📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Nitish Kumar Reddy: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కెప్టెన్‌గా నితీష్ కుమార్ రెడ్డి

Author Icon By Anusha
Updated: July 18, 2025 • 3:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2025లో ఓ ప్రత్యేక అవకాశం లభించింది. విశాఖపట్నం కు చెందిన 22 ఏళ్ల నితీష్, ఈసారి భీమవరం బుల్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని జూలై 18, 2025న భీమవరం బుల్స్ అధికారికంగా తమ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.ఏపీఎల్ 2025 మెగా వేలంలో భీమవరం బుల్స్ ఫ్రాంచైజీ నితీష్‌ను రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. ఇది నితీష్‌ (Nitish Kumar Reddy) కి కెప్టెన్‌గా వచ్చిన మొదటి అవకాశం కావడం విశేషం. ఇంతకు ముందు అతను తన కెరీర్‌లో ఏ ఒక్క పోటీ మ్యాచ్‌కి కూడా కెప్టెన్సీ చేయలేదు. ఈ నేపథ్యంలో కెప్టెన్ బాధ్యతలను చేపట్టడం అతనికి సవాలుతో కూడుకున్న విషయమే.

అద్భుత ప్రదర్శన

గత సీజన్‌లో నితీష్ గోదావరి టైటాన్స్ తరఫున ఆడాడు. అప్పట్లో అతన్ని ఏపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర అయిన రూ.15.6 లక్షలకు కొనుగోలు చేయడం జరిగింది. ఇది అతని ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. ఇక ఐపీఎల్ (IPL) విషయంలో చూస్తే, 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున నితీష్ అద్భుత ప్రదర్శన చేశాడు. 9 మ్యాచ్‌లలో 239 పరుగులు చేసి రెండు అర్ధ సెంచరీలు సాధించి, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. కానీ, 2025 సీజన్‌లో అతనికి ఫామ్ కొద్దిగా తగ్గింది. మొత్తం 13 మ్యాచ్‌లలో కేవలం 131 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే రెండు వికెట్లు మాత్రమే సాధించాడు.

టీమిండియా వెటరన్ బ్యాటర్ హనుమ విహారి

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా ఆగస్ట్ 8 నుంచి 24 వరకు జరగనుంది. ఈ లీగ్‌లో ఈ సారి కొత్తగా మొత్తం 7 జట్లు తలపడుతున్నాయి. ఇది ఏపీఎల్ నాలుగో సీజన్ కాగా, పాత 6 జట్లను రద్దు చేసి కొత్తగా 7 జట్లను ప్రవేశపెట్టారు. జూలై 14న విశాఖ వేదికగా వేలం నిర్వహించగా, 520 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. నితీష్ కుమార్ రెడ్డితో పాటు టీమిండియా వెటరన్ బ్యాటర్ (Team India veteran batter) హనుమ విహారి, వికెట్ కీపర్ కేఎస్ భరత్ ఈ లీగ్‌ ఆడుతున్నారు. ఈ ఇద్దరితో పాటు ఆంధ్ర రంజీ స్టార్స్, ఐపీఎల్ ప్లేయర్స్ షేక్ రషీద్, రికీ భూయి, పైల అవినాష్,త్రిపురణ విజయ్, సత్యనారయణ రాజు‌లు కూడా బరిలోకి దిగుతున్నారు.

నితీష్ కుమార్ రెడ్డి ఎప్పుడు పుట్టారు?

నితీష్ కుమార్ రెడ్డి 2003 మే 26న విశాఖపట్నంలో జన్మించారు.

నితీష్ కుమార్ రెడ్డి ఏ జాతీయ జట్టుకు ఆడుతున్నారు?

ఆయన ప్రస్తుతం భారత జాతీయ క్రికెట్ జట్టుకు టెస్ట్ మరియు టీ20 ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Dilip Vengsarkar: టీమిండియా జట్టులో ఈ రెండు మార్పులు చేస్తే విజయం ఖాయం

Andhra Premier League Captain Andhra Young Cricketers Bheemavaram Bulls Captain Breaking News Emerging Cricketer India IPL Sunrisers Hyderabad latest news Nitish Kumar Reddy APL 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.