📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

News Telugu: AP: UAE లోని తెలుగువారి అభివృద్ధికి తోడ్పడండి: సిఎం చంద్రబాబు

Author Icon By Rajitha
Updated: October 23, 2025 • 12:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: ఎపి లో భారీ అవకాశాలు – యుఎఇలోని తెలుగువారి అభివృద్ధికి తోడ్పడండి. దుబాయ్ (Dubai) లోని భారత్ ఎంబసి ప్రతినిధులతో సిఎం చంద్రబాబు చర్చలు విజయవాడ : ఏపీలో లాజిస్టిక్స్ రంగాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, యూఏఈ మధ్య పారిశ్రామిక బంధం బలపడేలా సహకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ప్రతినిధులతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంలో పలు అంశాలను వారితో ప్రస్తావించారు.. పెట్టుబడుల సాధనకు, నవంబర్ నెలలో జరిగే భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానాలు పలికేందుకు యూఏఈలో మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం సీఎం చంద్రబాబు దుబాయ్. చేరుకున్నారు. ఈ సందర్భంగా దుబాయ్, అబుదాబి దేశాల్లో భారత రాయబార కార్యాలయం ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. దుబాయ్ ఇండియన్ కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, అబుదాబిలోని ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్ తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.

Read also: AP Teachers: టీచర్లకు ‘టెట్’ రెండు రోజుల్లో నోటిఫికేషన్

AP: UAE లోని తెలుగువారి అభివృద్ధికి తోడ్పడండి: సిఎం చంద్రబాబు

AP: దుబాయ్ సహా యూఏఈ దేశాల్లోని వివిధ కంపెనీల వివరాలు, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా ఉంటుందనే అంశాలపై వారితో చర్చించారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, క్వాంటం కంప్యూటింగ్, పెట్రో కెమికల్స్, పోర్టులు, లాజిస్టిక్స్, ఏవియేషన్, ఇండస్ట్రియల్ పార్కులు, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్లు, ఆతిథ్య రంగం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీలో వనరులు, అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. గూగుల్ (Google) సంస్థ విశాఖలో అతిపెద్ద డేటా ఏఐ హబ్ 15 బిలియన్ డాలర్లతో పెట్టుబడులు పెడుతోందని సీఎం వారికి వివరించారు. ఏపీకి 1054 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ తీరప్రాంతంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు, హార్బర్లను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఏపీలో లాజిస్టిక్స్ రంగాన్ని అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్టు సీఎం వివరించారు. యూఏఈ దేశాల సావరీన్ ఫండ్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపైనా వారితో ముఖ్యమంత్రి చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ లో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా దుబాయ్ సహా వివిధ దేశాల కంపెనీలకు వివరించాలని ఎంబసీ ప్రతినిధులకు సీఎం సూచించారు. యూఏఈ ఏపీ పారిశ్రామిక బంధం ధృఢంగా ఉండేలా చూడాలని సూచించారు. ఇప్పటికే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ దేశాలకు చెందిన వివిధ సంస్థలు ముందుకు వచ్చిన నేపథ్యంలో ఏపీలో ఉన్న అవకాశాలను ఆయా దేశాల్లోని కంపెనీలకు వివరించాలని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇస్తోందని అన్నారు. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో సీఐఐతో కలిసి భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నామని… యూఏఈలోని వివిధ సంస్థలను ఆ సదస్సుకు ఆహ్వానిస్తున్నామని దుబాయిలోని భారత ఎంబసీ ప్రతినిధులకు సీఎం తెలిపారు. ప్రధాని మోదీ చొరవ వల్లే దేశంలో చాలా మార్పులు వచ్చాయని.. భారత్ ను పెద్ద ఎత్తున ఆయన ప్రమోట్ చేస్తున్నారని అన్నారు. గ్రీన్ ఎనర్జీ. ఫుడ్ పార్క్ లోనూ యూఏఈ నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అమర్నాధ్ తెలిపారు.

ఈ సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దుబాయ్ లోని అంతర్జాతీయ స్థాయి సంస్థలకు అవసరమైన టెక్నాలజీ నిపుణులను అందించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. యూఏఈలో తెలుగువాళ్లు ఉన్నారని… వారికి అవసరమైన సహకారాన్ని అందించాలని ఎంబసీ ప్రతినిధులను సీఎం చంద్రబాబు (chandrababu) కోరారు. దుబాయ్ లో తన పర్యటన చివరి రోజున తెలుగు డయాస్పోరా కార్యక్రమం నిర్వహించనున్నట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి దుబాయ్ కు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు స్థానిక తెలుగు ప్రజలు విమానాశ్రయానికి వచ్చి ఘనంగా స్వాగతం పలికారు. దుబాయిలో ఉన్న తెలుగు వారు.. ప్రత్యేకించి మహిళలు తెలుగు సంప్రదాయ దుస్తుల్లో వచ్చి ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం తెలియచేశారు. తనకు స్వాగతం పలకడానికి వచ్చిన వారిని సీఎం అప్యాయంగా పలకరించారు.

సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటన ఉద్దేశ్యం ఏమిటి?
ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడం, యూఏఈతో పారిశ్రామిక బంధం బలపరచడం, నవంబర్‌లో జరిగే భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానాలు ఇవ్వడం ఈ పర్యటన ఉద్దేశ్యం.

సీఎం ఎవరితో సమావేశమయ్యారు?
దుబాయ్ ఇండియన్ కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, అబుదాబి ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్ లతో సమావేశమయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Chandrababu Naidu dubai latest news Telugu News UAE

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.