Nellore House Tax Collection: పన్నుల వసూళ్లలో వెనుకబడితే షోకాజ్ నోటీసులే.. డీపీఓ వార్నింగ్.

Read Time:  1 min
Nellore House Tax Collection: పన్నుల వసూళ్లలో వెనుకబడితే షోకాజ్ నోటీసులే.. డీపీఓ వార్నింగ్.
FONT SIZE
GET APP

Nellore House Tax Collection: నెల్లూరు జిల్లాలో ఇంటి పన్నుల వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి (DPO) వసుమతి అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరులోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీవోలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. పన్నుల వసూళ్లలో వెనుకబడిన పంచాయతీ కార్యదర్శులకు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆమె స్పష్టం చేశారు.

Read Also: Nellore Solar Project: కనుపర్తిపాడు హైస్కూల్‌లో సోలార్ పవర్ ప్రారంభించిన సెంట్రల్ టాక్స్ కమీషనర్

రూ. 21 కోట్ల బకాయిల లక్ష్యం

జిల్లాలో మొత్తం రూ. 42 కోట్ల ఇంటి పన్ను వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ. 21 కోట్లు మాత్రమే వసూలైందని డీపీఓ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మిగిలిన రూ. 21 కోట్ల బకాయిలను మార్చి 15 నాటికి వసూలు చేయాలని డెడ్ లైన్ విధించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘స్పెషల్ డ్రైవ్’ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Nellore House Tax Collection: మేజర్ పంచాయతీలపై ప్రత్యేక దృష్టి

‘కోవూరు, ముత్తుకూరు, పొదలకూరు, తోటపల్లి గూడూరు, రాపూరు, కోట, వింజమూరు వంటి మేజర్ పంచాయతీలలో ఒక్కో చోట సుమారు రూ. కోటి మేర బకాయిలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో రోజుకు కనీసం రూ. 10 లక్షల చొప్పున పన్నులు వసూలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో గూడూరు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వాణి మరియు పలు మండలాల డిప్యూటీ ఎంపీడీవోలు పాల్గొన్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.