Nellore Autonagar Fire Accident: నెల్లూరు ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం

Read Time:  1 min
Nellore Autonagar Fire Accident: నెల్లూరు ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం
FONT SIZE
GET APP

Nellore Autonagar Fire Accident: నెల్లూరు నగరంలోని ఆటోనగర్ ఫేజ్-1లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ చెత్త దుకాణంలో మంటలు చెలరేగడంతో భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది.

Read Also: Milk contamination : రాజమండ్రి కల్తీ పాలు షాక్, బాధితుల ఆరోగ్యం ఆందోళనకరం

మంటలు చెలరేగిందిలా..

రంగనాయకుల పేటకు చెందిన పఠాన్ అక్బర్ ఖాన్ ఆటోనగర్‌లో ప్లాస్టిక్ చెత్త దుకాణం నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ వాకా శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Nellore Autonagar Fire Accident: రూ. 10 లక్షల నష్టం

ఈ ప్రమాదంలో సుమారు రూ. 10 లక్షల విలువ చేసే ఆస్తి కాలిబూడిదైనట్లు బాధితుడు అక్బర్ ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వేదయపాలెం పోలీస్ స్టేషన్ సీఐ కె. శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

నిర్లక్ష్యమే కారణమా?

దుకాణం సమీపంలో ఎవరో ఆకుతాయిలు సిగరెట్ తాగి విసిరివేయడం వల్ల మంటలు అంటుకున్నాయని, ప్లాస్టిక్ కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపడుతున్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.