📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Nellore District: స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

Author Icon By Saritha
Updated: March 11, 2026 • 1:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nellore District: నెల్లూరు జిల్లాకు చెందిన భార్యాభర్తలు పెద్ద మనసుతో ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలకు భారీగా విరాళాలు అందజేసి తమవంతుగా సాయం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన బచ్చు కృష్ణకుమార్‌ దంపతులు అమరా బచ్చు ఛారీటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చారు. ఏకంగా కోట్లాది రూపాయల్ని స్కూల్స్, కాలేజీల కోసం ఖర్చు చేస్తున్నారు.

బచ్చు కృష్ణకుమార్ దంపతులు మంత్రి నారా లోకేష్‌ను (Nara Lokesh) కలిశారు. బోగోలు మండలంలోని ప్రభుత్వ స్కూల్స్, ఇంటర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.5 కోట్లు ఇస్తామని ప్రకటించారు. స్కూల్స్, కాలేజీల్లో త్వరలో చేపట్టనున్న ఆయా అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవ్వాలని మంత్రి లోకేష్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ బచ్చు కృష్ణకుమార్ దంపతుల్ని అభినందించారు.

Read Also: Jagan Mohan Reddy: ఆదాయాలు తగ్గినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చాము

Nellore District: A couple who showed their generosity for the development of schools and colleges

వైద్యం, ఆధ్యాత్మిక రంగాలకు భారీ సాయం

అంతేకాదు అమరా బచ్చు ట్రస్ట్ ఆధ్వర్యంలో.. బోగోలు మండలం కొవ్వూరుపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి రూ.5 కోట్లు ప్రకటించారు. అలాగే కొండబిట్రగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి మరో రూ.5 కోట్ల సాయాన్ని అందించనున్నారు.’నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన అమరా ఛారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బచ్చు కృష్ణ కుమార్ దంపతులను ఉండవల్లి నివాసంలో కలిశాను. బోగోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.5 కోట్ల సాయం అందించినందుకు అభినందనలు తెలిపాను’ అంటూ మంత్రి లోకేష్ కూడా ట్వీట్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Amara Bachchu Charitable Trust Bachchu Krishnakumar Bogole Schools Development Nara Lokesh Nellore news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.