📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

New Labour Codes 2026: ఏపీలో కొత్త కార్మిక కోడ్లు

Author Icon By Tejaswini Y
Updated: February 20, 2026 • 11:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

New Labour Codes 2026: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కొత్త కార్మిక కోడ్ల అమలు ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ అభ్యంతరాలు, సూచనలు, అభిప్రాయాలను ఆహ్వానించింది. ఈ సంస్కరణలు కార్మిక చట్టలను సరళీకరించి ఆధునికీకరించడం లక్ష్యంగా చేపట్టి నవని శాఖ తెలిపింది. కార్మికుల హక్కులను రక్షిస్తూ, పరిశ్రమలకు సులభతరమైన వాతావరణం కల్పించడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం 29 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా సమీకరించింది.

Read Also:IndiaAI ImpactSummit: ఢిల్లీ ఎఐ సదస్సుకు సిఎం

New Labour Codes 2026

అవి- కోడ్ ఆన్ వేజెస్, 2019: ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, 2020: కోడ్ఆన్ సోషల్ సెక్యూరిటీ, 2020: ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్, 2020: ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, సాంకేతిక మార్పులు, మారుతున్న ఉపాధి విధానాలకు అనుగుణంగా ఈ కోడ్లు రూపొందించబడ్డాయి. అనేక చట్టాలను నాలుగు సమగ్ర కోడ్లుగా మార్చడం, సింగిల్ రిజిస్ట్రేషన్ (Single registration), సింగిల్ లైసెన్స్, సింగిల్ రిటర్న్ విధానం ద్వారా అనుసరణ భారాన్ని తగ్గించడం ముఖ్య లక్ష్యాలు. కనీస వేతనాలను అందరికీ వర్తింప జేయడం, వేతన రక్షణను బలోపేతం చేయడం, అసంఘటిత, గిగ్, ప్లాట్ఫాం కార్మికులకు సామాజిక భద్రత విస్తరించడం కూడా ఈ సంస్కరణల భాగం. డిజిటల్ వ్యవస్థలు, వెబ్ ఆధారిత తనిఖీలు ద్వారా పారదర్శకత పెంపు, కొన్ని నేరాలకు శిక్షణ సరళీకరణ, వివాదాల పరిషాఆనికి వ్యవస్థీకృత విధానాలు, కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమానికి మెరుగైన నిబంధనలు ఈ కోడ్లలో ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ రూలన్ను విడుదల

2025 డిసెంబర్ 30న కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ రూలన్ను విడుదల చేసింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, 2020, కోడ్ ఆన్ వేజెస్, 2019 కింద ప్రాథమకి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లు కార్మిక శాఖఅధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగులు, కార్మికులు, యజమానులు, ట్రేడ్ యూనియన్లు, పరిశ్రమ సంఘాలు, వృత్తి సంఘా లు, పౌర సమాజ సంస్థలు, సాధారణ ప్రజలు డ్రాఫ్ట్ నిబంధనలను పరిశీలించి, సూచించిన గడువులోగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కార్మిక శాఖ కోరింది.

అభ్యంతరాలు, సూచనలు లిఖితపూర్వకం గా కమిషనర్ ఆఫ్ లేబర్కు లేదా నోటిఫికేషన్ పేర్కొన్న అధికార ఇమెయిల్/ పోర్టల్ ద్వారా పంపవచ్చు. గడువులోగా వచ్చిన ప్రతిపాదనలను పరిశీ లించి తుది నియమాలు రూపొందిస్తామని అధికారులు తెలిపారు. కార్మికులు, పరిశ్రమలు ప్రయోజనా లను దృష్టిలో ఉంచుకుని సమతుల్యంగా అమలు చేయడమే ఈ సంప్రదింపుల లక్ష్యమని శాఖ స్పష్టం చేసింది. సూచనలు సమర్పించేందుకు చివరి తేదీ 15 మార్చి 2026 కాగా, కోడ్ ఆన్ వేజెస్, 2019కు సంబంధించిన సూచనలు సమర్పించేందుకు 30 మార్చి 2026ను గడువుగా నిర్ణయించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP Labour Department Central Labour Reforms Labour Codes New Labour Codes 2026 New Labour Laws

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.