📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Nellore Murder Case: భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

Author Icon By Siva Prasad
Updated: January 31, 2026 • 10:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nellore Murder Case: నెల్లూరు నగరంలోని కోటమిట్టకు చెందిన శ్రీహరికి, ఆత్మకూరుకు చెందిన నందిని (24)కి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. శ్రీహరి ప్రైవేట్ బస్సు సర్వీసులో సూపర్వైజర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే, కొంతకాలం తర్వాత శ్రీహరి ప్రవర్తనలో మార్పు రావడం, విభేదాలు తలెత్తడంతో వీరిద్దరూ విడిపోయారు. నందిని విడాకుల కోసం కోర్టును ఆశ్రయించి, బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది.

Read Also: Australia: భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

పాప కోసం సాగిన మాటలు – మృత్యువుకు దారితీసిన నమ్మకం

పాప తండ్రి వద్దే ఉండటంతో, బిడ్డ కోసం నందిని అప్పుడప్పుడు శ్రీహరితో మాట్లాడేది. ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున బెంగళూరు నుండి నెల్లూరుకు వచ్చిన నందిని, తనను ఆత్మకూరు బస్టాండ్ వద్ద డ్రాప్ చేయాలని శ్రీహరిని కోరింది. భర్త మనసు మారిందని భావించిన ఆమె నమ్మకం, చివరకు ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది.

Nellore Murder Case: The husband stabbed and killed his wife with a knife.

విచక్షణ రహితంగా కత్తితో దాడి

జాతీయ రహదారి వద్ద భార్యను తన బైక్‌పై ఎక్కించుకున్న శ్రీహరి, మార్గమధ్యలో మళ్లీ గొడవ పడ్డాడు. పక్కా ప్రణాళికతో తన వెంట తెచ్చుకున్న కత్తితో నందినిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన నందిని అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. నిందితుడు శ్రీహరి అక్కడి నుండి పరారయ్యాడు.

సమాచారం అందుకున్న బాలాజీ నగర్ సీఐ సాంబశివరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శ్రీహరి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AP News Atmakur Nandini Murder Brutal Murder in Nellore Husband kills wife in Nellore Laest News Nellore Crime News Nellore Murder Case Private Bus Supervisor Crime Srihari Nandini Case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.