📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu news : schemes: ధన ధాన్య సమృద్ధికి కొత్త యోచన

Author Icon By Sudha
Updated: October 13, 2025 • 4:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ దేశానికి కావల్సింది ఆహార భద్రతేకాదు. అహ రహం శ్రమించి దానిని పండించే రైతుకు ఆదాయ భరోసా కూడా అవసరమే. ఇందుకోసం ప్రభుత్వాలు ఎంతగా సంకల్పించినా ఎక్కడో అక్కడ వెనుకబాటుతనం వల్ల సఫలీకృతం కాలేకపోతోంది. వ్యవసాయ క్షేత్రంలో దిగగానే రైతుకు పెట్టుబడితోపాటు నేల స్వభావం, సాగు సౌలభ్యం, మంచి విత్తనం, పెట్టు బడి, మార్కెటింగ్ వంటి అన్ని అంశాలు ఎదురౌతాయి. కొన్ని అంశాల్లో ఇప్పటికే అందుబాటులోఉన్న సౌకర్యాలు అక్కరకొస్తాయి. మరికొన్ని వేధిస్తుంటాయి. దారి దొరకదు. అప్పుడే రైతు డీలాపడతాడు. వీటి విషయంలో రైతు ప్రభుత్వాల మీదనే ఆధారపడాల్సి వస్తుంది. ఒకవేళప్రకృతి బీభత్సాలు కలవరపెట్టినా ప్రభుత్వాలే ఆదుకోవాలి. ప్రస్తు తం సాధారణ పరిస్థితుల్లో వ్యవసాయానికి రైతుకు ఏమేమికావాలో తెలుసుకొని అందించేందుకు పూర్వ పరిస్థితు లకు భిన్నంగా రైతునాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతు విస్తృత ప్రయోజనాలు కాపాడ లేని ఎన్ని పథకాలు (schemes)న్నా అవి నిరర్థకమే. వ్యవసాయ రంగాన్ని పునస్సంఘటితం చేయడానికి తాజాగా ‘ప్రధాన మంత్రి ధన ధాన్య కృషియోజన పథకాన్ని(schemes) ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. రైతుకు నేరుగా ఆర్థిక, సాంకేతిక మద్దతు అందించగలిగితే రైతు కొంత తేలిక పడతాడనే ఆలోచన కావొచ్చు. ఈపథకాన్ని ప్రయో గాత్మకంగా దేశమంతటా 100జిల్లాలో అమలుకు సంక ల్పించింది. ముందుగా ఆయా జిల్లాలకు ఈపథక ప్రయోజనాలు, పర్యవసానాలు, చేకూరిన లబ్ధివంటి అన్ని అంశాలను క్రోడీకరించుకుని దశల వారీగా మిగిలిన జిల్లాలకు విస్తరించాలన్నది కేంద్రప్రభుత్వ లక్ష్యం. రైతు సాగు సుసంపన్నం కావాలంటే ఏమేమి కావాలో తెలియనిది కాదు. చేసేది సంప్రదాయ వ్యవసాయమైనా, సేంద్రియ వ్యవసాయమైనా ఏ ఇతర పరిపక్వత కలిగిన వ్యవసాయానికైనా కావాల్సిన ఉత్పాదకత వనరులన్నీ సర్వసాధారణమైవే. కానీ వాటిని సమాకూర్చుకునే అంశాలు మాత్రం దేనికైనా సమానంగా ఉంటాయి. ఎవరెన్ని చెప్పినా సాగు విధానాల సక్రమ అమలు, నిర్వహణ పర్యవేక్షణకు గ్రామ సీమలో చేపట్టడమే మేలని వంచి కేంద్రప్రభుత్వం జిల్లా కు 4గ్రామాలను ఎంపిక చేసుకుని అందులోనే ఈ ప్రక్షాళన కార్యక్రమాలను అమలు చేయతలపెట్టింది. ఈ పథకం (schemes)లో భాగంగా ఆ ప్రాంతాల్లోని రైతులకు నేరుగా నగదు సాయం, పెట్టుబడి ఖర్చుల్ని అందిస్తుంది. వారిని సతాయించకుండా ఎప్పటికప్పుడు రైతు అవసరం మేరకు విత్తనాలు, ఎరువులు, తదనుకూలంగా సాంకేతిక పరిజ్ఞానం అందిస్తుంది. దీనివలన మంచి దిగుబడి రాబట్టు వచ్చు. మార్కెటింగ్ సౌకర్యాలు ఏర్పరిచి, గోదాములు, రవాణా సౌకర్యాన్ని అభివృద్ధి చేసుకోగలిగితే మంచి ఆదాయం లభిస్తుంది. తొలిదశలో ఈరకం సాగు సంస్క రణలు రైతుల్లోకి వెళ్తాయి. ఇవన్నీ పాత అంశాలుగానే కనబడుతున్నా ఆధునిక సాగుసంస్కరణలతో వ్యవసాయాన్ని మరింత వేగవంతం చేసుకోవాల్సిందే. దీంతో వ్యవసా య ఉత్పాదకత పెరిగి దేశంలో ఆహారభద్రత ఏర్పడుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం ఏర్పడ్తుంది. దాదాపు 24 వేల కోట్లరూపాయల నిధులతో కనీసం ఆరు సంవత్స రాలపాటు అమలులో ఉండే పథకానికి రూపకల్పన చేశారు. తొలిదశలో తక్కువ పంట దిగుబడి, క్రెడిటొపొందడం లో సంక్లిష్టత ఉన్న సాగువృద్ధి కనిపించని జిల్లాలనే ఎం పిక చేయడం విశిష్టం.అన్నీ బాగున్న జిల్లాలనే మోడల్ జిల్లాలుగా ఎంపిక చేయకుండా నిర్దిష్ట లోపాలున్న జిల్లా లను ఎంపికచేయడం స్వాగతించదగిన విషయం. సుమారు 1.7కోట్ల రైతులు దేశం మొత్తంమీద ఈపథకం లబ్ధి దారులౌతారు. వారి అనుభవాలు, ఆర్థిక లబ్దిప్రయోజనాల ఆసరాగా దేశంలోని అందరు రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం కల్పించే విధంగా విస్తరిస్తారు. ఉత్పాదకత పెంపు, పంట విలిదీకరణ, స్టోరేజి వసతుల అభివృద్ధి, క్రెడిట్ సౌకర్యం పెంపు, నీటివసతుల సమీకరణ వంటి అంశాలు ఈ పథకంలో ప్రముఖంగా చోటు చేసుకుంటాయి. నాణ్యత కలిగిన విత్తనాలు, కల్తీలేని ఎరువులు, వ్యవసాయ పరిక రాలు, సాగుశిక్షణ సౌకర్యాలు కల్పించడం వలన ఉత్పాద కత పెరుగుతుంది. సాగు ఖర్చుతగ్గించడం కోసం ఆధు నిక యంత్ర పరికరాలు, నీటి వనరులు, సబ్సిడీలను తక్కువ వ్యయంతో అందించడం వంటివి ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. స్మార్ట్ ఫార్మింగ్ సెన్సర్లు, డ్రోన్ సర్వేలు వంటి ఆధునిక వ్యవ సాయ సాంకేతికతను రైతుకు చేరు వ చేస్తుంది. వ్యవసాయ ప్రాసెసింగ్, వడపోత కేంద్రాలు, ట్రాన్స్ పోర్టేషన్ వలన గ్రామీణ ఉపాధికి ఆస్కారమిస్తుంది. ఇవన్నీ ప్రణాళిక బద్ధంగా అమలు జరిగితే రైతు ఉత్పాద కత తద్వారా ఆదాయం పెరిగి కొనుగోలు శక్తి కలిగి గ్రామీణ మార్కెట్ అభివృద్ధి వీలవుతుంది. కోల్డోస్టోరేజీ, మార్కెట్ యార్డుల వంటి సౌకర్యాలు మెరుగుపడతాయి. లక్ష్యాల సాధనలో వ్యవసాయ సంబంధిత ప్రభుత్వశాఖల చిత్తశుద్ధి మాత్రమే ఈ పథకం విజయవంతం చేయగలు గుతుంది. ఈ పథకం కింద నిర్దేశించబడిన అన్నివనరులు, వసతులు లక్ష్యాల ను క్రమపద్ధతిలో సమన్వయపరుచు కుంటేనే సత్ఫలితాలు వస్తాయి. పంట దిగుబడులు 15 నుంచి 30శాతం పెంపు, రైతుల వార్షిక ఆదాయం 20 నుంచి 40శాతం పెరుగుతుందని అంచనా. 25 శాతం మేరకు నీటివనరుల సమర్థ వినియోగం, 60శాతం మేరకు గ్రామీణ ఉపాధి సృష్టి రైతు ఉత్పత్తుల మార్కెటింగ్ సౌక ర్యం పెంపువంటి లక్ష్యాలు ఘనంగానే రూపొందించారు. ఇవన్నీ సానుకూలపడాలంటే ప్రభుత్వశాఖల సమన్వయం, పథకం అమలులో చిత్తశుద్ది అవసరం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Agriculture Development Breaking News Dhan Dhanya Government Schemes Indian Economy latest news Rural Prosperity Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.