News Telugu: అమరావతి, ఆంధ్రప్రదేశ్‌పై వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ ప్రచారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. వైసీపీ అధినేత జగన్ (Jagan)ను ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, చట్టం ముందు ఆయన తప్పనిసరిగా దోషిగా నిలవాల్సిందేనని హెచ్చరించారు.
అమరావతిపై కక్ష ఇంకా తీరలేదా?
అమరావతిని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే వైసీపీ తప్పుడు ప్రచారం (YCP’s false propaganda) చేస్తోందని లోకేశ్ మండిపడ్డారు. తమిళనాడులో జరిగిన ఘటనకు చెందిన వీడియోను తీసుకుని, అది అమరావతిలో జరిగిందంటూ ఫేక్‌గా ప్రచారం చేయించారని ఆయన ఆరోపించారు.
అమరావతి అందరిదీ
అమరావతి కేవలం ఒక ప్రాంతానికి చెందినది కాదని, అది అందరికి చెందినదని లోకేశ్ స్పష్టం చేశారు. ఇది బౌద్ధం పరిపుష్టి చెందిన పవిత్ర నేల అని, ఇక్కడ కులం, మతం, ప్రాంతానికి అతీతంగా ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారని గుర్తు చేశారు.
జగన్ కుతంత్రాలకు కాలం చెల్లింది
ప్రాంతాల మధ్య విభేదాలు, కులాల మధ్య కలహాలు, మతాల మధ్య విభజనలు సృష్టించి రాజకీయ లాభం పొందాలనే జగన్ రెడ్డి ప్రయత్నాలు ఇక సఫలం కావని లోకేశ్ వ్యాఖ్యానించారు. కులాల మధ్య కలహాలను రెచ్చగొట్టే కిరాయి మూకల ఆటను చట్టం తప్పక కట్టడి చేస్తుందని చెప్పారు. ఈ కుట్రల వెనుక జగన్ రెడ్డి నేరుగా ఉన్నారని లోకేశ్ ఆరోపించారు. ఆయనకు చట్టం ముందు తప్పించుకునే మార్గం లేదని, చివరికి దోషిగా నిలబడక తప్పదని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: