Census 2027 India: జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల

Read Time:  1 min
Census 2027 India
Census 2027 India
FONT SIZE
GET APP

Census 2027 India: జనగణన-2027 సర్వే అనేది ఇతర సామాన్య సర్వేల వంటిది కాదని, ఇది రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని జిల్లా కలెక్టర్ మరియు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ హిమా*న్షు శుక్లా పేర్కొన్నారు. మంగళవారం హరనాధపురంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాల సెమినార్ హాలులో జిల్లా అధికారుల కోసం ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణా తరగతులను (ఫిబ్రవరి 24-26) ఆయన ప్రారంభించారు.

Read Also: Nellore House Tax Collection: పన్నుల వసూళ్లలో వెనుకబడితే షోకాజ్ నోటీసులే.. డీపీఓ వార్నింగ్.

రెండు విడతల్లో జనగణన

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2011 తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం ఈ జనగణన జరుగుతోందని తెలిపారు. దీనిని రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు వివరించారు:

  1. తొలి విడత: హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ (ఇళ్ల జాబితా నమోదు).
  2. రెండవ విడత: అసలైన జనగణన (వ్యక్తుల వివరాల సేకరణ).

Census 2027 India: అపోహలు వద్దు – అభివృద్ధికి బాటలు

జనగణన జరిగితే ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయనే అపోహ ప్రజల్లో ఉందని, అది కేవలం భ్రమ మాత్రమేనని కలెక్టర్ స్పష్టం చేశారు. జనగణన ద్వారా వచ్చే గణాంకాల ఆధారంగానే కొత్త గ్రామాలు, మున్సిపాలిటీలు ఏర్పడతాయని, ఇది దేశాభివృద్ధికి దిక్సూచి వంటిదని ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లా ప్రస్తుతం అన్ని రంగాల్లో 5వ స్థానంలో ఉందని, ఈ సర్వే నిర్వహణలో జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని అధికారులను కోరారు.

అధికారుల సమన్వయం అవసరం

ఈ ప్రక్రియలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు. శిక్షణకు హాజరుకాని అధికారులకు వివరాలను చేరవేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవిన్యూ అధికారి విజయ కుమార్, జనగణన సహాయ సంచాలకులు శ్రీనివాస రావు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.