Bar License Allocation: నెల్లూరు జిల్లా లో 21 బార్ లకు లైసెన్స్

Read Time:  1 min
Bar License Allocation: నెల్లూరు జిల్లా లో 21 బార్ లకు లైసెన్స్
FONT SIZE
GET APP

Bar License Allocation: నెల్లూరు జిల్లాలో ఓపెన్ కేటగరీకి సంబంధించిన మొత్తం 21 బార్లకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ద్వారా నోటిఫికేషన్ జారీ చేయబడగా, ఈ 21 బార్లకు సంబంధించి మొత్తం 87 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తులపై గురువారం, నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలోని శంకరన్ హాలులో, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యక్షతన లాటరీ విధానం ద్వారా మొత్తం 21 బార్లను కేటాయించడం జరిగింది.

Read Also: Himanshu Shukla: GST వసూళ్లపై కలెక్టర్ సమీక్ష

అధికారుల సమక్షంలో లాటరీ

ఈ లాటరీ ప్రక్రియలో జిల్లా డిప్యూటీ కమిషనర్ (ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్) ఎమ్ శంకరయ్య, సహాయ కమిషనర్ పి. దయా సాగర్, జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఏ. శ్రీనివాసులు నాయుడు పాల్గొన్నారు. అలాగే సహాయ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రమేష్, సహాయ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) జగదీశ్వర రెడ్డితో పాటు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లు మరియు సబ్-ఇన్‌స్పెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Bar License Allocation
Bar License Allocation: Licenses issued to 21 bars in Nellore district.

లైసెన్స్ ఫీజు వివరాలు(Bar License Allocation)

ఈ లాటరీ ద్వారా నెల్లూరు(Bar License Allocation) మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18 బార్లు, 2025–26 సంవత్సరానికి గాను రూ. 10,12,50,000/- లైసెన్స్ ఫీజుతో కేటాయించబడ్డాయి. కావలి మున్సిపాలిటీ పరిధిలోని 2 బార్లు రూ. 82,50,000/- లైసెన్స్ ఫీజుతో మరియు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 1 బార్ రూ. 26,25,000/- లైసెన్స్ ఫీజుతో కేటాయించబడినవని అధికారులు వెల్లడించారు.

పారదర్శక నిర్వహణ

లాటరీ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా మరియు నిబంధనల ప్రకారం నిర్వహించడం జరిగిందని జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఈ సందర్భంగా తెలియజేశారు. మొత్తం ప్రక్రియ అంతా కలెక్టర్ పర్యవేక్షణలో నిబంధనలకు లోబడి పూర్తి చేయబడింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.