📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : Nitish Kumar : నితీష్ ముందు ఎన్నో సవాళ్లు!

Author Icon By Sudha
Updated: December 3, 2025 • 4:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో మరెవ్వరూ చేపట్టిన విధంగా సుదీర్ఘకాలం సీఎంగా పేరుగాంచిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజకీయ భవిష్యత్తు మున్ముందు ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చసాగు తోంది. సీఎంగా నితీష్ మరోసారి బాధ్యతలు చేపట్టాక ఆయన రాజకీయ భవిష్యత్తుకు వచ్చిన ప్రమాదమేమిటీ అన్నది సందేహం వ్యక్తం కావచ్చు. కానీ ఈ సందేహానికి తాజా పరిణామాలు ఊతమిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండు ఊత కర్రల సాయంతో నడుస్తోంది అన్నది అందరికీ తెలిసిందే ఒకటి ఏపీలోని టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీల మద్దతుతో, రెండవది బీహార్లో నితీష్ కుమార్ (Nitish Kumar) నాయకత్వంలోని జేడీయూకి ఉన్న 12 మంది ఎంపీల బలంతో, ఇక బీహార్ లో సీఎం పీఠం విషయంలో కనుక బీజేపీ ఏమైనా రాజకీయ ప్రయోగాలు చేస్తే ఆ ప్రభావం కచ్చితంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మీద పడుతుంది. వ్యూహాలలో నితీష్ని సైతం ఎవరూ తక్కువ అంచ నా వేయడానికి అయితే లేదు. ఆయన తిమ్మిని సైతం బమ్మిగా చేయగలరు. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ (NitishKumar) విషయంలో బీజేపీ ఆచీతూచీ అడుగులు వేసింది. తనకు మెజార్టీ సీట్లు వచ్చినా మళ్లీ సీఎం పీఠం నితీష్ కుమార్కే బీజేపీ అప్పగించింది. సీఎం పీఠం అప్పగించినట్లు అప్పగించి పక్కల్లో బెల్లంలా తయారయ్యే వ్యూహాన్ని బీజేపీ అమలు చేసేందుకు సిద్దమైంది. తాజాగా బీహార్ వరుసగా పదోసారి ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణం చేశారు. ఆయనతోపాటు 25 మంది క్యాబినెట్ మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయగా తాజాగా వారికి శాఖలను కేటాయించారు. ఈ ఎన్నికల్లో జేడీయూ 85 సీట్లు గెలిచి బీజేపీ (89)కంటే కేవలం నాలుగు సీట్లే వెనకబడింది.

Read Also : http://Lok Sabha : రాజ్ నాధ్ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్

Nitish Kumar

కీలక శాఖలు తన వశం

నితీష్ ముఖ్యమంత్రి కుర్చీపై తన పట్టును నిలుపుకున్నారు, కానీ ఆనందం ఆయనకు పూర్తిగా దక్కలేదు. దాదాపు రెండు దశాబ్దాలపాటు తనవద్దే ఉన్న హోంశాఖను బీజేపీ నేత, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి అప్పగించారు. మరో డిప్యూటీ సీఎం విజయ్ సిన్హాకు రెవెన్యు, భూగర్భ శాఖలను కేటాయించారు. వీటితోపాటు కీలక మంత్రిత్వశాఖలను బీజేపీ తన వశం చేసుకొంది. అయితే, నితీష్ కుమార్ దాదాపు 20 ఏళ్లు తన వద్ద అట్టిపెట్టుకున్న హోం శాఖను తొలిసారి ఇతరులకు అప్పగించారు. దేశంలోని ఏ రాష్ట్ర లేదాసమాఖ్య వ్యవస్థలో అత్యంత విలువైన బీహార్ హోం శాఖను మొదటి సారిగా 2005 నవంబర్లో నితీష్ కుమార్చే పట్టారు. అప్పటి నుంచి దాదాపుగా దానిని నిర్వహిస్తున్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో జేడీయూ పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ సీఎం పదవికి నితీష్ రాజీనామా చేసి. హిందూ స్టాన్ అవామ్ మోర్చాకు చెందిన జితన్ రామ్ మాంఘీకి 2014 మేలో బాధ్యతలు అప్పగించారు. ఆయన 2015 ఫిబ్రవరి వరకూ 9 నెలల పాటు కొనసాగిన సమయంలో తప్ప హోంశాఖ నితీష్ వద్దే ఉంది. అందువల్ల, హోం శాఖ ను బీజేపీకి అప్పగించడం చెప్పుకోదగ్గ అంశం. అంతేకాదు, కాషాయ పార్టీని పెద్దన్న అని అంగీకరించినట్టయ్యింది. 2020 ఎన్నికల్లో బీజేపీ, జేడీయూలు కలిసి పోటీ చేశాయి. ఆ సందర్భంలో బీజేపీ 74 సీట్లు గెలుచుకుని, ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ తర్వాతి స్థానంలో నిలిచింది. జేడీయూ కేవలం 45స్థానాలకే పరిమితమైంది. దీంతో సీఎం పదవి కోసం బీజేపీ పట్టుబడుతుందని భావించారు. కానీ, నితీష్ సీఎంగానే కొనసాగి, హోంశాఖను తన వద్దే అట్టి పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు హోంశాఖ నితీష్ కుమార్ నుంచి చేజారింది. కీలకమైన హోంశాఖ బీజేపీ చేతుల్లోకి వెళ్లిందంటే రాష్ట్ర పాలన రిమోట్ ఓ రకంగా బీజేపీ చేతు ల్లోకి వెళ్లినట్లే. నితీష్ కుమార్ ఏ మాత్రం తోక జాడించినా వాత పెట్టేలా ప్లాన్ మాత్రం మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో నితీష్ కుమార్ మాత్రం మునుపటి మాదిరిగా పూర్తి స్వేచ్ఛగా ఏ మేరకు పనిచేయగలరు అన్నదే ప్రశ్న.

Nitish Kumar

దినదిన గండం

బీజేపీ అత్యంత బలంగా ఉంది. మిత్రులు కూడా ఆ పార్టీతోనే ఉంటారు. నితీష్ కుమార్ పేరుకు సీఎంగా ఉన్న ప్రధాన నిర్ణయాలు అన్నీ బీజేపీ ద్వారానే జరిగిపోయే అవకాశముంది. ఇక నితీష్ కుమార్ సీఎం పదవి కూడా దినదిన గండంగా ఉండబోయే పరిస్థితి. నితీష్ కుమార్ని బీజేపీ వద్దు అనుకున్నపుడు ఏమైనా చేసే సీన్ అయితే బీహార్లో ఉంది. పైగా గతంలో అనేక రాష్ట్రాలలో బీజేపీ ఎత్తులు వ్యూహాలు అందరూ చూసినవే. దాంతో నితీష్ చాలా జాగ్రత్తగానే బీజేపీతో వ్యవహరించాల్సి ఉంది. ఇక పోతే ఎంతగా తగ్గి వ్యవహరించినా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిత్వం గరిష్టంగా మూడేళ్ళ ముచ్చటగానే ముగిసే అవకాశం లేకపోలేదు. 2029 ఎన్నికలలో కనుక బీజేపీ పూర్తి మెజారిటీని సాధించి కేంద్రంలో మరోమారు అధికారంలోకి వస్తే అప్పుడు బీహార్లో బీజేపీ సీఎం కచ్చితంగా మార్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే బీహార్లో ఎన్నికలు తిరిగి 2030 నవంబర్లోనే జరుగుతాయి. బీజేపీ సీఎం అక్కడ నుంచి మరో సంవత్సరంన్నర పాటు పాలించే వెసులుబాటు ఉంటుంది. ఈ లోపు జేడీయూ నుంచి ఎమ్మెల్యేలను లాగేసి, ఆ పార్టీ ఎంపీలను లాగేసి సీఎం పీఠం నుంచి నితీష్ ను బీజేపీ దించే ప్రయత్నం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
-సయ్యద్ నిసార్ అహ్మద్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Bihar Politics BreakingNews Governance Indian Politics latest news Nitish Kumar political challenges Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.