📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Anantapur – రేపు ‘అనంత’లో ‘సూపర్ సిక్స్’

Author Icon By Rajitha
Updated: September 9, 2025 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనంతపురం : (Anantapur) జిల్లా కేంద్రమైన అనంతపురంలో రాష్ట్రస్థాయిలో సూపర్ సిక్స్ విజయోత్సవ సభను ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం నుంచి 3.5 లక్షల మందితో భారీ ఎత్తున నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం నేతలు భారీ సన్నాహాలు చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట లోపు ఉమ్మడి అనంతపురం (Anantapur) జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణకు కసరత్తు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ప్రత్యేక బాధ్యతలను మంత్రులు అప్పగించారు. ఏ నియోజకవర్గంలో ఎక్కడ వాహనాలు నిలపాలి, జనాన్ని ఎక్కడ తీసుకురావాలి అన్నది కూడా పక్క ప్లాన్ తో ఎమ్మెల్యేలకు మంత్రులు, ఇతర పార్టీ రాష్ట్ర స్థాయి ముఖ్యులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.

విజయోత్సవాలకు భారీ ఏర్పాట్లు

జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్ తో పాటు రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, రాంప్రసాద్ రెడ్డి, నారాయణ, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ (Satyanarayana) రాజు, తదితరులు అనంతపురంలోని తిష్ట వేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మంత్రులకు తోడు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రత్యేక బాధ్యతలు తీసుకొని ముందుకెళ్తున్నారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గు బాటి ప్రసాద్, కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, తదితర జిల్లా విజయోత్సవాలకు భారీ ఏర్పాట్లు సిఎం చంద్రబాబు, డి.సిఎం పవన్ రాక దారులకు ఇరువైపులా పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు మంత్రులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

News Telugu

సుమారు 5లక్షల మంది జనం తరలించే విధంగా

జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ జగదీష్ తదితర వివిధ విభాగాల జిల్లా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తు న్నారు. అనంతపురం శివారులోని శ్రీనగర్ కాలనీ ఎగువ భాగంలో అయ్యప్ప గుడి సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు భారీ ఎత్తున రేయి పగళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులతో పాటు పలువురు అధికారులు కూడా అక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. పెద్ద ఎత్తున స్టేజ్ నిర్మాణంతోపాటు జనం కోసం బారికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి పోలీసు అధికారులు కూడా చేరుకున్నారు. మంగళవారం నాటికి రక్షణ వలయంలోకి సభా ప్రాంగణం చేరుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో అనంతపురం నగరంలో ప్రధాన రహదారులు ఆటు ఇటు ఫ్లెక్సీలు నిండిపోయాయి. టిడిపి, జనసేన నేతలు పెద్ద ఎత్తున సీఎం చంద్రబాబు,(CM Chandrababu) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తదితర నాయకులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు కట్టారు. సభకు అనంతపురం సత్యసాయి ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 5లక్షల మంది జనం తరలించే విధంగా ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా గ్రామస్థాయి నుంచి బూతులు వారిగా వాహనాల ఏర్పాట్లు భోజన వసతి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

ప్రశ్న 1: ఈ సభ ఏ తేదీన జరగనుంది?
సమాధానం: సెప్టెంబర్ 10న జరగనుంది.

ప్రశ్న 2: ఈ సభకు ఎంతమంది హాజరుకావచ్చని అంచనా?
సమాధానం: సుమారు 3.5 లక్షల నుంచి 5 లక్షల మంది హాజరుకానున్నారు.

ప్రశ్న 3: సభ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు?
సమాధానం: అనంతపురం శివారులోని శ్రీనగర్ కాలనీ ఎగువ భాగంలో అయ్యప్పగుడి సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు.

Read hindi news:

Read Also:

https://vaartha.com/latest-news-congress-chief-sharmila-support-onion-farmers/andhra-pradesh/543657/

anantapur Coalition Government

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.