📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Nitin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు ‘గోల్డెన్ అవర్’ చికిత్స

Author Icon By Rajitha
Updated: February 5, 2026 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజంపేట: దేశంలో రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత గోల్డెన్ అవర్ చికిత్స పథకం ద్వారా 1.50 లక్ష వరకు నగదు రహిత చికిత్సలు అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (Nitin gadkari) వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాల్లో బుధవారం వైసిపి రాజ్యసభసభ్యుడు మేడా రఘునాథరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పథకాన్ని అమలు చేసేందుకు చండీగఢ్, అస్సాం, పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పల్లెటైటిగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. జాతీయ స్థాయిలో అమలు చేయడానికి ముందు అమలు సవాళ్లను అంచనా వేయడానికి పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్టు తెలిపారు. పైన పేర్కొన్న రాష్ట్రాలలో అమలు సమయంలో 6,833 చికిత్స అభ్యర్థనలు అందాయని, వాటిలో 5,480 మంది బాధితులు అర్హులని గుర్తించి, పథకం నిబంధనల ప్రకారం నగదు రహిత చికిత్స పొందారు.

Read also: AP: ‘మన మిత్ర’కు 50 లక్షల మంది యూజర్లు

‘Golden hour’ treatment for road accident victims

మోటారు వాహన ప్రమాద నిధి కింద పంపిణీ చేయబడిన మొత్తం నిధి కింద 73.88 లక్షలు అందజేసినట్టు తెలిపారు. ప్రమాదం జరిగిన తేదీ నుండి గరిష్టంగా 7 రోజుల పరిమితికి లోబడి, బాధితుడికి 1.5 లక్షల వరకు చికిత్స కవర్ అందించబడుతుందన్నారు. ఏ కేటగిరీ రోడ్డులోనైనా మోటారు వాహనాల వాడకం వల్ల సంభవించే రోడ్డు ప్రమాదాలలో చిక్కుకున్న బాధితులకు చికిత్స కవర్ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రతి మోటారు వాహన రోడ్డు ప్రమాద బాధితుడికి ప్రాణాపాయం లేని కేసులలో 24 గంటల వరకు, ప్రాణాంతక కేసులలో 48 గంటల వరకు పోలీసు ప్రతిస్పందనకు లోబడి, నియమించబడిన ఆసుపత్రులలో చికిత్స అందించబడుతుందన్నారు. ఈ పథకానికి ఉమ్మడిగా నిధులు సమకూరుతాయన్నారు. ఇందులో నేరం చేసిన మోటారు వాహనం బీమా చేయబడిన కేసులకు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే విరాళాలు, బీమా లేని మోటారు వాహనాలు లేదా హిట్ అండ్ రన్ మోటార్ ప్రమాదాలకు సంబంధించిన కేసులకు బడ్జెట్ మద్దతు ఉంటుందన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Cashless treatment emergency medical care Government Scheme latest news Road Accident Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.