📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : Free : ఉచిత ‘తంత్రం’పై ఆలోచించాలి..

Author Icon By Sudha
Updated: December 5, 2025 • 4:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అధికారంలో లేన్నప్పుడు ఉచితాల గురించి విమర్శించినవారే, తీరా అధికారంలోకివస్తే అదే ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచితతంత్రాన్ని మొదలెట్టడం చూస్తూనే ఉన్నాం. ఎవరికి వారే ఆపద్దర్మ మంత్రం పాటిస్తుంటారు. ఆపద్ధర్మానికి అయినా ఓటర్లకు ఆశ పెట్టి తాత్కాలిక లబ్ధిని సమకూ ర్చడం అంత మర్యాద కాదు. ఉచితాల (Free) పంపిణీ వలన జనంలో పేదరికం తగ్గిపోయిందని, అలాంటి తంత్రాలు వారిలో సోమరితనాన్ని పెంచుతుందని విమర్శలు చాలా నే వచ్చాయి. అయినా ఎవరూ లక్ష్య పెట్టిన దాఖలాలు లేవు. రాజకీయాల్లో వాగ్దానాలు చేయడం పరిపాటి. అది ఆయా పార్టీల ఆలోచనా విధానాన్ని ప్రజలకు తెలియ చేసే ఉద్దేశ్యమే కనుక దానిని ఎవరూ తప్పు పట్టరు. ఎన్నికల సమయంలో ఉచితానుచితాలు మరచి ఎప్పటి కప్పుడు ఆకర్షణీయ పథకాలను గుప్పిస్తున్నారు. తాజాగా బీహార్లో ఏం జరిగిందో ఓటర్లకందరికీ ఎరుకే. తక్షణ ప్రయోజనం వచ్చే వ్యూహాన్ని వెలుగులోకి తెచ్చారు. అధికార పార్టీ లబ్ది పొందిన విషయం విదితమే. అప్పటికప్పుడు ఖర్చయ్యే తాత్కాలిక లబ్ది పేదవారికి ఎంతకాలం అక్కరకు వస్తాయో తెలియనిది కాదు. అంచనా వేసుకో వచ్చు. ముందు గుప్పించిన ధర్మ పన్నాలను పక్కనపెట్టి ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికన్నట్లు ఉచితాల (Free)మీద ఉచితాలు ప్రకటిస్తున్నారు. వీటివలన పేదలకు చెప్పుకోద గిన శాశ్వత ప్రయోజనం దక్కదు సరికదా, అత్యవసరం గా లాభపడేది పార్టీలు. ప్రభుత్వాలు ఆర్థికంగా దివాలా కొడుతున్నాయి. మళ్ళీ అప్పులకు దేబిరించడంమామూలే. ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికది చాలునన్నట్లు వ్యవహరించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఉచిత పథకాలతో ప్రజలు సోమరులుగా మారి, పనిచేయడానికి ముందుకు రారని సుప్రీంకోర్టు చేసిన హెచ్చరికనుఎవరూ పట్టించుకున్నట్లు లేదు. అత్యున్నత ధర్మాసనం వ్యాఖ్యా నించారని కాదు కానీ ప్రజల బతుకులు బాగుపడే శాశ్వత ఆలోచన చేయడమే ప్రభుత్వ కర్తవ్యం కావాలి. ప్రస్తుత పరిస్థితులలో ఓటు కొనుక్కోకూడదు. ఓటు అమ్ముకోకూ డదు అని చెబితే వినే వారెవరూ లేరు. ఉచితాల పంపిణీ లపై రాజకీయ నాయకులకు కనువిప్పు కావాలి. ప్రభుత్వం ద్వారా అన్నీ ఉచితంగా పొందాలనే మనస్తత్వం కారణం గా దేశంలో అభివృద్ధి కుంటుపడిపోతోంది. ఉచిత పథకా లకి ఖజానా ఖాళీ అయిపోతోంది. దానిని నింపడానికి మళ్ళీ అప్పులు. ఈ పద్దతి ఏ ప్రభుత్వానికీ మర్యాద కాదు. లక్షల కోట్లు అప్పులు తెచ్చి, వడ్డీలు కట్టలేక, ఉద్యో గుల జీతాలు కూడా భారమై ప్రభుత్వాలు నవ్వుల పాలు తున్నాయి. జీతాలు కూడా చెల్లించలేనప్పుడు మళ్లీ జనం నుంచే వసూలు చేయాలి. అంటే ముఖ్యంగా అధికారం లోకి రావడానికి అనేక విధాలుగా ఉచిత పథకాలపై హామీలు గుప్పిస్తూ, తీరా అధికారంలోకి వచ్చాక చేతు లెత్తేయడం, లేదా అప్పుడు వాటి చర్చల్లోకి దిగడం ఏ మాత్రం పద్ధతిగా లేదు. దీనిపై సుప్రీం ధర్మాసనం గట్టి గానే హెచ్చరించింది. ఉచిత రేషన్, ఉచిత గ్యాస్, ఉచిత ఇల్లు, ఉచిత బియ్యం, ఉచితంగా పెన్షన్, ఉచితంగా రాజ్యాంగ పరంగా ఇలాంటి వాటిపైనా ఆంక్షలు ఉండాలి. ఎన్నికల సంఘం కూడా దీనిపై దృష్టి సారించాలి. సంక్షేమం అవసరమే కానీ మోతాదు మించకుండా చూసుకోవ డం మంచి పద్ధతి. ఆధునిక భారత దేశం అంధకార యుగంలోకి జారిపోతోందని ప్రధాని నరేంద్ర మోడీ ఒకా నొక సందర్భంలో ఆందోళన వ్యక్తం చేసారు. ఉచితాలను అమలు చేస్తే ఎక్స్ ప్రెస్ వేలు, విమా నాశ్రయాలు, రక్షణ కారిడార్లను నిర్మించలేమని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ 2022 జూలైలో యూపీలో బుందేల్ అండ్ ఎక్స్ న్ వేను ప్రారంభిస్తూ హెచ్చరించారు. ఆనాడు దీనిని అనేక రాజకీయపార్టీలు కూడా వ్యతిరేకించాయి. మోడీకి సంక్షేమం పట్ల సానుకూల వైఖరి లేదని విమర్శించారు. కానీ ఎంతో విచిత్రంగా ఆ తర్వాత ఏడాది మధ్యప్రదేశ్లో లాక్షీ మోహనాపథకం క్రింద మహిళలకు నెలకు రూ.1250 చొప్పున చెల్లిస్తామని, క్రమంగా దాన్ని రూ. 3వేల వరకు పెంచుతామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. మొన్న మహారాష్ట్రలో కూడా ఇదేవిధంగా ఇలాంటి పథ కాన్నే ప్రకటించారు. గెలిచి బయటపడ్డారు. నిన్న మొన్నటి బీహారు ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. ఎన్నికల ముందే పంచి పెట్టేశారు. పైగా ప్రభుత్వపరంగా ముందే తాయిలా లు విసిరేశారు. అంతకు ముందు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూడా అంతేచేసింది. దీన్నిబట్టి ఉచితాలను వ్యతి రేకించినవారే సమయానుకూలంగా వాటిని అనుమతించ గలరని అర్థం చేసుకోవచ్చు. దాని మహత్యం అలాంటిది. నగదుబదిలీల వల్ల ప్రజల విని యోగ సామర్థ్యం పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఎంతో కొంత తోడ్పడుతుందనే వాదన ఒకటి ఉన్నది. అయితే ఉచిత మంత్రం అన్నిసార్లూ అందరికీ ఉపయోగపడదన్నది నిన్న మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో కేజీవాల్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ వంటి వారి ఓట మిని ఆపలేకపోయాయి. అందుకే అధికారంలో ఉన్న రాజ కీయ పార్టీలు ఉచితాల విషయమై రాజ్యాంగపరంగా నిషేధాలు విధించడం అవసరమేమో ఆలోచించాలి. రెండు రోజులక్రితం
రాజకీయాల్లో ఉచితాల సంస్కృతిని మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తప్పు పట్టారు. అవి భారతదేశ ఆర్థిక పరిస్థితిని ఆందోళనకర స్థాయికి తీసుకెళ్తాయని అన్నారు. తక్షణం వాటిని నివా రించాలని ఈ బాధ్యతను కేంద్రప్రభుత్వమే తీసుకోవాలని కోరారు. ఒకసారి ఉచిత పథకాలు ప్రవేశ పెట్టాక వాటిని సమీక్షించుకునేందుకు ఏ ప్రభుత్వానికి ధైర్యం ఉండదు. ఇలాంటి పరిస్థితులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని నిర్దిష్ట ప్రయోజనాలు మేరకే వాటిని కొనసాగిస్తే దేశానికి మేలు జరుగుతుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News free scheme freebies Governance latest news Politics Public Policy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.