📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News: AP: బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం

Author Icon By Vanipushpa
Updated: October 23, 2025 • 4:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)పై అల్పపీడనాల ప్రభావం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండగా, రేపు మరో కొత్త అల్పపీడనం ఏర్పడనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ రెండు వాతావరణ వ్యవస్థల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. ఇది రానున్న 24 గంటల్లో దక్షిణ అంతర్గత కర్ణాటక వైపు కదులుతూ మరింత బలహీనపడనుంది. అయినప్పటికీ, దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు.

Read Also: Assembly: బాలకృష్ణ పై..జగన్ సంచలన వ్యాఖ్యలు

AP

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. తీరం వెంబడి గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలకు దూరంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలో మరో వాతావరణ మార్పు చోటుచేసుకోనుంది. దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని కారణంగా శుక్రవారం (రేపు) ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడనుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Bay Of Bengal cyclone alert IMD forecast Low Pressure Area Monsoon News Rainfall Prediction Telugu News Weather Update

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.