Nimmala RamaNaidu: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు: సుజల స్రవంతికి రూ.600 కోట్లు కేటాయింపు

Read Time:  1 min
Nimmala RamaNaidu
Nimmala RamaNaidu
FONT SIZE
GET APP

జూన్ నాటికి అనకాపల్లి వరకు గోదావరి నీళ్లు

ప్రాధాన్య క్రమంలో మిగిలిన ప్రాజెక్టులు పూర్తికి కృషి

అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి

Nimmala RamaNaidu: విజయవాడ : ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి ఈ ఏడాది బడ్జెట్లో రూ. 600 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు చెప్పారు. అసెంబ్లీలో శుక్రవారం సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ మొత్తంలో 500 కోట్లు పనులకు, మరో 100 కోట్లు భూసేకరణకు కేటాయించినట్లు చెప్పారు. సుజల స్రవంతి తో పాటు, ఉత్తరాంధ్ర లో ప్రాధాన్య క్రమంలో మరో 11 ప్రాజెక్టులు గుర్తించి వాటికి మరో 460 కోట్లు కేటాయించి నట్లు రామానాయుడు వివరించారు. 2014 19లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పధకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని ఆయన చెప్పారు.

Read Also:Nara Lokesh: 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: ముంబై సదస్సులో లోకేష్ ధీమా

Nimmala RamaNaidu
Nimmala RamaNaidu: Godavari waters for North Andhra: Rs. 600 crore allocated for Sujala Sravanti

సుజల స్రవంతి ద్వారా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను సస్యశ్యామలం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యంగా ఆయన స్పష్టం చేశారు. 63.20 టిఎంసిల నీటితో 8 లక్షల ఎకరాలకు సాగు నీరు, 30లక్షల మంది ప్రజలకు తాగు నీటితో పాటు, విశాఖ పారిశ్రామిక అవసరాలకు నీరందించేలా సుజల స్రవంతికి రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. ఈ పధకంను ఫేజ్1లో 2022 కోట్లు, ఫేజ్2 లో 4210 కోట్ల తో పనులు కూటమి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిం దన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాధాన్యతను గుర్తించి కూటమి ప్రభుత్వం పనులను ప్రత్యేక శ్రద్ధతో ముందుకు తీసుకువెళుతోందన్నారు.

ఉత్తరాంధ్ర సస్యశ్యా మలం అవ్వాలంటే పోలవరం ఎడమ ప్రధాన కాలువ కీలక మైనదిగా ఆయన చెప్పారు. ఇంత కీలకమైన ఎడమ కాలువ పనులకు 2014-19 లో తెదేపా ప్రభుత్వం చేసిన పనులు తప్ప, గత 5ఏళ్ళ వైసిపీ పాలనలో ఒక్కరూపాయి ఖర్చు గానీ, తట్ట మట్టి గానీ, అరబస్తా సిమెంట్ పని గానీ చేయలేదని రామానాయుడు విమర్శించారు. గత వైసిపి ప్రభుత్వంలో 63 కోట్లు మాత్రమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ 1209 కోట్లు కేటాయించి పనులు వేగవంతం చేశామన్నారు. 2026 జూన్ నాటికి సిఎం చంద్రబాబు చేతుల మీదుగా అనకాపల్లి వరకు నీళ్ళు తీసుకెళ్ళేలా పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు చేస్తున్నామని మంత్రి రామానాయుడు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.