📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Cricket Betting Racket: నెల్లూరు అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ ఛేదన

Author Icon By Siva Prasad
Updated: March 3, 2026 • 11:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Cricket Betting Racket: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను బాలాజీనగర్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఒక మోసం కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఈ రాకెట్ వెనుక ఉన్న అంతర్జాతీయ లింకులు బయటపడటం సంచలనం రేపింది. ఈ వివరాలను నెల్లూరు టౌన్ అదనపు ఎస్పీ (ASP) దీక్ష మంగళవారం వెల్లడించారు.

Read Also: Bhogapuram Vijayawada Airport: శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష

మోసం కేసుతో మొదలైన దర్యాప్తు

నగరానికి చెందిన ఒక వ్యక్తికి అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి సుమారు రూ. 53 లక్షలు వసూలు చేసి, తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా ఈ అంతర్జాతీయ బెట్టింగ్ నెట్‌వర్క్‌ను గుర్తించారు.

Cricket Betting Racket: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి బెట్టింగ్ కింగ్ దాకా..

బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన పొడపాటి మహేష్ బాబు అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జల్సాలకు అలవాటు పడి ఈ రాకెట్‌కు సూత్రధారిగా మారాడు. విదేశీ వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతూ ‘రాధే ఎక్స్చేంజ్’ (Radhee Exchange – R777) అనే యాప్ ద్వారా 30% వాటాతో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే వేణు, వెంకటరమణ అనే నిందితులను అరెస్ట్ చేయగా, తాజాగా మహేష్ బాబు అనుచరుడు పొడపాటి హరికృష్ణను అదుపులోకి తీసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు

కఠిన చర్యలు తప్పవు: ఏఎస్పీ హెచ్చరిక

క్రికెట్ బెట్టింగ్, జూద కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ దీక్ష హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి మోసపూరిత ప్రకటనలు నమ్మి మోసపోవద్దని, అనుమానిత సమాచారం ఉంటే డయల్ 112కు తెలియజేయాలని కోరారు. ఈ కేసును ఛేదించిన సీఐ సాంబశివరావు, ఎస్సై విజయ్ శ్రీనివాస్ మరియు బృందాన్ని ఏఎస్పీ అభినందించారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

ASP Deeksha Balaji Nagar Police Cricket Betting Racket Cyber Crime Nellore International Cricket Betting Nellore Betting Racket Radhee Exchange App Software Engineer Arrested

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.