📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Nimmala Ramanayudu: జగన్ పై నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు

Author Icon By Sharanya
Updated: August 5, 2025 • 5:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం నిలబెట్టుకోలేదని, జగన్ పాలనలో “రెడ్ బుక్ రాజ్యాంగం” నడిచిందని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanayudu) తీవ్ర విమర్శలు చేశారు.

Nimmala Ramanayudu

పాలకొల్లులో ఘాటు వ్యాఖ్యలు

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మీడియాతో మాట్లాడిన నిమ్మల రామానాయుడు (Nimmala Ramanayudu), జగన్ (jagan) ప్రభుత్వం కాలంలో ప్రజలకు మేలు చేసేందుకు ఒక్క అడుగు కూడా వేయలేదని విమర్శించారు. “అక్రమ కేసులు, కక్షసాధింపు చర్యలు, దాడులు – ఇవే ఆ పాలన చిహ్నాలు. ప్రజల సంక్షేమం పూర్తిగా మరచిపోయారు” అని వ్యాఖ్యానించారు.

సాక్షి దినపత్రికపై ఆగ్రహం

వైసీపీ నేతలు క్రికెట్ బెట్టింగ్‌లో చిక్కుకున్నా, అక్రమంగా సంపాదించిన ఆస్తులు బయటపడినా.. ఆ విషయాలు సాక్షి పత్రికలో ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. తనపై మాత్రం కావాలనే తప్పుడు వార్తలు ప్రచురించడం దుష్ప్రచారానికి నిదర్శనమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో తన నియోజకవర్గం పాలకొల్లులో రూ. 430 కోట్ల అభివృద్ధి పనులు (430 crore development works) జరుగుతున్నాయని మంత్రి వివరించారు. ప్రజలకు గృహాలు, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు.

టిడ్కో గృహాల విషయంలో వైసీపీ తీరుపై తీవ్ర విమర్శ

“మేము నిర్మించిన టిడ్కో గృహాలపై జగన్ హయాంలో ఒక్క ఇంటికీ రూ. 3.65 లక్షల రుణం తీసుకుని దారి మళ్లించారు” అని ఆరోపించారు. టిడ్కో ప్రారంభోత్సవ సభలో తమను బహిరంగంగా స్టేజ్‌ నుంచి దింపిన ఘటనను గుర్తు చేస్తూ, అప్పట్లో సాక్షి పత్రిక మౌనం ఎందుకు వహించిందని నిలదీశారు. “మేమే దాడులకు గురయ్యాం. అయినా మాపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. ఇది జగన్ పాలనలోనూ ప్రజాస్వామ్యంపై జరిగిన అతి పెద్ద దాడి” అని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/rdt-when-will-rdt-get-permits/andhra-pradesh/526342/

APPolitics Breaking News Jagan latest news NimmalaRamanayudu Palakollu RedBookRajyam Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.