ఎన్టీఆర్ జిల్లా(NTR District) గంపలగూడెం మండల పరిధిలోని చల్లగుండ్ల వారిపాలెం శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తోటమూల ప్రాంతానికి చెందిన ఒక ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ బస్సు, మరో బస్సును ఓవర్టేక్ చేయబోయే సమయంలో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
Read Also: iBOMMA: కేసులో సంచలనం.. నకిలీ పాన్, లైసెన్స్ వెలుగులోకి
50 మందికి పైగా విద్యార్థులు
ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా విద్యార్థులు ఉన్నప్పటికీ, పెద్ద ప్రమాదం (accident) తప్పింది. సమీపంలోని పంట పొలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు. వారు బస్సు వద్దకు పరుగెత్తుకొచ్చి, విద్యార్థులను ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ఈ సంఘటనతో విద్యార్థులు భయాందోళనకు గురైనా, ఎవరికి తీవ్ర గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: