📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Nellore: బయల్పడిన 14వ శతాబ్దంనాటి నాగేశ్వరాలయం

Author Icon By Saritha
Updated: February 3, 2026 • 1:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చేజర్ల (నెల్లూరు) : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (Nellore) చేజర్ల మండలంలో పెరుమాళ్ళపాడు గ్రామం సమీపంలో పెన్నా నది ఇసుక మేటల్లో కలిసిపోయిన పురాతన నాగేశ్వర స్వామి ఆలయానికి మళ్లీ పూర్వ వైభవం రానుంది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana) ప్రత్యేక చొరవతో నూతన ఆలయ నిర్మాణానికి రూ.1 కోటి 50 లక్షలు నిధులు మంజూరవ్వడంతో శైవ భక్తుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.

రెండు నెలల తవ్వకాల్లో వెలుగు చూసిన చరిత్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గత రెండు నెలలుగా చేపట్టిన తవ్వకాల్లో అత్యంత ప్రాచీనమైన శైవక్షేత అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తవ్వకాల్లో వరశురాముడు ప్రతిష్టించిన శివలింగం గుర్తించబడింది. ఈ శివలింగాన్ని గ్రామస్తులు తరతరాలుగా నాగేశ్వర స్వామిగా పూజిస్తూ వచ్చారని వూర్వికులు చెబుతున్నారు. గ్రామ పెద్దల కథనాల ప్రకారం ఈ ఆలయం 14వ శతాబ్ధానికి చెందినది. పెన్నా నదిలో కాలక్రమేణా ఇసుక మేటలు ఏర్పడటం, పడమటి గాలుల తీవ్రత పెరగడంతో సుమారు 200 సంవత్సరాల క్రితం అప్పటి గ్రామస్తులు ఆ ప్రాంతాన్ని వదిలి నది తీరానికి కొంత దూరంలో నూతన గ్రామాన్ని నిర్మించుకున్నారు. అప్పటి నుంచే ఆలయం క్రమంగా ఇసుకలో కూరుకుపోయింది.

West Godavari: ఎసిబికి చిక్కిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు

A 14th-century Nageswara temple has been unearthed.

వందల ఎకరాల ఆలయ భూములు

(Nellore) ఈ నాగేశ్వరాలయానికి అప్పట్లో వందల ఎకరాల భూములు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. కాలక్రమంలో ఆలయ ప్రాధాన్యత తగ్గడంతో ఈ చారిత్రక క్షేత్రం గుర్తింపును కోల్పోయింది. కరోనా సమయంలో పెన్నా నది తీర ప్రాంతంలో సంచరిస్తున్న గ్రామ యువకులు ఈ పురాతన నాగేశ్వర స్వామి ఆలయ అవశేషాలను గుర్తించారు. అప్పట్లో కొంత ఇసుకను తొలగించగా ఆలయ శిఖరం బయటపడింది. అప్పటి నుంచి గ్రామస్తులంతా ఐక్యంగా ఆలయ పునర్నిర్మాణం కోసం కృషి చేస్తున్నారు. వారి విజ్ఞప్తిని మంత్రి ఆనం దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్పందించి వెంటనే చర్యలు చేపట్టారు.

విగ్రహాల దర్శనానికి భక్తుల వెల్లువ, నూతన ఆలయానికి స్థలం మంజూరు

తాజాగా జరిపిన తవ్వకాల్లో నాగేశ్వర స్వామి, నందీశ్వరుడు, పార్వతి అమ్మవారు, విఘ్నేశ్వర స్వామి విగ్రహాలు వెలుగులోకి రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఈ అరుదైన పురాతన విగ్రహాలను దర్శించుకునేందుకు భక్తులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ ఆలయం పట్ల ప్రత్యేక దృష్టి సారించి దేవాదాయ శాఖ నుంచి నూతన ఆలయ నిర్మాణానికి స్థలం కూడా మంజూరు చేశారు. త్వరలోనే శాస్త్రోక్తంగా, ఆధునిక సౌకర్యాలతో నూతన నాగేశ్వర స్వామి ఆలయం నిర్మించనున్నారు. శైవక్షేత్రంగా మళ్లీ పెరుమాళ్ళపాడు. శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న నాగేశ్వరాలయం పునరుద్ధరణతో పెరుమాళ్ళపాడు ప్రాంతం మరోసారి ప్రఖ్యాత పర్యాటర క్షేతంగా మారనుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anam Ramanarayana Reddy Chejarla Latest News in Telugu Nageswara Swamy Temple Nellore Telangana Temple Funding Telugu News Temple renovation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.