📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Nellore Nawabpet Crime News: నెల్లూరు వివాహిత హత్య కేసులో నిందితుడు అరెస్ట్

Author Icon By Siva Prasad
Updated: February 9, 2026 • 9:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nellore Nawabpet Crime News: నెల్లూరు నగరంలోని నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు రోజుల కిందట జరిగిన బండి జయలక్ష్మి (39) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని సోమవారం అరెస్టు చేసినట్లు నగర ఏఎస్పీ దీక్ష వెల్లడించారు.

Read Also: Nellore SP Ajitha Vejendla: ఎస్పీకి వినతుల వెల్లువ

అక్రమ సంబంధమే హత్యకు కారణం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తడికల బజార్ సెంటర్‌కు చెందిన బండి జయలక్ష్మి తన భర్తతో విడిపోయి కుమార్తెతో కలిసి నివసిస్తోంది. తన కుమార్తెను మేనల్లుడైన తలపల కుమార్ కు ఇచ్చి వివాహం చేయాలనే ఉద్దేశంతో అతడిని కూడా తన ఇంట్లోనే ఉంచుకుంది. అయితే, ఈ క్రమంలో జయలక్ష్మి, కుమార్ మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది.

Nellore Nawabpet Crime News: The accused in the Nellore married woman’s murder case has been arrested.

గొడవకు దారితీసిన అంత్యక్రియల అంశం

ఇటీవల కుమార్ తల్లి మరణించగా, అంత్యక్రియలకు వెళ్లేందుకు అతడు ప్రయత్నించాడు. అయితే జయలక్ష్మి అతడిని వెళ్లకుండా అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అప్పటి నుండి వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 6వ తేదీన కుమార్ తన పెదనాన్న ఇంటికి వెళ్లి రావడాన్ని జయలక్ష్మి తప్పుబట్టి నిలదీసింది.

Nellore Nawabpet Crime News: మద్యం మత్తులో విచక్షణారహిత దాడి

ఈ గొడవ సమయంలో ఇప్పటికే మద్యం మత్తులో ఉన్న కుమార్ ఆవేశంతో కత్తి తీసుకుని జయలక్ష్మిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన జయలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

పోలీసుల గాలింపు.. నిందితుడి అరెస్టు

జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు, ఏఎస్పీ దీక్ష పర్యవేక్షణలో నవాబుపేట సీఐ వేణుగోపాల్ రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, సోమవారం ప్రశాంతినగర్ సమీపంలో కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ వేణుగోపాల్ రెడ్డిని, ఇతర పోలీసు సిబ్బందిని ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP News ASP Deeksha Jayalakshmi Murder Nellore latest news Nawabpet Murder Case Nellore Crime News Nellore Latest Police Updates. Nellore Nawabpet Crime News: నెల్లూరు వివాహిత హత్య కేసులో నిందితుడు అరెస్ట్ Nellore Nawabpet Police

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.