అనకాపల్లి, అల్లూరి జిల్లా (Anakapalle, Alluri District) ల సరిహద్దుల్లో ఉన్న అడవి ప్రాంతాల్లో తరాలు మారినా గిరిజనుల తలరాతలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇప్పటికీ ఆధునిక జీవన సరళి చేరనివారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం (Aboriginal Day) సందర్భంగా ఆ ప్రాంత గిరిజన మహిళలు తలపై అడ్డాకులు పెట్టుకొని డోలిమోస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు.వినండి మా వేదన.. ఓ పాలకులారా! అంటూ పిలుపునిచ్చారు.రోలుగుంట మండలం, ఆర్ల పంచాయతీ పరిధిలోని పితృగడ్డ, నేరెళ్ల బంధ, పెద్దగరువు, కొత్త లోసింగి గ్రామాలు ఇంకా అల్లూరి జిల్లాలోని జాజుల బంద ప్రాంతాల్లో 680 మందికి పైగా గిరిజనులు జీవిస్తున్నారని సమాచారం.ఇవీ అభివృద్ధికి పూర్తిగా దూరంగా ఉన్న ప్రాంతాలు.విద్య, వైద్యం లాంటి కనీస హక్కులు కూడా అందుబాటులో లేవు.పల్లె కింద నీరు లేక, రోడ్లు లేక నడకే జీవితం. గర్భిణీ అయినా, అనారోగ్యమైనా డోలి తప్ప దారి లేదు. రాళ్ల మధ్యన గర్భిణీల ప్రాణాలు గాలిలో వేలాడతున్నాయి.
డోలిమోస్తూ అయిదు కిలోమీటర్లు నడిచిన నిరసన
ఈ దుస్థితిని పాలకులకు చూపించేందుకు గిరిజనులు వినూత్న పంథాలో నిరసన చేపట్టారు. తలపై అడ్డాకులు పెట్టుకొని, డోలి కట్టి అయిదు కిలోమీటర్లు నడిచారు.కొండలు, గుట్టలు దాటి, రాళ్లు రప్పల మధ్య సాగిన ఈ యాత్ర వీరి బాధను గట్టిగా పలికింది. ఇది సాధారణ నిరసన కాదు, తరాలుగా కొనసాగుతున్న ఆవేదనకు నిదర్శనం.“ఈ దినోత్సవాలు మాకు మేధావుల సభలు కావు… సమస్యల పరిష్కారమే కావాలి” అని గిరిజనులు నినాదాలు చేశారు. తాము అడిగేది తాగునీరు, పాఠశాలలు, రోడ్లు మాత్రమేనన్నారు.అంగన్వాడీ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్, గ్రామీణ డాక్టర్ల లభ్యత కోసం వారు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. పిల్లలకు చదువు, సురక్షిత ప్రసవాలకు ఆసుపత్రి, రోడ్డు కావాలని కోరారు.వీరు నివసించే కొన్ని గ్రామాలు ఇప్పటికీ నాన్ షెడ్యూల్డ్ గా ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి రావడం లేదు.ఈ ప్రాంతాలను షెడ్యూల్ ఏరియాగా ప్రకటించి, ఇక్కడ నివసించే వారిని గిరిజనులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఇది జరిగితేనే వారికి రాజ్యాంగ హక్కులు లభిస్తాయని స్పష్టం చేశారు.
పాలకుల నిర్లక్ష్యంపై సంఘాలు గళం విప్పాయి
ఈ నిరసనలో గిరిజన సంఘాలు, ఐదవ షెడ్యూల్ సాధన సమితి నాయకులు పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షుడు గోవిందరావు, కార్యదర్శి కామేశ్వరరావుతో పాటు, పితృగడ్డ, పెద్దగరువు గ్రామాలకు చెందిన కొర్ర రాజు, వెంకటరావు, కొండబాబు, కిలో మహేష్ వంటి పలువురు గిరిజనులు ముందుండి పోరాటం చేశారు.వీరి కష్టం సినిమాల్లో కాదు, నిజ జీవితంలో నడుస్తోంది.ఆధునిక తెలంగాణలో, ఇంకా డోలిమోస్తూ ఆసుపత్రి వెళ్లాల్సిన దుస్థితి ఉండడం శర్మించాల్సిన విషయం.ఈ ఆదివాసీ దినోత్సవం పండుగలా కాకుండా, పలుకుబడి ఉన్నవారు వారికి వేదిక కావాలి.వారి గోడు వినండి. మార్పు తెచ్చేందుకు ఒక అడుగు వేయండి.
Read Also : Bhatti Vikramarka : అందరం కాంగ్రెస్ గ్రూపే : భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు