📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Nimmala Ramanaidu: నిర్దిష్ట ప్రణాళికతో నీటి ప్రాజెక్టులు పూర్తి

Author Icon By Anusha
Updated: July 4, 2025 • 10:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను గాడిన పెడుతున్నాం — మంత్రి నిమ్మల రామానాయుడు

విజయవాడ : రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటిని నిర్దిష్ట కార్యచరణ ప్రణాళికను అనుసరించి పూర్తి చేస్తామని ఎపి జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఉత్తరాంధ్ర ప్రజలకు సాగు, మంచినీరందించే పెండింగ్ ప్రాజెక్టులను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తి, ఆయా ప్రాజెక్టుల సిఇలు, ఎస్ఇలు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గత ఐదేళ్లుఉత్తరాంధ్ర ప్రాజెక్టులను వైసిపి ప్రభుత్వం పట్టించుకో లేదని మంత్రి నిమ్మల (Nimmala Ramanaidu) ఆరోపించారు. వంశధార నాగావళి, నాగావళి, చంపావతి అనుసంధానం బ్యాలెన్స్ పనులపై సమీక్షించారు. హీరమండలం లిఫ్ట్, మద్దువలస స్టేజ్ 2, జంజ్యావతి రిజర్వాయర్ పనుల వేగవంతంపై చర్చించారు.

ప్రస్తుత స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు

జైకా నిధులతో నత్తనడకన సాగుతూ నిలిచిపోయిన ఆండ్ర రిజర్వాయర్, రైవాడ, పెద్దంకలం, పెద్దగడ్డ, వట్టిగెడ్డ పూర్తిచేయడానికి ఉన్న అవాంతరాలపై సమీక్షలో చర్చించారు. 90శాతం పనులు పూర్తైన వంశధార స్టేజ్ 2, ఫేజ్2, తోటపల్లి బ్యారేజ్ పనులను గత ప్రభుత్వం గాలికొదిలేయడం దుర్మార్గమన్నారు. వైకాపా గడిచిన ఐదేళ్లలో ఉత్తరాంధ్రకు చేసిన ద్రోహం అంతా ఇంతా కాదన్నారు. వంశధార నాగావళి, నాగావళిచంపావతి అనుసంధానం బ్యాలెన్స్ పనులపై మంత్రి సమీక్షించారు. ప్రస్తుత స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హీరమం డలం లిఫ్ట్, మద్దువలస స్టేజ్ 2, జంజావతి రిజర్వాయర్ (Janjavati Reservoir) పనులు వేగవంతంపై వివరాలు అడిగారు జైకా నిధులతో నత్తనడకన సాగుతూ నిలిచిపోయిన ఆండ్ర రిజర్వాయర్, రైవాడ, పెద్దంకలం, పెద్దగడ్డ, వట్టిగెడ్డ, పూర్తిచేయడానికి ఉన్న అవాంతరాలపై ఆరా తీశారు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా సొరంగాల్లో బెంచింగ్, లైనింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Nimmala Ramanaidu:

పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులకు

రెండో టన్నెల్లో ఉన్న టన్నెల్ బోరింగ్ మెషిన్ తొల గింపుకు కోర్టుకేసు అడ్డంకిగా ఉన్న నేపధ్యంలో మిషన్ విలువ నిర్ణయించేందుకు సాంకేతిక నిపుణుల కమిటీని నియమించామని తెలిపారు. ఫీడర్ కెనాల్, లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి పాలనా పరమైన అనుమతులు రాగానే టెండర్లు పిలిచి పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఇంక పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల్లో హైవే బ్రిడ్జి, పంపా ఆక్విడెక్ట్, కృష్ణవరం సైఫన్ వంటి క్లిష్టతర పనులు వేగంవంతం చేయాలి అని అధికారులు, ఏజెన్సీ (Agency) లకు నిర్దేశించారు. ముఖ్యమంత్రి సమీక్ష నాటికి ఏ ఏ పనులకు ఎంతెంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఎంత కాలంలో పూర్తి చేస్తారు, తదితర వివరాలతో సమగ్ర నివేదికలతో సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులకు, ఇంజనీర్లకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సి, నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్ట్ల సిఇలు, ఎస్ఐలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Hindi Also: hindi.vaartha.com

Read Also: Liquor Dump Case : కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మరో షాక్‌

Andhra Pradesh Development Andhra Pradesh water resources minister AP irrigation projects Champavathi linkage works Chandrababu Naidu orders ENCs and engineers meeting Google news Hiramandalam lift irrigation irrigation department review irrigation project completion irrigation project progress Janjavathi reservoir Madduvalasa stage 2 Nimmala Ramanaidu statement pending irrigation works Today news Uttarandhra irrigation review Vamsadhara Nagavali project Vijayawada irrigation meeting water supply North Andhra YSRCP negligence irrigation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.