ప్రపంచవ్యాప్తంగా గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఊబకా యుల సంఖ్య రెట్టింపు అవుతుండటం అత్యంత ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే ఇలా మానవాళి ఓ పద్ధతి పాడు లేకుండా ఇష్టానుసారం తమ ఒళ్లును పెంచుకుంటూ పోతేమాత్రం ప్రాణాంతకర వ్యాధులు అయిన గుండె జబ్బులు టైపు 2 డయాబెటీస్ బారిన పడే అవకాశాలు మూడు రెట్లు అధికం అని ఎంతో అనుభవజ్ఞులు, తల పండిన డాక్టర్లు సైతం సెలవిస్తుండటాన్ని బట్టి స్థులకాయం (Obesity) అనేది మానవాళి జీవితాలను ఎంతటి ప్రమాదకర పరిస్థితులలోకి నెట్టి వేస్తున్నదో మనం ఇట్టే ఊహించవచ్చు. ముఖ్యంగా జంక్ ఫుడ్స్న ఎక్కువగా తీసుకుంటుండటం, వేళ కాని వేళల్లో భోజనానికి ఉపక్రమించడం, తాము చేసే పనిలో పూర్తిగా నిమగ్నం అయ్యి, పీకలదాకా కూరుకుపోయి భోజ నాన్ని సైతం వాయిదా వేయడంతో పాటు, ఎడాపెడా చిరు తిండ్లు అంటే బిస్కెట్లు, స్నాక్స్, మిక్చర్, ఐస్ క్రీమ్స్, సమోసా వంటి వాటిని తీసుకుంటూ ఉండటం మూలాన మన శరీరం అదుపుతప్పి కొలెస్ట్రాల్, కొవ్వు శాతం మన శరీరంలో పెరిగిపోయి అధిక బరువు మనకు సంప్రాప్తించే ఆనారోగ్య పరిస్థితులు ప్రస్తుత సమాజంలో ఎక్కువగా పొడచూపుతుండటం ఎంతైనా కడు బాధాకరమైన, శోచనీయమైన విషయం. ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఊబకాయం, (Obesity) స్థూలకాయం అనేది మానవాళికి ఓ పెను శాపంగా పరిణమించింది అనే మాట సత్యదూరం కాదు. అందులో భాగంగా పరిస్థితులు అనేవిఎంతటి దారుణ, దయనీయ పరిస్థితుల్లోకి నెట్టివేయబడిందో అనే విషయానికి వస్తే ప్రతి ముగ్గురు ఊబకాయుల్లో ఇద్దరి మర ణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని ఇటీవల ఓఅధ్య యనం తెలియజేసింది అంటే ఊబకాయం అనేది మానవాళి జీవితాలను ఏ స్థాయిలో ఆడుకుంటుందో, ఏ తరహాలో వారిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టి
వేస్తున్నదో తెలుసుకుం టుంటేనే మన గుండెలు, హృదయాలు ఒక్కసారిగా జలదరించడంతో పాటు, బరువెక్కుతాయి. అంతేకాదు మన శరీరానికి సైతం ఒక్కసారిగా తీవ్ర ఆందోళనతో ముచ్చెమటలు పట్టడం తథ్యం.
Read Also : http://Premature babies: ముందస్తుగా పుట్టిన శిశువులకు ప్రత్యేక సంరక్షణ ఎందుకు అవసరం?
ఇక ముఖ్యంగా స్థులకాయుల్లో పొడ చూపే జబ్బుల విషయానికి వస్తే గుండె వైఫల్యం, కొవ్వు పేరుకుపోవడం, రక్తం గడ్డ కట్టడం, గుండె కొట్టుకోవడంలో అసమతుల్యత వంటి ప్రమాదాలు ఎల్లవేళలా మన వెన్నంటి వుంటాయని ఓ పేరు మోసిన సర్వే సంస్థ వారు తమ అభిప్రాయాన్ని కుండలు బద్దలు కొట్టినట్లు తెలియజేయ డంతో ఖచ్చితంగా మనమంతా స్థులకాయాన్ని తక్కువ అంచనా వేయడానికి వీలులేదని, ఆ విషయంలో ఏమరు పాటు ఏ మాత్రం తగదనే చేదు వాస్తవాన్ని వీలయినంత త్వరగా ప్రతి ఊబకాయుడు గ్రహించి సత్వరమే తన హెవీ బాడీని, భారీ శరీర ఆకృతిని తగ్గించుకునే దిశగా చాలా తీవ్ర కసరత్తు చేయక తప్పదు కాక తప్పదు. ఏదిఏమైనా సాధా రణ బరువు వున్న వారితో పోలిస్తే అధిక బరువు వున్న 29-49ఏళ్ల వయసు గల పురుషుల్లో 78 శాతం, మహిళ ల్లో 65 శాతం అధిక రక్తపోటును బాడీ మాస్ ఇండెక్స్ (బిఎంఐ) ఎక్కువగా ఉండటమే కారణం. అదేమాదిరి స్థుల కాయుల గుండెకు రక్తం సరాఫరాలో ఏర్పడే ఇబ్బందిని ‘ఇస్కామిక్ హార్ట్డి సీజ్ అంటారు. దీనికి ప్రధాన కారణం పొగ త్రాగడం, బీపీ, షుగర్, రక్తంలో కొలెస్ట్రాల్ వంటివి ప్రధాన భూమికను పోషిస్తాయి అన్న మాట. అంతిమంగా మానవాళిచేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏమంటే తమ తమ శరీర బరువును అదుపులో పెట్టుకోవడం, ఎందుకంటే చేతు లు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే కన్నా ముందే మేల్కొని తమ శరీరాన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఊబకాయం బారిన పడకుండా చూసుకుంటే మంచిది.
-బుగ్గన మధుసూదన రెడ్డి
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: