📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

RTC Bus Accidents : ఆగని బస్సు ప్రమాదాలు

Author Icon By Sudheer
Updated: November 5, 2025 • 9:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనంతపురం జిల్లాలోని పుట్లూరు మండలంలో గురువారం ఒక భయానక సంఘటన చోటుచేసుకుంది. పుట్లూరు నుండి చింతకుంట వైపు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదం చింతకుంట గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. బస్సు స్టీరింగ్ ఒక్కసారిగా స్టక్ కావడంతో డ్రైవర్‌కు నియంత్రణ తప్పి బస్సు రోడ్డును దాటి బయటికి వెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అదృష్టవశాత్తూ బస్సు రోడ్డు పక్కన ఉన్న మైదానంలో ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Latest News: Bandi Sanjay: బండి సంజయ్‌ నుంచి టెన్త్‌ విద్యార్థులకు భారీ గిఫ్ట్!

ఈ బస్సులో ఎక్కువగా స్థానిక ఆదర్శ పాఠశాల, జడ్పీ పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. విద్యార్థులు స్కూల్‌కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పడంతో అందరూ భయంతో అరుస్తూ గందరగోళ పరిస్థితి నెలకొంది. కానీ డ్రైవర్ ధైర్యం కోల్పోకుండా సమయోచితంగా వ్యవహరించడం వల్లే పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. ఘటన స్థలానికి స్థానిక పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు.

TG Bus Accidents

అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. బస్సులో ఉన్న విద్యార్థులు, ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. అధికారులు వెంటనే మరో బస్సు ఏర్పాటు చేసి విద్యార్థులను గమ్యస్థానాలకు పంపించారు. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు విచారణ ప్రారంభించారు. బస్సు సాంకేతిక లోపం కారణమా, లేక మానవ తప్పిదమా అనేది తెలుసుకునేందుకు పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనతో స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ప్రమాదం జరగకపోవడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

accidents Ap Google News in Telugu RTC Bus Accidents

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.