📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Nellore Mahila Jana Sunwayi: నెల్లూరు మహిళా జన సున్వాయి కార్యక్రమం

Author Icon By Siva Prasad
Updated: March 6, 2026 • 8:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nellore Mahila Jana Sunwayi: జిల్లాలోని మహిళల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి రాయపాటి శైలజ ఆధ్వర్యంలో ఈ నెల 9 న మహిళా జన సున్వాయి పేరు తో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటన లో తెలిపారు.

Read Also: Andhra Pradesh: కరెంట్ ఛార్జీల పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Nellore Mahila Jana Sunwayi program

ఎవరు ఫిర్యాదు చేయవచ్చు?

జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు మహిళా జన సున్వాయి ( మహిళా సమస్యల పరిష్కార వేదిక ) కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని జడ్పి మీటింగ్ హాల్ లో సోమవారం ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, లీగల్ సెల్ ప్రతినిధులు, పోలీస్ అధికారులు పాల్గొని మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వాటిపై తక్షణ చర్యలు తీసుకుంటారని తెలిపారు. గృహ హింస, వేధింపులు లేదా ఇతర అన్యాయాలకు గురైన మహిళలు ఈ ప్రత్యేక డ్రైవ్‌ ను సద్వినియోగం చేసుకుని తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. ఆరోజున అందిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటామని తెలిపారు. కావున జిల్లాలోని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP State Women's Commission Collector Himanshu Shukla. Domestic Violence Complaint Nellore national-commission-for-women Nellore Mahila Jana Sunwayi Rayapati Sailaja Women's Commission Women Grievance Cell Nellore

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.