📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Electricity Contract Workers Protest: కలెక్టరేట్ ఎదుట విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా

Author Icon By Siva Prasad
Updated: February 27, 2026 • 11:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Electricity Contract Workers Protest: విద్యుత్ సంస్థలో దశాబ్దాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ తక్షణమే విలీనం చేసి రెగ్యులర్ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ సుమన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు భారీ నిరసన ధర్నా నిర్వహించారు.

Read Also: CM Chandrababu Visit Cheepurupalli: రేపు చీపురుపల్లికి సీఎం చంద్రబాబు

కోటి రూపాయల ఇన్సూరెన్స్ కల్పించాలి

ఈ సందర్భంగా బొజ్జ సుమన్ మాట్లాడుతూ.. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు రూ. కోటి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, అపరిమిత వైద్య సదుపాయాలు (Unlimited Medical Facilities) అందించాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంస్థలో ఉన్న ఖాళీ పోస్టులను ప్రస్తుతం పనిచేస్తున్న అనుభవజ్ఞులైన కాంట్రాక్ట్ కార్మికులతోనే భర్తీ చేయాలని స్పష్టం చేశారు.

వేతన తారతమ్యాలు తొలగించాలి

ఐటిఐ విద్యార్హత కలిగి ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారికి పాత ఆపరేటర్లతో సమానంగా రూ. 27,953 వేతనం ఇవ్వాలని, కంప్యూటర్ ఆపరేటర్లు మరియు టెక్నికల్ అసిస్టెంట్లకు స్కిల్డ్ వేతనాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. 2021 నుండి ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న పెయిడ్ హాలిడేస్ వెంటనే మంజూరు చేయాలని కోరారు.

Electricity Contract Workers Protest: విజయవాడ ధర్నాకు సిద్ధం

తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో ఏప్రిల్ 27వ తేదీన విజయవాడ కేంద్రంగా భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు విజయరామిరెడ్డి, నాగరాజు, సునీల్, అరిఫ్, రాజ మోహన్నాయుడు మరియు వివిధ డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు, జెన్ కో ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP Electricity News Bojja Suman Collectorate Dharna Electricity Contract Workers Protest Nellore news Regularization of Contract Workers United Electricity Contract Workers Union

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.