Nellore: నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్.పి. డా. అజిత వేజెండ్ల తెలిపారు. మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించబడనున్నాయని, జిల్లాలో మొత్తం 176 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నట్లు ఎస్పీ తెలిపారు.పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ తరఫున అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయడంతో పాటు, పరీక్ష పేపర్లు కేంద్రాలకు తరలించే సమయంలోనూ సమాధాన పత్రాలను తిరిగి తరలించే సమయంలోనూ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Read Also: Gas Cylinder Theft: ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం
పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది
పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు, పరీక్షలకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతరులు ఉండరాదని ఎస్పీ గారు స్పష్టం చేశారు. అలాగే పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రతి పరీక్షా కేంద్రంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా పోలీస్ అధికారులు పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని ఆమె ఆదేశించారు.పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరగడానికి ఇతర శాఖల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేశామని, మొబైల్ పెట్రోలింగ్ బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం పర్యవేక్షణ చేస్తాయని తెలిపారు.
పరీక్షల సమయంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎస్పీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థులు పరీక్షా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి హాజరు కావాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా ఏ పరీక్షా కేంద్రం వద్ద అయినా ఎటువంటి చిన్న ఘటన జరిగిన వెంటనే 100 / 112 కు లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9392903143 కు సమాచారం అందించాలని ఎస్పీ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: