నెల్లూరు : నెల్లూరు (Nellore) నగరంలోని మైపాడు గేట్ సెంటర్ ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ వేంచేసి ఉన్న భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి తెప్పోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ (P.Narayana) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జ్యోతి ప్రజ్వలన చేసి తెప్పోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు.
Read also: AP: అమరావతి రెండో దశ పూలింగ్ ఒకేచోట లేఅవుట్
భక్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. సర్వాలంకార భూషితులైన స్వామి, అమ్మవార్లు రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై కొలువుదీరారు. (Nellore) మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారు కాలువలో జలవిహారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ మనోహర దృశ్యాన్ని తిలకించడానికి సుమారు లక్ష మందికి పైగా భక్తులు తరలిరావడంతో మైపాడు గేట్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014లో తాను మంత్రిగా, అబ్దుల్ అజీజ్ మేయర్గా ఉన్న సమయంలోనే స్థానికుల కోరిక మేరకు ఈ ఘాటు అభివృద్ధి చేసినట్లు గుర్తుచేశారు.
భక్తుల సౌకర్యార్థం కాలువకు ఇరువైపులా అత్యాధునిక సౌకర్యాలతో పార్కును అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, నుడ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఇంచార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, నారాయణ విద్యాసంస్థల జియం విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్ళపాక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు స్థానిక టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు..
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: