ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ యొక్క ఆదేశానుసారం నెల్లూరు జిల్లా(Nellore) వైద్య ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో హెచ్ఐవి తో జీవిస్తున్న మరియు హెచ్ఐవి ప్రభావితమైన పిల్లలతో శుక్రవారం నెల్లూరు పొదలకూరు రోడ్ లోని సీ ఎస్ సీ కార్యాలయ మీటింగ్ హల్ లో సమావేశం జరిగింది .
Read Also: AP Liquor : మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!
జిల్లా లె ప్ర సి ఎయిడ్స్ మరియు టిబీ నివారణాధికారి(Nellore) డాక్టర్.Sk. ఖాదరవలి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో , హెచ్ఐవి తో జీవిస్తున్న మరియు హెచ్ఐవి ప్రభావితమైన పిల్లల యొక్క సమస్యలు మరియు అవసరాలు గురించి చర్చించారు . ఈ సమావేశానికి ముఖ్యఅథిధులుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి Dr సుజాత , స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ హేనా సుజన్ , డిప్యూటీ డిఇఓ నాయక్ , ఏ ఆర్ టి డాక్టర్ గోపికృష్ణ , పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో , డి ఎం అండ్ హెచ్ ఓ వి . సుజాత , డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ ఎస్ కే . ఖాదర్ వలీ హెచ్ఐవి తో జీవిస్తున్న మరియు హెచ్ఐవి ప్రభావితమైన పిల్లల యొక్క సమస్యలు మరియు అవసరాలు అన్నీ విని , సంబంధిత వివిధ విభాగాల వారితో చర్చించి వారి సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు . ఈ సమావేశంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం సిబ్బంది , స్వచ్చంద సంస్థలు పాల్గొన్నారు .
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: