దేశవ్యాప్తంగా పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకాలు భారీగా పెరగనున్నాయి. ఇది కేవలం పన్నుల పెంపు మాత్రమే కాదు, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం సంధించిన ఒక శక్తివంతమైన అస్త్రం. ముఖ్యంగా యువతను, సామాన్యులను ఈ ప్రాణాంతక వ్యసనంనుండి దూరం చేయడమే లక్ష్యంగా ఈ నూతన పన్ను విధానం రూపొందించ బడింది. ఈ మార్పుల వల్ల సిగరెట్లు, గుట్కా, నశ్యం వంటి ఉత్పత్తుల ధరలు సామా న్యుడికి భారంగా మారనున్నాయి, తద్వారా వినియోగం తగ్గుతుందని నిపు ణులు భావిస్తున్నారు. రానున్న పన్నుల నూతన ముఖచిత్రం ఆలోచింప జేసేదిలా వుంది. ప్రస్తుత జీఎస్టీ పరిహార సెస్ స్థానంలో కేంద్రం నేరుగా ఎక్సైజ్ సుంకాలను ప్రవేశపెట్టింది. సిగరెట్ల పొడవు, వాటి నాణ్యత ఆధారంగా పన్ను రేట్లలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ఉదాహరణకు, 65 మిల్లీమీటర్ల లోపు ఉండే ఫిల్టర్ సిగరెట్లపై వేయి స్టిక్కులకు సుమారు 2,100 రూపాయల సుంకం విధిస్తుండగా, ప్రీమియంరకం సిగరెట్లపై అది 8,500 రూపాయల వరకు పెరిగింది. అంటే ఒక్కో సిగరెట్ ధరపై కనీసం రెండు నుండి ఐదు రూపాయల వరకు భారం పడే అవకాశం ఉంది. అదేవిధంగా గుట్కా వంటి ప్రమాదకర పదార్థాలపై 91శాతం, నమలడం ద్వారా తీసు కునే పొగాకుపై 82 శాతం సుంకం విధించడం గమనార్హం. దీనివల్ల మార్కెట్లో వీటి ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. ఇది ఒక రకంగా పొగాకు వినియోగదారుల కు ప్రభుత్వం ఇస్తున్న హెచ్చరిక వంటిదే. ప్రభుత్వ ప్రయత్నమల్లా వ్యసనం నుండి విముక్తి కోసమే అనేది గమనించాల్సిన సంగతి. పొగాకు (tobacco) వినియోగం అనేది కేవలం వ్యక్తిగత అలవాటు కాదు, అది ఒక సామాజిక జాడ్యం. భారతదేశంలో ఏటా లక్షలాది మంది క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలతో మరణి స్తున్నారు. ఒక ఇంట్లో సంపాదించే వ్యక్తి పొగాకు బారిన పడి అనారోగ్యానికి గురైతే, ఆ కుటుంబం మొత్తం ఆరికంగా, మానసికంగా చితికిపోతుంది.
Read Also: EPFO: ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక వెసులుబాటు
ప్రభుత్వం విధిస్తున్న ఈ అధిక పన్నులు ముఖ్యంగా విద్యార్థులు, యువతను దృష్టిలో పెట్టుకుని చేసినవి. తక్కువ ధరలో దొరికే ఉత్పత్తులకు అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసు కుంటున్న వేళ, ఈధరల పెంపు వారిని నియంత్రించగలదు. ధర పెరిగినప్పుడు కొనుగోలు శక్తి తగ్గుతుంది. తద్వారా కొత్తగా వ్యసనానికి లోబడే వారి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజారోగ్య రక్షణ కోసం, ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సాలయాల ఏర్పాటుకు, అవగాహన కార్యక్రమాలకు వినియోగించనుంది. పొగాకు (tobacco) వల్ల కలిగే నష్టాలను చికిత్స చేయడం కంటే, దాని వినియోగాన్ని నిరోధించడమే మేలని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది. ‘హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్’ పేరుతో వసూలు చేసే ఈ నిధులు దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి తోడ్పడతాయి. ఇది దీర్ఘకాలంలో దేశ ఉత్పాదకతను పెంచుతుంది. ఆరోగ్యవంతమైన పౌరులే దేశానికి నిజమైన సంపద అనేసూత్రాన్ని ప్రభుత్వం ఈ రూపంలో ఆచరణలో పెడుతోంది. ఈ పన్ను ల పెంపు వల్ల పొగాకు దిగ్గజ సంస్థల లాభాలపై ప్రభావం పడవచ్చు. కానీ ప్రభుత్వ ఉద్దేశం లాభాల కంటే ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యత ఇవ్వడం. పన్నుల ఎగవేతను అరికట్టడానికి యంత్రాల సామర్థ్యం ఆధారంగా పన్ను లెక్కించే విధానాన్ని తీసుకురావడం ఒక విప్లవాత్మక మార్పు. ఇది అక్రమ తయారీని అరికట్టడమే కాకుండా, మార్కెట్లో పారదర్శకతను పెంచుతుంది. గిరిజన, పేద కార్మికులు ఆధార పడి ఉన్న బీడీ పరిశ్రమపై సుంకాలను కనిష్టంగా ఉంచడం ద్వారా ప్రభుత్వం సామాజికసమతుల్యతను కూడా కాపా డింది. పొగాకు మహమ్మారిని దేశం నుండి తరిమికొట్టే ప్రయాణంలో ఫిబ్రవరి 1 నుండి అమలులోకి వచ్చే ఈ ఎక్సైజ్ సుంకాలు కీలక పాత్ర పోషించనున్నాయి. పౌరులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ధరలు పెరుగుదల ఒక మంచి సాకుగా మారుతుందని ఆశిద్దాం. పొగాకురహిత భారతమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రస్థానంలో ప్రతి ఒక్క రూ భాగస్వాములు కావాలి. డబ్బు కంటే ప్రాణం విలువైన దని గుర్తించి, ఈ విషపూరిత అలవాట్లకు స్వస్తి పలకడమే మనం దేశానికి ఇచ్చే నిజమైన గౌరవం.
-చిట్యాల రవీందర్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: