📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Anil Chauhan: భారత సముద్రతీర రక్షణకు నూతన శక్తి: అనిల్ చౌహాన్

Author Icon By Shobha Rani
Updated: June 19, 2025 • 11:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత నౌకాదళం అమ్ములపొదిలోకి మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ తయారుచేసిన యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్-షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ ‘అర్నాల’ను విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్‌లో ఘనంగా ప్రారంభించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ (Anil Chauhan) ఈ నౌకను లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
జనరల్ అనిల్ చౌహాన్ మాట్లాడుతూ..
ఈ సందర్భంగా జనరల్ అనిల్ చౌహాన్ (Anil Chauhan) మాట్లాడుతూ, ఒకప్పుడు ఆయుధాల కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారత్, ఇప్పుడు వాటిని స్వయంగా తయారుచేసే స్థాయికి ఎదిగిందని అన్నారు. సముద్ర జలాల్లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. దేశీయ పరిజ్ఞానంతో ఇప్పటివరకు 98 యుద్ధ నౌకలను నిర్మించామని, ఇందులో ఐఎన్ఎస్ విక్రాంత్ (Vikranth) వంటి విమాన వాహక నౌకలు, అణు జలాంతర్గాములు, ఫ్రిగేట్లు, కార్వెట్లు ఉన్నాయని వివరించారు. మరో 60 నౌకలు నిర్మాణ దశలో ఉండగా, 180 నౌకల నిర్మాణానికి ఒప్పందాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. కొత్తగా నౌకాదళంలో చేరిన ‘అర్నాల’ (Arnala) సవాళ్లను స్వీకరించగలదని, భారత తీర ప్రాంత రక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంధార్కర్, వార్‌షిప్ ప్రొడక్షన్ అండ్ అక్విజిషన్ కంట్రోలర్ వైస్ అడ్మిరల్ రాజారామ్ స్వామినాథన్, జీఆర్ఎస్‌ఈ సీఎండీ కమొడోర్ పి. హరి తదితరులు పాల్గొన్నారు.

Anil Chauhan: భారత సముద్రతీర రక్షణకు నూతన శక్తి: అనిల్ చౌహాన్

భవిష్యత్ నౌకలు: భారీ నిర్మాణ ప్రణాళికలు
ప్రస్తుతం 60 నౌకలు నిర్మాణ దశలో, 180 కొత్త నౌకల నిర్మాణ ఒప్పందాలు సిద్ధమవుతున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నౌకాదళాలలో భారత నౌకాదళాన్ని నిలబెడుతుంది. INS అర్నాల (Arnala) చేరికతో భారత నౌకాదళం తీర ప్రాంతాల్లో పటిష్టమైన పర్యవేక్షణ చేసే శక్తిని పొందింది. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న నౌకలు భారత రక్షణ వ్యవస్థను ఆత్మనిర్భర్ భారత్ దిశగా ముందుకు తీసుకెళ్తున్నాయి.

Read Also: Ambati Rambabu: అంబటి రాంబాబుపై కేసు నమోదు

#AtmanirbharBharat #IndianNavy #telugu News Anil Chauhan AnilChauhan Breaking News in Telugu Google news Google News in Telugu INSArnala Latest News in Telugu New strength for India's coastal defence: Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.