📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Nellore: గురువు ప్రాణాలు కాపాడిన శిష్యుడు.. అసలేం జరిగింది?

Author Icon By Anusha
Updated: February 7, 2026 • 12:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల కాలంలో గుండెపోటుతో సంభవిస్తున్న మరణాలు సమాజాన్ని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఒకప్పుడు వృద్ధులు, సీనియర్ సిటిజన్లకే పరిమితమై ఉండే గుండె సంబంధిత సమస్యలు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరినీ వెంటాడుతున్నాయి. ఉద్యోగాలు చేసే యువకులు, రోజూ స్కూల్‌కు వెళ్లే చిన్న పిల్లలు కూడా అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. అప్పటి వరకు పూర్తి ఆరోగ్యంగా, యాక్టివ్‌గా కనిపించిన వ్యక్తులు ఉన్నట్టుండి కుర్చీలోనే కూలిపోవడం చూస్తే ఎవరికైనా భయం వేయక మానదు.

Read Also: AP: నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది

అయితే గుండెపోటుతో ఇబ్బందిపడేవారిని చివరి నిమిషంలో ప్రాణాలు నిలబెట్టేందుకు సీపీఆర్ చాలా కీలకం. ఈ క్రమంలో ప్రభుత్వాలు కూడా సీపీఆర్‌ ఎలా చేయాలో పిల్లల నుంచి పెద్దల వరకు శిక్షణ కూడా ఇస్తున్నారు. స్కూల్స్, కాలేజీల్లో కూడా శిక్షణ అందించారు. తాజాగా ఓ స్కూల్‌లో టీచర్‌కు గుండెపోటు రాగా.. విద్యార్థి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు.. నెల్లూరు జిల్లా (Nellore) ఉదయగిరి మండలం గండిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో కుమ్మిత చిన్నమాలకొండారెడ్డి తెలుగు ఉపాధ్యాయుడు. శుక్రవారం ఉదయం స్కూల్‌లో ప్రార్థన తర్వాత విద్యార్థులు, టీచర్లు క్లాస్‌రూమ్‌లలోకి వెళుతున్నారు.

Nellore: The disciple who saved the life of the teacher.. What really happened?

అదే సమయంలో తెలుగు టీచర్ చిన్నమాలకొండారెడ్డి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే గమనించిన పదో తరగతి విద్యార్థి కిరణ్ సిద్ధార్థ్ అలర్ట్ అయ్యాడు.. వెంటనే టీచర్‌కు సీపీఆర్ చేశాడు. అయితే వెంటనే చిన్నమాలకొండారెడ్డి తేరుకుని ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.ఆ వెంటనే టీచర్‌ను 108 వాహనంలో ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం చిన్నమాలకొండారెడ్డి మెరుగైన టీట్ర్మెంట్ కోసం నెల్లూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.. అక్కడ వైద్యం అందిస్తున్నారు. స్కూల్‌లో సీపీఆర్ చేసి ఉపాధ్యాయుడి ప్రాణాలు కాపాడిన విద్యార్థి వెంకట కిరణ్ సిద్ధార్థ్‌‌పై ప్రశంసలు కురిపంచారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

CPR importance Heart attack awareness latest news Nellore Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.