Nellore: ‘డయల్ యువర్ యస్.పి.’ (SP- సంపర్క్) పోలీస్ సిబ్బంది గ్రేవియన్స్ కార్యక్రమం జిల్లా యస్.పి. అజిత వేజెండ్ల పర్యవేక్షణలో జరిగింది. జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ, వారి సమస్యలను నేరుగా తెలుసుకునే ఉద్దేశ్యంతో ‘డయల్ యువర్ యస్.పి.’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం 3 నుండి 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీసు సిబ్బంది తమ విధుల మధ్యలో పోలీసు కార్యాలయానికి వచ్చి సమస్యలు తెలియజేయడానికి సమయం వృధా కాకుండా, నేరుగా జిల్లా యస్.పి. తో ఓపెన్ ఫోన్ లైన్ ఫోన్ ద్వారా మాట్లాడే అవకాశాన్ని కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమన్నారు.
Read Also: YCP : కూటమి ప్రభుత్వంపై మరోసారి రోజా కీలక వ్యాఖ్యలు
సిబ్బందికి భరోసా
‘SP- సంపర్క్.’ కార్యక్రమంలో భాగంగా 11 మంది సిబ్బంది ఎస్పీకి ఫోన్ ద్వారా తమ సమస్యలను నేరుగా తెలిపారు.ఆమె పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో నేరుగా ఫోన్ లో మాట్లాడి, వారి వ్యక్తిగత బదిలీలు, సెలవుల మంజూరు, పెండింగ్ మెడికల్ మరియు ఇతర బిల్లులు, హౌసింగ్, ప్రమోషన్స్, అడ్మినిస్ట్రేషన్ సంబంధిత సమస్యలను తెలుసుకొని, సాధ్యాసాధ్యాలు పరిశీలించి, వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపుతానని సిబ్బందికి భరోసా కల్పించారు.సిబ్బంది తెలిపిన సమస్యలపై సానుకూలంగా స్పందించిన యస్.పి. తక్షణమే పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత జిల్లా పోలీసు కార్యాలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఫీల్డ్ లో పని చేసే ప్రతి పోలీసు వెనుక, తన శాఖ ఉందన్న నమ్మకంతో విధులు నిర్వహించాలన్నారు. ‘డయల్ యువర్ యస్.పి.’ కార్యక్రమం ద్వారా పోలీసు సిబ్బంది సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపుతామని యస్.పి.స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి.(అడ్మిన్) CH. సౌజన్య , SB డిఎస్పీ శ్రీనివాస రావు, AO చంద్రమౌళి , A-సూపరింటెండెంట్ సురేష్, B సూపరింటెండెంట్ మస్తాన్ రావు, P సూపరింటెండెంట్ శిరీష, SB-2 ఇన్స్పెక్టర్ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: