దేశంలో ఊబకాయుల సంఖ్య ఆందోళన కరంగా పెరిగిపోతోంది. ఏదో కనపడిందల్లా ఆబగా తినడం వల్ల, ఆకలికి ఓర్చుకోలేకుండా పరిమిత భోజనానికి అలవాటుపడకపోవడమూ, వారి జీవన శైలి ఇందుకు కారణాలన్న విషయం తెలి సిందే. ఈమధ్యనే ప్రధాని నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఉబకాయంపై ప్రస్తావించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 2022లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది అధిక బరువుతో బాధ పడుతున్నారు. భారతదేశంలో కూడా ఎనిమిది మందిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి, 10 శాతం నూనె వాడకాన్ని తగ్గించాలని ప్రధాని సందేశం చర్చనీయాంశంగా మారిం ది. ఊబకాయ వ్యతిరేకోద్యమాన్ని ఆయనే సూచించారు. ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి, ప్రధాని మోదీ 10 మంది ప్రముఖులను నామినేట్ చేసి వారు మరో 10 మందిని సూచిస్తే మంచిదని సూచించారు. ఈవిధంగా ప్రతి పదిమంది మరో పది మందిని, అలానే వారు మరో పది మందిని, నామినేట్ చేస్తూ ఊబకాయం ఎంత అన ర్థమో అవగాహన కల్పించే ఉద్యమ కార్యక్రమానికి శ్రీకా రం చుట్టినా ఒక్క అడుగు ముందుకు కదిలిన దాఖలాలు లేవు. అధిక క్యాలరీలతో కూడిన ప్రాసెస్ చేయబడిన ఆహారం, చాక్లెట్, పాస్ట్ఫుడ్ తదితరాలు ఊబకాయా(Obesity)నికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. మానవ శరీరాన్ని సరైన పద్ధతిలో క్రియాశీలకంగా ఉంచుకోలేకపోవడమూ ఇందుకు కారణమే! బ్లూటూత్, ఇంటర్నెట్, కంప్యూటర్లు, టీవీలను తదేక దీక్షగా, క్షణం విరామం ఇవ్వకుండా నిరంతరం వినియోగిస్తుండడం వలన పరిస్థితి శారీరక శ్రమను తగ్గిస్తుంది. మూలకశక్తిని తక్కువగా శరీర బరువును పెంచుతుంది. అలా వచ్చిన ఒళ్ళును తగ్గించుకోవాలన్నా కఠోర శ్రమ, పరిమిత ఆహారం, నియమానుసారం ఆహార స్వీక రణ చాలాముఖ్యం. కొంతమంది వ్యక్తులలో వంశపారం పర్యంగా లేదా హార్మోన్లలో మార్పులు, మానసిక ఒత్తిడి లేదా ఆందోళన అనేది ఎక్కువ ఆహారం తినడానికి కారణ
మవుతుంది. మధుమేహమేకాదు, గుండె జబ్బులు, క్యాన్సర్లతో పాటు ఊబకాయం కూడా భారతీయులకు పెను ముప్పుగా పరిణమిస్తోంది. స్థూలకాయులకు ముందుగా చర్చించుకున్న మూడు జబ్బులతో పాటు హృద్రోగంకూడా కలవరపెడుతోంది. ఒక్కొక్కప్పుడు వైద్యానికి కాలాతీతమై కాయం కడతేరుతుంది. భారతదేశంలోనూ స్థూలకాయుల సంఖ్య తక్కువేం కాదని ఎన్నో సర్వేలు చెప్పచూశాం. దేశంలో ఊబకాయం (Obesity)వలన రోగాలబారిన పడుతున్న 54 శాతం మందిలో ఆహారపుటలవాట్లే వాళ్ళను పొట్టన బెట్టుకున్నాయని వైద్యులు తేల్చిపారేశారు. అయినా ఆది లో కొందరు భయపడకపోయినా ఇప్పుడెందరో లావు తగ్గించుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. దేశంలో టైప్ 2 మధుమేహం, గర్భాశయ, కాలేయ, వక్షోజ క్యాన్స ర్లు, గుండెజబ్బుల పీడితులే అధికంగా ఉన్నారు. ప్రముఖ వైద్య విజ్ఞాన పత్రిక ‘లాన్సెట్ గత ఏడాది ప్రచురించిన 2022 నాటి సర్వేవిశేషాలు పరిశీలిస్తే ఐదు నుంచి 19 ఏళ్లలోపువారు 12 మిలియన్ల మంది ఊబకాయంతో బాధ పడుతున్నారని అంచనా వేసింది. స్థూలకాయానికి తారత మ్యాలు, వయోభేదం వంటి మొహమాటాలు ఏమీ ఉండ వు. అన్ని వయసుల వారినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. గంటల కొద్దీ కూర్చుని పనిచేసే ఉద్యోగులు ఊబకాయం బారిన పడతారని వింటున్నాం. వారి జీవనశైలి గురించి కూడా
చెప్పుకుంటున్నాం. ఎక్కువగా ఐటి ఉద్యోగులు ఒబేసిటీకి లోనవుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. శరీరం లోకి చేరుతున్న క్యాలరీలకు, ఖర్చయ్యే క్యాలరీలకు మధ్య సమతుల్యత లేకపోవడం వల్లనే కొవ్వు శరీరంలో పేరుకు పోయి స్థూలకాయానికి దారితీస్తోందని శాస్త్రజ్ఞులు ఏనాడో చెప్పినా జనం పెడచెవిన పెట్టారు. ఇప్పుడు లబోదిబో మంటున్నారు. కేవలం ఆహారపుటలవాట్లే కాదు. ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన, హార్మోన్ల అసమతుల్యత కూడా స్థూలకాయానికి హేతువులే! ప్రత్యేక విషయమేమిటంటే ఊబకాయులు సాధారణంగా ఆత్మన్యూనతకు, కుంగుబా టుకులోనై బాహ్య ప్రపంచంలోకి రావడానికి సిగ్గరులు గా మారుతుంటారు. కొంతమంది ఇంతకు ముందు ఉన్న ఆరోగ్య కరమైన జీవనశైలిని విస్మరించి పీకల మీదకు తెచ్చుకుంటున్నారు. శరీరంలో ఒకసారి పేరుకుపోయిన కొవ్వుకరగడమంటే మాటలు కాదు. వ్యాయామంపై దృష్టి పెట్టడం ద్వారా కొంత బరువును తగ్గించుకోవచ్చు. ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీలు సన్నబడి ఊబకాయానికి సవాళ్లు విసిరారు. అదే మంచిదే. కానీ వారు అవలం బించిన వ్యాయామమేదో, వారు అంత సన్నగా ఎలా మారారో వారే స్వయంగా చెబితే వినాలని ఉంది. మనం అప్రయత్నంగా స్వీకరించే అధికక్యాలరీలతో కూడిన ఆహా రం, ప్రాసెస్ చేయబడిన ఫుడ్,నూనె, చక్కెరలను ఆహార మెనూ నుండి
దూరంపెట్టాలి. నూనెవాడకాన్ని తగ్గించేం దుకు ప్రధాని మానవాళిని ప్రేరేపిస్తున్నారంటే దాని వల్ల ఉభయ తారకంగా ఉండే ప్రయోజనాలున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, తక్కువ నూనె వాడేఆహారాలు తినడంవల్ల ఊబకాయాన్ని నివారించవచ్చని ఆయనసూచి స్తున్నారు. ప్రజారోగ్యం గురించి చర్చ లేవదీయడం ఆహ్వా నించదగినదే. కొందరైనా అప్రమత్తమోతారు. లేకుంటేఏవో ఖరీదైన మందులకు భ్రమపడి ఏనుగులా ఉన్నవాడు, పీను గులా తయారౌతాదండి కొన్ని అనుభవాలుచెబుతున్నాయి. బేరియాట్రిక్ సర్జరీల సంగతి తెలిసిందే. ఈ రీత్యా ఆరోగ్య కర జీవనశైలిని ప్రోత్సహించడంద్వారా ఊబకాయాన్ని నియంత్రించడం సాధ్యమేనన్న ఉద్దేశ్యం హ్వానించదగినదే!
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: