ASP Deeksha Nellore: షబ్-ఎ-బరాత్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన టౌన్ ఏఎస్పీ

Read Time:  1 min
ASP Deeksha Nellore
ASP Deeksha Nellore
FONT SIZE
GET APP

ASP Deeksha Nellore: షబ్-ఎ-బరాత్ (జాగరణ రాత్రి) సందర్భంగా నెల్లూరు టౌన్‌లో జరుగుతున్న ప్రార్థనా కార్యక్రమాలను టౌన్ ఏఎస్పీ దీక్ష పరిశీలించారు. ఈ సందర్భంగా నెల్లూరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మసీదులను సందర్శించి, అక్కడ చేపట్టిన కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు. షబ్-ఎ-బరాత్ రంజాన్ మాసానికి సుమారు 15 రోజుల ముందు వచ్చే పవిత్ర జాగరణ రాత్రి కావడంతో, తెల్లవారుజామున పెద్దల సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిగే నేపథ్యంలో, అక్కడ కూడా భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.

Read Also:Nellore Comprehensive Family Survey: సమగ్ర కుటుంబ సర్వేను వేగవంతం చేయండి:హిమాన్షు శుక్ల

ASP Deeksha Nellore: ముఖ్యమైన మసీదులు, ప్రార్థనా స్థలాలు, రద్దీ ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పండుగ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక మసీదు కమిటీలు, పెద్దలతో సమన్వయం కొనసాగించాలని పోలీస్ అధికారులకు తెలిపారు. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద విషయాలు గమనించినా వెంటనే స్థానిక పోలీసులకు, డయల్ 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.