతం వెగటుని కలిగిస్తున్న మాటనిజం. ఎందుకంటే పన్నెండేళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసిందె వరో, చేస్తున్నదెవరో అంతిమ లబ్ధిదారులైన ప్రజలకు తెలియ కుండా ఎలా ఉంటుంది? ఒకవేళ అభివృద్ధి జరగకపోతే దానికి కారణమైన, కారణమోతున్న వారిపాలనా విధానాలను శాస్త్రీ యంగా ఎండగట్టకుండా ఎదుటి వారిపై బాడీషేమింగ్, వారిని దుర్భాష
లాడడంతో ప్రజల అభిమానాన్ని ఎలాచూర గొంటారో, దానిని ఎలా ఓటు బ్యాంకుగా మార్చుకొని రాజ్యా ధికారాన్ని, సుస్థిరం చేసుకుంటారో బోధపడడం లేదు.
-డాక్టర్ నీలం సంపత్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.