📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News Telugu : Nepali protest -నేపాల్ నుంచి తెలుగువారు వెనక్కి

Author Icon By Digital
Updated: September 11, 2025 • 3:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాల్ నుంచి తెలుగువారు వెనక్కి

Nepali protest : నేపాల్ నుంచి తెలుగువారు వెనక్కి వారి సమాచారం సేకరణ, భద్రతపై అధికారులకు మంత్రి లోకేష్ దిశానిర్దేశం. అక్కడివారితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి రాష్ట్రానికి సురక్షితంగా తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. నేపాల్ నుంచి బీహార్ మీదుగా 22 మంది ప్రయాణం చేస్తున్నారు. కఠ్మాండు నుంచి విజయవాడ, విశాఖకు ప్రత్యేక విమానాల్లో తరలింపునకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కఠ్మాండు నుంచి బీహార్ మీదుగా ప్రత్యేక బస్సులో వస్తున్న 22 మంది తెలుగువారు. నేపాల్లోని తెలుగువారితో వీడియో కాల్ మాట్లాడిన మంత్రి లోకేష్ (Minister Lokesh)వారికి ధైర్యం చెప్పారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకరావడమే ఏకైక అజెండా అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.ఈ మేరకు అధికారులు సమన్వయంతో వ్యవహరించి అవసరమైన చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. నేపాల్ లో చిక్కుకున్న పలువరు తెలుగువారితో మంత్రి లోకేష్ ఫోన్, వీడియో కాల్ ద్వారా మాట్లాడి వారిలో భరోసా నింపారు. నేపాల్లో చిక్కుకున్న వారిని తిరిగి స్వస్థలానికి తీసుకురావడంపై దృష్టి సారించిన మంత్రి, అనంతపురం పర్యటనను రద్దు చేసుకున్నారు. హుటాహుటిన సచివాలయానికి చేరుకుని, రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్ రూమ్ లో సంబంధిత అధికారులతో సమన్వయం కొనసాగించారు అవుతున్నారు.ఆయనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సమీక్ష నిర్వహిస్తున్నారు. నేపాల్ లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై ఆర్టీజీఎస్ కేంద్రంలో ఏపీ భవన్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష కొనసాగిస్తున్నారు.

Telugu people return from Nepal

నేపాల్ లో ఇప్పటివరకు 215 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు సమాచారం ఉందని ఈ సందర్భంగా అధికారులు లోకేష్కు వివరించారు. వీరంతా నేపాల్ లోని వివిధ ప్రదేశాల్లో సురక్షితంగా ఉన్నారని, వీరితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. నేపాల్ లోని బఫాల్, సిమిల్ కోట్, పశుపతి నగరం, పింగలస్థాన్ లో వీరంతా ఉన్నారని వివరించారు.ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని వివిధ మార్గాల ద్వారా సంప్రదించి, కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. వారికి ఆహారం, భద్రతకు సంబంధించి ప్రతి రెండు గంటలకు ఒకసారి మానిటరింగ్ చేయాలని ఆదేశించారు.

నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారు రాష్ట్రంలోని ఏయే ప్రాంతాలకు చెందిన వారు, వారి సమగ్ర వివరాలతో కూడిన సమాచారాన్ని సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నెంబర్లను అందుబాటులో ఉంచి, కలెక్టర్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు.ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సప్ నంబర్ ఏర్పాటు చేయించి పరిస్థితిని క్షణక్షణం సమీక్షిస్తున్నారు. నేపాల్లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం నేపాల్లో 187 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

వీరంతా నేపాల్ లోని నాలుగు ప్రాంతాల్లో ఉన్నారని సమాచారం. బఫాల్లో 27 మంది శ్రీధరాచార్యుల పర్యవేక్షణలో ఉండగా, సిమిల్ కోట్లో కారి అప్పారావు వద్ద 12 మంది ఉన్నారు. పశుపతి నగరంలోని మహదేవ్ హోటల్ వద్ద విజయ పర్యవేక్షణలో 55 మంది, గౌశాలలోని పింగలస్థాన్లో 90 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.నేపాల్లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవకు ఇప్పటికే పరిస్థితిని వివరించారు. ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్ర ప్రజల భద్రతే ప్రాధాన్యమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కేంద్ర ఏజెన్సీలు, భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేస్తూ చిక్కుకున్న వారి కుటుంబాలకు భరోసా ఇస్తున్నారు. చిక్కుకుపోయిన వ్యక్తుల బంధువులు ఢిల్లీలోని ఏపీ భవన్ను 9818395787 నంబర్లో కూడా సంప్రదించవచ్చు. నేపాల్ నుండి ప్రతి తెలుగు వ్యక్తిని తిరిగి తీసుకురావడం మా బాధ్యతని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. వస్తువులు పోగొట్టుకుంటే, తాత్కాలిక పాస్పోర్టును మేము సులభతరం చేస్తాము. ప్రతి వ్యక్తిని వారి సొంత జిల్లాలో సురక్షితంగా దింపాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆదేశించారని వివరించారు.

ఈ సాయంత్రం నాటికి ఖాట్మండు విమానాశ్రయం తిరిగి ప్రారంభమవుతుందని, ఆ తర్వాత విజయవాడ, విశాఖపట్నంకు తరలింపు విమానాలను ఏర్పాటు చేస్తామని అధికారులు వివరించారు. నేపాల్ లో చిక్కుకున్న విశాఖకు చెందిన సూర్యప్రభతో వీడియో కాల్ మాట్లాడిన మంత్రి లోకేష్.. సమీక్ష సందర్భంగా నేపాల్ లో చిక్కుకున్న పలువురు తెలుగువారితో మంత్రి నారా లోకేష్ ఫోన్, వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.ఈ సందర్భంగా విశాఖకు చెందిన సూర్యప్రభతో మాట్లాడిన మంత్రి లోకేష్.. నేపాల్ లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారని, అక్కడ అందబాటులో ఉన్న సౌకర్యాలపై మంత్రి వాకబు చేశారు. తాము ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి నేపాల్ లో చిక్కుకుపోయామని, ప్రస్తుతం ఓ హోటల్ లో సురక్షితంగా ఉన్నామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండాలని, బయటకు రావొద్దని, ప్రతి రెండు గంటలకు అధికారులు మీతో సంప్రదిస్తారని భరోసా ఇచ్చారు. కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి సురక్షితంగా తీసుకువస్తామని వారిలో ధైర్యం నింపారు.

ఏపీ భవన్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. నేపాల్ పర్యటనకు వెళ్లి ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు కారణంగా చిక్కుకుపోయిన తెలుగు ప్రజలకు తక్షణ సాయం అందించడానికి ఏపీ ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. నేపాల్ లో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న తెలుగు వారు +91 98183 95787 నంబర్లో నోడల్ అధికారి సురేష్ ను సంప్రదించవచ్చునని ఓ ప్రకటనలో పేర్కొంది. సీఎం చంద్రబాబు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు అక్కడి తాజా పరిస్థితులపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రితో నిరంతరం సంప్రదిస్తున్నట్లు తెలియజేసింది. అక్కడ తెలుగువారు చిక్కుకుపోయినట్లు తెలిసిన వెంటనే రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ నేపాల్లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవతో మాట్లాడారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి సహాయార్థం మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మానిటరింగ్ కోసం విజయవాడ కంట్రోల్ రూమ్ కు మంత్రి దుర్గేష్ రానున్నారు.

నేపాల్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలుగువారికి అండగా నిలవాలని మంత్రి దుర్గేష్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. డిప్యూటీ సీఎం ఆదేశాల నేపథ్యంలో అనంతపురం పర్యటనను రద్దు చేసుకొని విజయవాడకు తిరుగుప్రయాణమైన మంత్రి దుర్గేష్.. నేపాల్ లో ఇరుక్కుపోయిన తెలుగు విద్యార్థులను ఏపీకి రప్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.నేపాల్నుంచి తెలుగువారిని ఏపీ రప్పించేందుకు మంత్రి లోకేష్ నిర్వహించిన దౌత్యం ఫలిచింది. 12 ప్రదేశాల్లో చిక్కుకున్న 217 మందిని సురక్షితంగా రాష్ట్రానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలివిడతగా నేపాల్ లోని హెటౌడా నుంచి 22మంది తెలుగుపౌరులను సురక్షితంగా బీహార్ బార్డర్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మిలటరీ సాయంతో హెటౌడా నుంచి 58 కి.మీ దూరంలో ఉన్న బీహార్ బోర్డర్ మోతిహరికి తెలుగుపౌరులు బయలుదేరారు. బీహార్ లోని మోతిహరి నుంచి తెలుగు పౌరులను రాష్ట్రానికి తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

నేపాల్ లో చిక్కుకున్న 217 మందిలో 118 మంది మహిళలు కాగా, 99 మంది పురుషులు ఉన్నారు. విశాఖపట్నం వాసులు 42 మంది. విజయనగరం 34 మంది. కర్నూలుకు చెందిన వారు 22 మంది కాగా, మిగిలిన వారు ఇతర జిల్లాలకు చెందిన వారు. తమను క్షేమంగా తరలిస్తున్న మంత్రి లోకేష్ కు తెలుగు ప్రజలు తెలిపారు. నేపాల్లో చిక్కుకున్న 217 మంది పౌరుల్లో 173 మంది ఖాట్మాండూ పరిసరాల్లోని హోటళ్లలో తలదాచుకున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ లోకేష్ తో పాటు నేపాల్లో చిక్కుబడిన తెలుగువారికి ధైర్యం చెప్పి భరోసాను ఇచ్చారు.

Read More : AP Govt-ఏపీలో యువతకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగాలు..

https://vaartha.com/ap-govt-free-training-and-jobs-for-youth-in-ap/andhra-pradesh/545259/

Google News in Telugu Nepali protest Nepali protest today Paper Telugu News Telugu News Paper నేపాల్ News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.