📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Hyderabad – కృష్ణా జలాల్లో 763 టిఎంసి వాటా తెలంగాణకివ్వండి

Author Icon By Rajitha
Updated: September 24, 2025 • 11:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మంత్రి ఉత్తమ్ కుమార్ Minister Uttam Kumar హైదరాబాద్ Hyderabad : కృష్ణా నదిలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్కు కేటాయించిన 1005 టిఎంసి నీటితోపాటు, గోదావరి నీటి మళ్ళింపు కారణంగా అదనంగా 45టిఎంసి కేటాయింపు కలుపుకొని తెలంగాణకు 763 టిఎంసిల (70 శాతం) న్యాయమైన వాటా రావాలని కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్ -2 ముందు తెలంగాణ ప్రభుత్వంవాదనలు వినిపించిందని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లయిస్ మంత్రి కాప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఢిల్లీలో కృష్ణ ట్రైబ్యునల్ చేపట్టిన మూడు రోజుల విచారణలలో భాగంగా తొలిరోజు విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసు చివరి దశకు చేరుకుందని, ఫిబ్రవరి నుండి తెలంగాణ తుది వాదనలు వినిపిస్తున్నదని ఉత్తమ్ చెప్పారు. ఈ విచారణలు సెక్షన్-3 రిఫరెన్స్ కింద జరుగుతున్నాయని, అన్ని పిటిషన్లు పూర్తయ్యాయని గత కొన్ని నెలలుగా సీనియర్ అడ్వకేట్ ఎస్.వైద్యనాథన్ తెలంగాణ తరఫున వాదనలు వినిపిస్తున్నారని తెలిపారు.

మంగళ, బుధ, గురువారాల్లో

ఆయనకు మంగళ, బుధ, గురువారాల్లో వాదనలు వినిపించడానికి సమయం కేటాయించబడిందని తెలిపారు. కృష్ణా ట్రైబ్యునల్ ముందు స్వయంగా నీటి పారుదల శాఖ మంత్రి హాజరుకావడం బహుశా దేశంలో ఇదే మొదటిసారి అయి ఉంటుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని ఎంతగానో సీరియస్గా తీసుకుంటుందో అర్థం అవుతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దే విధంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కెటాయించిన 1005 టిఎంసిల నీటిలో 811 టిఎంసిలు 75 శాతం నికరజలాలు ఆధారంగా, దీనికి తోడు 65 శాతం నికరజలాలు 49 టిఎంసిలు 65శాతం, సగటు ప్రవాహాల ఆధారంగా 145 టిఎంసిలు కేటాయించబడ్డాయి అదనంగా గోదావరి డైవర్షన్ ద్వారా 45 టిఎంసిలు ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు వాటా లభిస్తోంది.

Hyderabad

కృష్ణానదిలో 1050 టిఎంసిలు కేటాయించబడ్డాయి. సగటు ప్రవాహాల కంటే ఎక్కువగా వచ్చే నీటిని వినియోగించుకోవచ్చని కూడా స్వేచ్ఛ ఇచ్చారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇప్పుడు కొత్తగా నది పరివాహక ప్రాంతల ఆధారంగా వాటాను కోరుతోందని ఉత్తమ్ తెలిపారు, తెలంగాణ డిమాండ్ శాస్త్రీయమైనది, అంతర్జాతీయం నది చట్టాలకు అనుకూలమైందని అన్నారు. Hyderabad క్యాచ్మెంట్ ఏరియా, బేసిన్లోని జనాభా, కరవు ప్రాంతం విస్తీర్ణం, సాగు భూములు వంటి అంశాల ఆధారంగా లెక్కలు వేసి 75శాతం నికరజాలలాలలో 555 టిఎంసిలు, 65శాతం నికజలాలు 43 టీఎంసీలు, సగటు ప్రవాహాల నుండి 120 టిఎంసిలు, పోలవరం నుంచి కృష్ణా బేసిన్ అవతలికి తరలించే గోదావరి నీటి కారణంగా 45 టిఎంసిలు తెలంగాణకు మొత్తంగా 763 టిఎంసిలు రావాలని కోరుతున్నామని అన్నారు సగటు ప్రవాహాలపై మిగిలిన అదనపు నీటిని వినియోగించే స్వేచ్ఛ కూడా తెలంగాణదేనని ఆయన స్పష్టం చేశారు.

మోసం చేశారని

ఆంధ్రప్రదేశ్ తనకు కేటాయించబడిన 811 టీఎంసీలు పెద్ద భాగాన్ని బేసిన్ వెలుపలికి మళ్లించిందని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఇలాంటివి ఆపాలని, బదులుగా ప్రత్యామ్నాయ వనరులను వినియోగించాలని ట్రైబ్యునల్ ముందు తెలంగాణ విన్నవించుకుందని అన్నారు. అలా మిగిలిన నీటిని ప్రాంతాలలో వాడుకోవాలి. సగటు ప్రవాహాలపై మిగిలిన మొత్తం నీటిని వినియోగించే హక్కు తెలంగాణకే ఉందని, దీన్ని ట్రైబ్యునల్ ముందు బలంగా వాదిస్తామని అన్నారు. ఇది కేవలం ఒక డిమాండ్ మాత్రమే కాకుండా, దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిచేసే చర్య అని చెప్పారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 299 టీఎంసీలను తెలంగాణకే కేటాయిస్తూ, 512 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన ఒప్పందానికి అంగీకరించడం రైతులకూ, కరవు ప్రాంతాలకూ మోసం చేశారని ఉత్తమ్ అన్నారు. దాదాపు పది సంవత్సరాల పాటు బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని అంగీకరించింది.

అందుకే ఇప్పుడు ఆ ఫైలును మళ్లీ తెరిచి మొదటి నుంచి వాదనలు వినిపిస్తున్నాం. 299 టిఎంసిలు అంగీకరించిన గత ఒప్పందం, మేం కోరుతున్న 763 టిఎంసిల మధ్య వ్యత్యాసమే ఈ అన్యాయానికి నిదర్శనం,” అని అన్నారు. జలశక్తి మంత్రిత్వశాఖలో కూడా ఆ ఒప్పందం నమోదైనప్పటికీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా తిరస్కరించిందని చెప్పారు. పొరుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ రాజీపడబోదని అన్నారు కర్నాటకలో కాంగ్రెస్ ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో టిడిపి ఉన్నా, మహారాష్ట్రలో బిజెపి ఉన్నా, తెలంగాణ Telangana తన హక్కుల కోసం కఠినంగా పోరాడుతుంది. ఒక్క చుక్క నీళ్లను కూడా వదులుకోదు,” అని ధీమా వ్యక్తం చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడానికి సుప్రీంలో తేల్చుకొంటామని హెచ్చరించారు. ఎత్తు పెంచే కర్ణాటక యోచనను ఆయనతీవ్రంగా వ్యతిరేకించారు. ట్రైబ్యునల్న్యాయమూర్తి బ్రిజేష్ కుమార్ Brijesh Kumar నేతృత్వంలోని విచారణలో తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మేము మా వాదనలను అన్ని ఆధారాలతో సమర్పించాం. ఈ సారి తెలంగాణకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది,” అని ఉత్తమ్ అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలపై ఏమి డిమాండ్ చేస్తోంది?
తెలంగాణకు కృష్ణా నదిలో 763 టీఎంసీల (సుమారు 70%) న్యాయమైన వాటా ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.

ఈ డిమాండ్ వెనుక ప్రధాన కారణాలు ఏమిటి?
క్యాచ్‌మెంట్ ఏరియా, బేసిన్‌లో జనాభా, కరవు ప్రాంతాల విస్తీర్ణం, సాగు భూముల ఆధారంగా లెక్కలు వేసి తెలంగాణ తన వాటా 763 టీఎంసీలు రావాలని వాదిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Andhra Pradesh Breaking News hyderabad irrigation Krishna River Krishna tribunal latest news Telangana Telugu News Water Dispute

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.