నెల్లూరు(Nellore) జిల్లాలో మూడు మండలాలను తిరుపతి జిల్లాలో చేర్చే ప్రభుత్వం నిర్ణయం భారీ వివాదానికి తావిచ్చిందని, ఈ నిర్ణయం జిల్లాల మధ్య పగదాడులకు, నీటి యుద్ధాలకు దారి తీస్తుందని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్దన్రెడ్డి(Kakani Govardhan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, జిల్లాల పునర్విభజన పేరిట చంద్రబాబు నెల్లూరులో చిచ్చు రేపుతున్నాడు. ప్రజలను మోసం చేసే నిర్ణయాలకు వెంటనే తెరదించాలని స్పష్టం చేశారు.
Read Also: Kollu Ravindra: పేదలకు అండగా కూటమి ప్రభుత్వం
తిరుపతిలో కలపాలని డ్రాఫ్ట్ నోటీఫికేషన్
ఎన్నికల ముందు గూడూరును నెల్లూరులో కలుపుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక మాట మార్చడమే కాకుండా, ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో ఉన్న రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను తిరుపతి(Tirupathi)లో కలపాలని డ్రాఫ్ట్ నోటీఫికేషన్ జారీ చేయడం ప్రజల ఆవేదనకు కారణమైందని పేర్కొన్నారు. జిల్లాల మధ్య నీటి యాజమాన్య హక్కులు కలగలిసిపోయి, సోమశిల- కండలేరు వ్యవస్థలో నీటి విడుదలపై కొత్త వివాదాలు మొదలవుతాయి. నెల్లూరు రైతులు రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులకు గురవడం ఖాయమని హెచ్చరించారు.
వైఎస్ జగన్ ప్రభుత్వంలో భౌగోళిక పరిస్థితులు, ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని పార్లమెంట్ వ్యవస్థ ఆధారంగా 26 జిల్లాలు ఏర్పాటు చేశామని, అదే సమయంలో వెంకటగిరి నియోజకవర్గం(Venkatagiri Constituency)లోని మూడు మండలాలను నెల్లూరులో చేర్చి ప్రజా ప్రయోజనాలను కాపాడామని గుర్తు చేశారు. అప్పటి నిర్ణయంలో ప్రజల ప్రయోజనం ఉంది. కానీ ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంలో స్పష్టమైన రాజకీయ దురుద్దేశం మాత్రమే కనిపిస్తోందని అన్నారు. ప్రజలా జీవితాలతో ఆడుకోవడం చంద్రబాబుకే సరిగ్గా తెలిసిన పని ఆరోపించారు. ఎన్నికలకు ముందు గూడూరును నెల్లూరులో కలుపుతామని ఇచ్చిన హామీపై కూడా కాకాణి ప్రశ్నలు లేవనెత్తారు.
గూడూరు నియోజక వర్గంపై చంద్రబాబు
గూడూరు నియోజక వర్గంపై చంద్రబాబు ఎందుకు సవతి ప్రేమ చూపిస్తున్నాడు..? ఇచ్చిన మాట నీట మూటలా..? అని మండిపడ్డారు. రాపూరు, కలువాయి, సైదాపురం మండలాల కలయికను. వెంటనే రద్దు చేయాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గూడూరు. నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపాలని డిమాండ్ చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: