📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Tirumala – ఎస్పీ హర్షవర్ధన్ రాజు – బ్రహ్మోత్సవాల భద్రతకు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, కమాండ్ కంట్రోల్ రూమ్ లు

Author Icon By Rajitha
Updated: September 8, 2025 • 11:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అన్ని అత్యవసర విభాగాలతో సమన్వయంగా సేవలు: ఎస్పీ హర్షవర్ధన్ రాజు

తిరుమల: ఏడుకొండల వేంకటేశ్వరస్వామికి ఈ ఏడాది సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు రెండు వారాల్లో మొదలు కానున్నాయని, అశేషంగా తరలివచ్చే భక్తుల భద్రతకు ఇంటిగ్రేటెడ్ చెకోపోస్టులు, కమాండ్ కంట్రోల్ రూమ్లు మరిన్ని ఏర్పాటు చేసుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు (SP Harshavardhan Raju) తెలిపారు. అన్ని అత్యవసర విభాగాలతో కలసి సమన్వయంగా ఆ తొమ్మిదిరోజులు అవసరమైన సేవంలదించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల భద్రత, రద్దీనియంత్రణ, అత్యవసర సమయంలో భక్తులను కాపాడటం, వైద్యసేవలందించేందుకు మార్గాలు వంటి అంశాలపై ఆదివారం పోలీసు భవనంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 24వతేదీ నుండి మొదలుకానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంసిద్ధంకావాలన్నారు. గత సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ నియంత్రణ, క్యూలైన క్రమబద్ధీకరణ, గరుడసేవరోజు అనుసరించిన వ్యూహంతో చిన్నపాటి పొరబాట్లు, అవాంఛనీయ ఘటనలు లేకుండా చూడగలిగారన్నారు. ఈ సారి అదే వ్యూహంతో మరింత పటిష్టంగా ప్రణాళికాబద్ధంగా పోలీసు అధికారులు సిబ్బంది పనిచేయాలన్నారు. సమన్వయంతో విధులు నిర్వహించి భక్తులకు మెరుగైన సేవలందించాలని ఎస్పీ సూచించారు. తిరుమల (Tirumala) లో స్థానికులు నివాసముంటే బాలాజీనగర్ తోబాటు పాపవినాశనం ప్రాంతంలో తరచూ నాకాబందీ తరహాలో తనిఖీలు చేయాలన్నారు. ట్యాక్సీ డ్రైవర్లు, జీపుడ్రైవర్లు భక్తులకు మర్యాదపూర్వక సేవలందించేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వారితో త్వరలోనే అవగాహన సదస్సు నిర్వహించాలన్నారు.

తిరుమలలో భక్తులకు సేవాభావంతో సేవలందించాలని, అవసరమైన సమాచారం అందించేలా తర్పీదు అవ్వాలన్నారు.. కొండపై ఇన్నర్రింగురోడ్డు, ఔటర్రింగురోడ్డులపై బ్రహ్మత్సవాల సమయంలో డ్రోన్తో నిఘా ఉంచాలన్నారు. ట్రాఫిక్ రద్దీ సమయంలో వాహనదారులకు సూచనలు చేయాలన్నారు. అవసరమైన మేరకు అదనపు ట్రాఫిక్ ప్రాంతాలు గుర్తించి సమస్య లేకుండా చూడాలని తిరుమల డిఎస్పీ (DSP) శేఖర్ కు ఎస్పీ సూచించారు. ఆలయం పరిసరాల్లో పటిష్ట భద్రత, నిఘా ఉంచాలన్నారు. నేరాల నియంత్రణకు పాస్ లైన్, డివైస్లెవ్, స్కానర్స్ ను ఫింగర్ ప్రింట్స్ ను ఉపయోగించాలని ఆదేశించారు. ప్రతి సెక్టార్ సిసికెమెరాలతోబాటు ఈ సారి సోలార్ స్సి. * కెమెరాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు.

రద్దీ సమయాల్లో అత్యవసర సేవలకు రోప్పార్టీ సిబ్బంది సిద్ధంగా ఉండేలా చూడాలన్నారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా వారికి జియోట్యాగింగ్ వేయాలన్నారు. టిటిడి విజిలెన్స్ తో కలసి పోలీసులు సమన్వయంగా పనిచేసి విజయవంతం చేయాలని ఎస్సీ హర్షవర్ధన్ రాజు (SP Harshavardhan Raju) తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు రవిమనోహరా చారి. రామకృష్ణ, నాగభూషణం, డిఎస్పీ వెంకట నారాయణ, భక్తవత్సలం, శ్యామసుందర్, రామకృష్ణమాచారి, సిఐలు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-govt-whip-thangirala-soumya-continuous-focus-on-cultural-development-is-needed/andhra-pradesh/543075/

Brahmotsavams Breaking News command control rooms integrated checkposts latest news pilgrim safety sp harshavardhan raju Telugu News tirumala Venkateswara Swamy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.