📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Nellore Crime: ఇసుకపల్లి బీచ్ లో విషాదం

Author Icon By Saritha
Updated: January 17, 2026 • 2:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇద్దరు మృతి… ఇద్దరు గల్లంతు

అల్లూరు (నెల్లూరు) : (Nellore Crime) అల్లూరు మండలం ఇసుకపల్లి తీర ప్రాంతమైన సముద్రంలో కనుమ పండగరోజు సరదాగా బీచ్కు(beach) వెళ్లిన స్నేహితులలో నలుగురు స్నేహితులు సముద్రంలో గల్లంతు అయినారు. వారిలో ఇద్దరు మృతదేహాలు లభ్యం కాగా మరో ఇద్దరి కోసం మృత్యుకారులు, పోలీసులు గాలిస్తున్నారు. మృతి చెందిన వారు ఎర్రపుగుంట ప్రాంతానికి చెందిన 9వ తరగతి చదువుతున్న ఈగ అమ్ములు(14), ఈగ బాలక్రిష్ణ(15)ఇంటర్మీడియట్, కె. అబిషేక్(16), చేజర్లకు చెందిన గంధర్ల సుదీర్(15) ఇంటర్ చదువుతున్నారు.

Read also: Nandyala: ఇద్దరు చిన్నారులకు విషం ఇచ్చి చంపిన తల్లి.. ఆపై ఆత్మహత్య

(Nellore Crime) వీరిలో మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు రోదనలతో సముద్రతీరం ప్రాంతమంతా విషాధచాయలు అలుముకొన్నాయి. చేతికి అందివచ్చిన పిల్లలు దూరం అవడంతో కన్నతల్లిదండ్రులు కుప్ప కూలిపోయారు. పండగ పూట మెరైన్ పోలీసులు నిర్లక్ష్యంగా వెళ్ళడంతో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. సంఘటనా స్థలంలో కావలి ఆర్డీఓ వంశీక్రిష్ణ, సిఐ పాపారావు, అల్లూరు ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి, మెరైన్ పోలీసు సిబ్బంది, మృత్యకారుల గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మృతి చెందిన ఇద్దరిని పోలీసులు పోస్టుమార్గం నిమిత్తం మృతదేహాలను అల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:



deaths Drowning FRIENDS Isukapalli Beach Latest News in Telugu Marine Police Nalluru Search operation students Telugu News Tragic Incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.